Posts

Showing posts from December, 2025

అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు...అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్...

Image
అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్ VS9TV న్యూస్,గుంటూరు :  గుంటూరు జిల్లా,బ్రోడిపేటలో పేరున్న వ్యాపారి రవి చౌదరి (34).ఇంట్లో పెద్ద ఉమ్మ డి కు టుంబం.భార్య శ్రావణి ఇల్లు చక్క బెడుతుంది కానీ,భర్తతో మాట్లాడటం మానేసింది.పడ కగదిలో కూడా దూరం పెరిగింది.అయితే మొన్న మంగళవారం రాత్రి రెండు గంటలకు, శ్రావణి బాత్రంలో ఎవరితోనో నవ్వుతూ,గుసగుసగా మాట్లాడటం రవికి వినిపించింది.ఈ నేపథ్యంలో పాత లవర్ తో మాట్లాడుతోందేమో అని రక్తం మరిగిపోయింది అని రవి చె ప్పాడు.రచ్చ చేస్తే పరువు పోతుందని భయపడి,గట్టిగా నిలదీస్తే అసలు నిజం తెలిసింది. శ్రావణి ఫోన్లో మాట్లాడింది లవర్ తో కాదు...'దోస్త్' (Dostt) యాప్ లో హైద రాబాద్ కి చెందిన వంశీ అనే ఒక అపరిచితుడితో! భర్త వ్యాపారంలో పడి పట్టించుకోవట్లేదని, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఆమె ఆ యాప్ లో ఏడుస్తూ చెప్పుకుంది.ఇక్కడే అ సలు ట్విస్ట్ ఉంది.ఈ అపరిచితుడు ఆమెను తప్పుదారి పట్టించలేదు."అమ్మాయి,మీ ఆ యన బిజినెస్ టెన్షన్ లో ఉండి ఉంటాడు.రేపు మంచిగా రెడీ అయ్యి,ఆయనకు ఇష్టమైన గోంగూర మటన్ వండిపెట్టి ప్రేమగా మాట్ల...

తమిళనాడులో దారుణం...వేట కొడవళ్ళతో వలస కార్మికుడిపై దాడి...

Image
తమిళనాడులో దారుణం వేట కొడవళ్ళతో వలస కార్మికుడిపై దాడి ఘటనను సెల్ ఫోన్ లో రికార్డ్ సోషల్ మీడియాలో హల్ చల్  VS9TV న్యూస్,తమిళనాడు : తమిళనాడు,తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వ చ్చింది. మధ్యప్రదేశ్ కు చెందిన సిరాజ్ అనే వలస కార్మికుడిపై నలుగురు బాలురు కత్తులు వేటకొ డవళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు.ఈ అమానవీయ ఘటనను నిందితులు త మ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడం,ఆ వీడియో సోషల్ మీడి యాలో వైరల్ కావడంతో స్థానికంగా తీవ్రకలకలం రేగింది.వివరాలు ఇలా ఉన్నాయి....రైలు ప్రయాణంలో ఉన్న ప్పుడు మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది.కదులుతున్న రైలులో నే నిందితులు సిరాజు ఆయుధాలతో బెదిరిస్తూ భయపెట్టారు.ఆ తర్వాత అత డిని రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేటకొడవళ్లతో దారుణంగా న రికారు.ఈ దాడి చేస్తున్న సమయంలో ఒక నిందితుడు ఏమా త్రం భయం లేకుండా కెమె రా వైపు విక్టరీ సింబల్ చూపించడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠగా నిలిచింది. రీల్స్ కోసం ఉన్మాదం :  నిందితులు ఈ ఘోరమైన దాడిని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.సోషల్ మీడియా లో (ముఖ్యంగా ఇన్స్టామ్ రీ...

షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్...

