పెంచిన ఇంటి పన్నులు రద్దు చేయకపోతే మరో ఇంటి పన్నుల పోరాటం చేస్తాం...సిపిఎం నాయకుల హెచ్చరిక...

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :

కర్నూలు నగర కార్పొరేషన్ అధికారులు పెంచిన ఇంటి పనులు తగ్గించకపోతే గతంలో కల్లూరు కాలనీలో ఇంటి పన్నులు పెంచినప్పుడు చేసిన పద్ధతుల్లో పెంచిన ఇంటి పనులకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నిర్మల, రాముడు హెచ్చరించారు.బుధవారం స్థానిక కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పెంచిన ఇంటికి తగ్గించాలని విస్తరించిన కాలనీలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని రద్దయిన క్యాప్ ఆటోలను తిరిగి పునరుద్ధరించాలని మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం.రాజశేఖర్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిపిఎం పార్టీ మార్చి, 8వ తేదీ నుండి ప్రజా చైతన్య యాత్ర పేరుతో నగరంలో వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగిందని,తమ దృష్టికి వచ్చిన సమస్యలు మున్సిపల్ అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని తెలిపారు.నగరంలో మున్సిపల్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఎన్.ఆర్.పేట,కొత్తపేట,ప్రకాష్ నగర్ లాంటి ప్రాంతాలతో పాటు కొత్తగా విస్తరించిన కాలనీలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని,మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేయడానికి పెట్టే పెట్టే శ్రద్ధలో సగభాగం త్రాగునీటి సౌకర్యం కోసం కేటాయిస్తే కర్నూలు నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని విమర్శించారు.2009లో అప్పటి జనాభాకు తగ్గట్టుగా నిర్మించిన సమ్మర్ స్టోరీస్ ట్యాంకు మినహా ఆ తర్వాత మరో సంవత్సర స్టాంప్ నిర్మాణం చేపట్టాలని,ఒత్తిడి వచ్చిన మున్సిపల్ అధికారులు రెండవ సంవత్సర స్టాంప్ నిర్మాణం చేపట్టలేదని తెలియజేశారు.జనాభా పెరుగుతుంది దానికి తగ్గట్టుగా పైప్ లైన్ మార్చాలని, కనీస జ్ఞానం కూడా మున్సిపల్ అధికారులకు లేదన్నారు.అధికారంలో కూర్చున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ పరిపాలన చేస్తుందా లేదా కూటమి పరిపాలన చేస్తుందా ప్రజలకు సమాధానం చెప్పాలని తెలియజేశారు.గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ పరిధిలో 196,197,198జీఓలను తీసుకుని వచ్చి ప్రతి సంవత్సరం 15శాతం ఇంటి పనులు పెంచేలా చేసిందని,ఆనాడు ఆ జీవోలను వ్యతిరేకించి,మేము అధికారంలోకి వస్తే తక్షణమే రద్దు చేస్తామన్న చంద్రబాబు ఆ జీఓలను అలాగే కొనసాగించి ప్రతి సంవత్సరం 15శాతం ప్రజలపై పన్నులు వేసే పద్ధతిని కొనసాగించడం అంటేనే జగన్ ప్రభుత్వానికి టిడిపి కూటమి ప్రభుత్వానికి తేడా లేదని చాలా స్పష్టంగా అర్థం అవుతుందని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వమే పరిపాలన చేస్తుంటే 198 జీవనం తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.అలాగే నగరంలో పారిశుద్ధ్య కార్మికుల కొరత కారణంగా మురికి కాలువల శుభ్రత నానాటికి తీవ్రమవుతున్నదని రోడ్లమీదకి మురికి నీరు వస్తున్న మున్సిపల్ అధికారులకు పట్టడం లేదని ఉన్న కార్మికుల ప్రియమైన భారం వేసే పద్ధతిని కొనసాగిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని వారు తెలిపారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని,రద్దు చేసిన క్యాబ్ ఆటో లను తిరిగి పునరుద్ధరించి నగరంలో ఇంటింటికి చెత్త సేకరించి పద్ధతిని కొనసాగించాలని వారు అన్నారు.టిడ్కో ఇండ్లలో నివాసం ఉంటున్న వారికి కన్వెన్షన్ సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ వైఫల్యం చెందిందని విమర్శించారు.కర్నూలు నగర కార్పొరేషన్ లో ఉన్న పాలకమండలికి ఈ విషయాలు ఏవి పట్టమని ఎక్కడ కమిషన్లు వస్తాయి,ఏ రకంగా డబ్బులు సంపాదించాలనే తపన తాపత్రయం తప్ప,నగరం అభివృద్ధి గురించి లేదన్నారు.నగరంలో ఉన్న శాసనసభ్యులకు కానీ ప్రజా సమస్యలు పట్టడం లేదని వారు విమర్శించారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు నగర ప్రజలపై భారం వేయకుండా పెంచిన పనులు తగ్గించాలని జీఓ నెంబర్ 198నే రద్దు చేయాలని,మరో సంవత్సర నిర్మాణం కోసం నిధులు కేటాయించి తక్షణమే నిర్మాణాన్ని చేపట్టాలని వారు తెలిపారు.అనంతరం అక్కడికి వచ్చిన అడిషనల్ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చి వివిధ కాలనీలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు సాయిబాబా,సుధాకరప్ప, నరసింహులు,విజయ్,షరీఫ్,అబ్దుల్లా,రామకృష్ణ,నగేష్,అలివేలమ్మ,అరుణ,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...