Image
షోరూమ్ ముందే ఆటోను తగలబెట్టిన డ్రైవర్ VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మోహన్ సోలంకి ఒక బజాజ్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కొ న్నాడు.ఒకసారి ఛార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని మోహన్‌కి బజాజ్ సిబ్బంది చెప్పారు.మొదట 174 కిలోమీటర్ల రేంజ్ వచ్చిందట.అయితే ఇటీవల అది అకస్మాత్తుగా 7 0 నుంచి 74 కిలోమీటర్లకు పడిపోయిందని మోహన్ సోలంకి ఆరోపిస్తున్నాడు.బజాజ్ షోరూమ్ చుట్టూ ఎన్నిసార్లు తిగిరినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించా డు.ఈ సమస్యపై డిసెంబర్,14న సోలంకి తన ఆటోను గాడిదకు కట్టి లాగుతూ షోరూ మ్‌కు తీసుకువచ్చి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు.ఇక ఇప్పుడు షోరూ మ్ ముందే ఆటోను తగలబెట్టాడు.సోలంకి ఈ ఆటోను 17 నెలల క్రితం ఐదు లక్షలకు కొనుగోలు చే శాడు.రూ.70 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి,మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.10,655 చొ ప్పున 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంది.ఇప్పటివరకు ఆయన 14వాయిదాలను పూ ర్తి చేశాడు.ఇప్పుడు షోరూమ్ దగ్గరికి తీసుకువచ్చి నడిరోడ్డు మీద ఆటోను తగలబెట్టాడు. అక్కడే ఉన్న సోలంకి భార్య కన్నీరుమున్నీరయ్యారు.సోలంకి సోదరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.అ...

క్రమ శిక్షణతో మెలగాలి...

Image
క్రమశిక్షణతో మెలగాలి చట్టాల గురించి తెలుసుకోవాలి సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి ట్రైనీ కానిస్టేబుల్స్ కు దిశా నిర్దేశం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి నూతనంగా ఎంపికై,శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పో లీసు శిక్షణ కేంద్రంకు (డిటిసి) విచ్చేసిన 205 మంది ఎపిఎస్పీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం దిశా నిర్దేశం చేశారు.క్రమశిక్షణతో మెలగాలని సూచించారు.జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంను జిల్లా ఎస్పీ పరిశీలించారు.కర్నూలు అమి లియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఎపిఎస్పీ ట్రైనీ పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వ హించారు.ముందుజాగ్రత్తలతో టిటి ఇంజెక్షన్ లు వేయించారు.ఈ సందర్భంగా జిల్లా ఎ స్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు.శిక్షణ సమ యంలో క్రమశిక్షణతో మెలగాలన్నారు.కొత్త కొత్త నేరాలకు అనుగుణంగా పోలీసులు మరింతగా సాంకేతిక వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.సమన్వయంతో,మానవతా దృక్పథంతో పని చేసి,సమస్యలను పరిష్కరించే విధంగా ఉండాలన్నారు.చట్టాల గురిం చి తెలుసుకోవాల...

ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం...

Image
ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్న కూటమి ప్రభుత్వం విశాఖపట్నం ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులపై  రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన రౌడీషీట్ ను వెంటనే ఎత్తివేయాలి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : విద్యార్థి,నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భా రత యువజన సమాఖ్య నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం రౌడీషీట్ ను ఓపెన్ చేయడం దు ర్మార్గమని ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.బుధవారం నాడు సిఆర్ భవన్ లో జరిగిన విలేకర్ల ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,ఏఐఎస్ఎఫ్ జి ల్లా అధ్యక్షులు డి.సోమన్న మాట్లాడు తూ విద్యార్థులకు యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హా మీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తున్న ఏఐఎస్ఎఫ్,ఏఐ వైఎఫ్ నాయకులపై ఉద్యమాలకు సంబంధించిన పాతకేసులు తోడి నేడు విశాఖపట్నం లో ఐదు మంది విద్యార్థి యువజన నాయకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి సిగ్గుచేటని ఈ ఆలోచనలో తక్షణమే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థి యువ జ న నాయకత్వం రెండు సంవత్సరాలక్రితం వైసీపీ ప్రభుత్వం బైజు సంస్థతో చేసుకున్న ఒ ప్పందాన్ని రద్దు చేయాలని చెప్పారు.ఆందోళన చేసిన నాయకులపై...

ఐదు జాతీయ అవార్డులు,నంది,ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ప్రకాష్ రాజ్...

Image
ఐదు జాతీయ అవార్డులు,నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సాధించిన ప్రకాష్ రాజ్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ రాయ్ కాగా,దర్శకుడు బాలచందర్ సూచనతో తన పేరును మార్చుకుని 'డ్యుయెట్' చిత్రంతో గుర్తింపు పొందారు.బహు భా షా కోవిదుడైన ఆయన ఐదు జాతీయ అవార్డులతో పాటు పలు నంది,ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ను గెలుచుకున్నారు.నెలకు రూ.300 సంపాదనతో సు మారు 2,000 వీధి నాటకాలు వే సిన నేపథ్యం ఉన్న ఆయన,నటుడిగానే కాకుండా నిర్మాతగా,దర్శకుడిగా కూడా రాణిం చారు.వ్యక్తిగత జీవితంలో 2009లో మొదటి భార్య లలిత కుమారితో విడాకులు తీసుకు న్న అనంతరం 2010,ఆగస్ట్,24న బాలీవుడ్ కొరి యోగ్రాఫర్ పోనీ వర్మను రెండో వివా హం చేసుకున్నారు. ఈ దంపతులకు వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు.విశేషమేమిటంటే 2021లో తమ 11వ వివాహ వార్షికోత్సవం నాడు తన కుమారుడి కోరిక మేరకు మొదటి భార్య పిల్లల సమక్షంలో పోనీ వర్మను ఆయన మళ్ళీ వివాహం చేసుకున్నారు.సామాజిక బాధ్యత గా గ్రామాలను దత్తత తీసుకున్న ఆయన ప్రస్తుతం రాజమౌళి-మహేష్ బాబుల సినిమాలో కీ లక పాత్ర పోషిస్తున్నారు.

దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి...

Image
దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కేరళ,అలప్పుజకు చెందిన దివ్య అనే బాలిక ఢిల్లీలోని కేరళ స్కూల్‌లో 9వ తరగతి చదు వుతోంది.రాత్రి సమయంలో ట్యూషన్ ముగించుకుని తన తల్లితో కలిసి ఇంటికి వెళ్తుం డగా,ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె తల్లిని కిందకు తోసేసి,మెడలోని గొలుసును లా క్కొని పారిపోయాడు. తల్లి కింద పడిపోవడాన్ని చూసిన దివ్య ఏమాత్రం భయపడ కుం డా దొంగను వెంబడించింది. రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తి అతడిని దైర్యంగా పట్టు కుంది.గత ఐదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న దివ్య,తన నైపుణ్యంతో దొంగను లొంగదీసి కిందకు పడవేసింది.అనంతరం స్థానికుల సహాయంతో అతడిని పోలీసులకు అప్పగిం చారు.గొలుసు కంటే కూడా,మా అమ్మను కిందకు తోసేయడం చూసినప్పుడు నాకు కలి గిన ఆగ్రహమే నన్ను అతడిని పట్టుకునేలా చేసింది అని దివ్య పేర్కొంది.ఆపత్కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపిం చింది.దివ్య చూపిన సాహసాన్ని కచ్చితంగా అభినందించాలి.

రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి...జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి...

Image
రేషన్ సరుకులను ఎలాంటి అక్రమాలకు   తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి 65 ఏళ్లు పైబడిన వృద్ధులు,దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ సరుకులను అందచేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి VS9TV న్యూన్,కర్నూలు కలెక్టరేట్ : రేషన్ షాపుల ద్వారా సరుకులను ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు.మంగళవారం హెూళ గుంద మండల కేంద్రంలో ప్రభుత్వ చౌకధరల దుకాణం-03ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశా రు.ఈ సందర్భంగా కలెక్టర్ ఎ.సిరి రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ,స్టాక్ వివరాలు,ఈ పా స్ యంత్రాల వినియోగం,కార్డుదారులు హాజరు నమోదు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి కార్డుదారుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయిలో నాణ్యమైన ని త్యావసర సరుకులు అందించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచిం చారు.రేషన్ దుకాణాల్లో పారదర్శకతను పాటిస్తూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పంపిణీ జరగాలని డీలర్ ను ఆదేశించారు.అనంతరం 65 సంవత్సరాలు ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న హెూమ్ డెలివరీ ప్రక్రియను పరిశీలించారు.ప్రతి నెల నిర్దేశించిన తేదీ...

కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి...తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతున్న యదర్థగాధ...

Image
కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతున్న యదర్థగాధ VS9TV న్యూస్,కర్ణాటక : కార్యేచ అర్థేచ ధర్మేచ మోక్షెచ నాతి చరామి అనే పెళ్ళినాటి ప్రమాణాలు తుంగలో తొక్కి అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు.ఈ యదార్ధ గాథ చదివితే అమ్మో ఇలా కూడా వుంటా రా అనుకుంటారు.వివరాలు ఇలా ఉన్నాయి... కర్ణాటకలోని దార్వాడలో శివన్న కాశమ్మ దంపతులు తమ ముగ్గురు ఆడపిల్లలతో ఏ లోటు లేకుండా చూసుకుంటూ పత్తి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో పెద్ద అమ్మాయి శివానికి కోరికలు ఎక్కువ luxury గా బ్రతకాలి అనే ఆశ ఎక్కువ. ఈ తరుణంలో ఇంట్లో ఆర్థికంగా గొప్పగా లేక ఈమె కోరికలు తీరేవి కావు. పత్తి కొనుగోలుకి సురేష్ అనే handsome Guy car lo శివన్న ఇంటికి వచ్చేవాడు అతని లుక్స్ మెయింటెన్స్వ్ నచ్చిన శివాని అతనికి ఎలాగై నా దగ్గర అవ్వాలని నంబర్ తెలుసుకొని.what's up చేసింది అతను పెద్దగా పట్టించు కోలేదు.తన ఫోటో అప్లోడ్ చేసి పంపగా ఆమె అందానికి ఫిదా అయిన సురేష్.ఆమె పట్ల ఆకర్షితుడు అయ్యాడు...మెల్లగా అతన్ని హోటల్ లో కలుసుకొని మాట్లాడుతూ ఇంప్రెషన్ క్రియేట్ చేసి అపుడపు కలుస్తూ పీకల్లోతు ప్రేమలో ఉండిపోయారు.సురేష్ నే ...

జింక మాంసం అక్రమ విక్రయం...నిందితుడి అరెస్ట్...

Image
జింక మాంసం అక్రమ విక్రయం నిందితుడి అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : రాజేంద్రనగర్,ఎస్ ఓటి పోలీసులు జింక మాంసాన్ని అక్రమంగా వి క్రయిస్తున్న వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.అరెస్టైన నిందితు డిని మహమ్మద్ ఇర్ఫానుద్దీన్ గా గుర్తించారు.అతడు సులేమాన్ న గర్ కు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుం చి 15కిలోల జింక మాంసంతో పాటు,నగదును స్వాధీనం చేసు కున్నారు.అడవిలో జింకను వేటాడి,దాని మాంసాన్ని సులేమాన్ న గర్‌లో విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.నమ్మదగిన సమాచారంతో ఎస్ ఓటి పోలీసులు దాడులు నిర్వహించగా నిం దితుడు పట్టుబడ్డాడు.ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయలు దోపిడీ...నిందితుడి అరెస్ట్...

Image
తాజ్‌ హోటల్‌ వద్ద కోటి రూపాయలు దోపిడీ నిందితుడి అరెస్ట్ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తాజ్‌ హోటల్‌ పరిసరాల్లో జరిగిన కోటి రూపాయల దోపిడీ కేసులో పోలీసులకు కీలక విజయం లభించింది.ఇండియన్‌ కరెన్సీకి బదులుగా క్రిప్టో కరెన్సీ ఇ స్తామంటూ నమ్మించి మెహిదీపట్నంకు చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి కోటి నగదును దో చుకెళ్లిన ఘటనలో ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల కథనం ప్రకా రం...క్రిప్టో కరెన్సీ లావాదేవీల పేరుతో ముఠా ముందుగా వ్యాపారవేత్తను సంప్రదించిం ది.భద్రతగా,నమ్మకంగా డీల్ చేస్తామంటూ తాజ్‌ హోటల్‌ వద్దకు పిలిచిన నిందితులు,అ క్కడే వ్యాపారవే త్తను మోసం చేసి నగదుతో పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ,సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్ట్ అయిన నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, ఈ దోపిడీకి సంబం ధించిన మిగతా సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశా రు.క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పెద్ద మొత్తాల లావాదేవీలు చేసే టప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు...

భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్...కేంద్రం గ్రీన్ సిగ్నల్...

Image
భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనున్న భారత్ కేంద్రం గ్రీన్ సిగ్నల్ VS9TV న్యూస్,హైదరాబాద్ : త్రివిధ దళాలకు సంబంధించిన సుమారు రూ.79వేల కోట్ల విలువైన ఆయుధాలు,పరిక రాల కొనుగోలు ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రక్షణ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ సముపార్జన మండలి (డీఏసీ) సమావేశంలో ఈ మే రకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఈ ఒప్పందం ప్రకారం సైన్యానికి పలు కీలక ఆయుధ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి.శత్రుల క్ష్యాలపై అత్యంత కచ్చితమైన దాడులు చే యగల  యిటర్ మునిషన్ వ్యవస్థను సైన్యం పొంద నుంది.అలాగే తక్కువ ఎత్తులో,చి న్న పరిమాణంలో ప్రయాణించే శత్రుడ్రోన్‌లు,యూఏవీలను గుర్తించి ట్రాక్ చేసే తేలికపా టిలో లెవల్ రాడార్లను కూడా సమకూర్చనున్నారు.దీంతో యాంటీ-డ్రోన్ రక్షణ మరింత బలపడనుందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి.నేవీకి సంబంధించన ప్రతిపాదనలకూ డీఏసీ ఆమోదం తెలిపింది.ఈ ఒప్పందం కింద బొల్లార్డ్ పుల్ (బీపీ) టగ్‌లను నేవీకి అం దించనున్నారు.ఇవి ఓ డరేవుల్లో నావిగేషన్ సమయంలో,పరిమిత ప్రదేశాల్లో నౌకలు, జ లాంతర్గాములను సురక్షి తంగా నడిపించేందుకు సహాయపడతాయి.అదేవిధంగా హై-ఫ్రీక్వెన్సీ ...

భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం...ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు...

Image
భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు VS9TV న్యూస్,హైదరాబాద్ : భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మరో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కు టుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ (జీడీ పీ) పరిమాణాన్ని మించిపోయింది.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,500 డా లర్లు దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది.మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం...భారతీయ ఇళ్లలో దాదా పు 34,600 టన్నుల బంగారం నిల్వఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకా రం లెక్కగడితే...భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ ఐదు లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత జీడీపీ సు మారు 4.1లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కం టే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఈ అంశంపై ఇ న్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ ఎక నామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ..."జీడీపీ అనేది ఒక ప్రవాహం...

పుట్టుకతోనే వైకల్యం...ప్రజా సమస్యల పరి ష్కార వేదికలో పించన్ కోసం దరఖాస్తు...

Image
పుట్టుకతోనే వైకల్యం...ప్రజా సమస్యల పరిష్కార వేదికలో  పించన్ కోసం దరఖాస్తు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆధ్వర్యం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.వేదికలో ఆదోనికి చెందిన మహ్మద్ అ లీ పుట్టుకతోనే వైకల్యంతో ఇబ్బందులు పడుతన్నాడు.దీంతో పింఛన్ కోసం దరఖాస్తు చే సుకున్నాడు.ఈ నేపథ్యంలో ఆటోలో ఉన్న బాధితుడి సమస్య పరిశీలన కోసం ఆటో వద్ద కు వెళ్లి వివరాలు అడిగి తెలునుకున్నారు.

నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు... వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు...

Image
నల్గొండలో ఎక్సైజ్ పోలీసుల అరాచకాలు  వైన్ షాపులపై అక్రమ కేసుల ఆరోపణలు VS9TV న్యూస్,నల్గొండ : నల్గొండ జిల్లాలో ఎక్సైజ్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తిరుమల గిరి సాగర్ మండల కేంద్రంలో ఉన్న రెండు వైన్ షాపులపై అక్రమ కేసులు నమోదు చేస్తు న్నారని వైన్ షాప్ యజమానులు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలో తిరుమలగిరి సాగర్‌కు చెందిన వైన్ షాప్ యజమాని విద్యాసాగర్ రెడ్డి,ఎక్సైజ్ అధికారుల వేధింపులను నిరసిస్తూ పురుగుల మందు డబ్బాతో ఎక్సైజ్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళనకు దిగా రు.నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తున్నప్పటికీ,కావాలనే తప్పుడు కేసులు పెట్టి ఇ బ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా పెద్దవూర మం డల కేంద్రంలో వైన్ షాప్ అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ,ఇప్పటివరకు షా ప్‌ ను ఓపెన్ చేయనివ్వకుండా ఎక్సైజ్ సీఐ కల్పన అడ్డంకులు సృష్టిస్తున్నారని యజమా నులు ఆరోపిస్తున్నారు.అనవసర తనిఖీలు,ఆలస్యం పేరుతో వేధింపులకు గురిచేస్తున్నార ని వారు వాపోతున్నారు.ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుతో తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటి ల్లుతోందని,ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాల...

ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా డా. మంతెన సత్యనారాయణ రాజు నియామ కం...

Image
ఏపీ ప్రభుత్వ ప్రకృతి వైద్య సలహాదారుగా డా. మంతెన సత్యనారాయణ రాజు నియామకం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ప్రముఖ ప్రకృతి వైద్యరంగ నిపుణులు డా.మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకృతి వైద్య విధానాలను ప్రజలకు మరింత చేరువ చేయడం,ఆరోగ్య జీవన విధానాలపై అవగాహన పెంపొందించడం,ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు మార్గదర్శనం చేయడం ల క్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.డా.మంతెన సత్యనారాయణ రాజుకు ప్రకృతి వైద్య రంగంలో ఉన్న విశాల అనుభవం,పరిశోధన,ప్రజారోగ్యంపై ఆయన చేసిన సేవలు ఈ నియామకానికి కారణమయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.రాష్ట్రంలో ప్ర కృతి వైద్యాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తార ని ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ నియామకంతో ఏపీ రాష్ట్రంలో ఆరోగ్యకర జీవన విధా నాలు,సహజ వైద్య పద్ధతులకు మరింత ప్రాధాన్యత లభించనున్నట్లు అభిప్రాయం వ్యక్తమ వుతోంది.

నటి మాధవీలతపై కేసు నమోదు...

Image
నటి మాధవీలతపై కేసు నమోదు VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రముఖ సినీనటి మాధవీలతకు బిగ్ షాక్ తగిలింది.ఆమెపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.సోషల్ మీడియాలో సాయిబాబా దేవుడు కాదని తప్పుడు ప్రచారా లు,వ్యాప్తి చేసినందుకు మాధవీలతపై కేసు నమోదు చేశారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...నటి మాధవీలతతోపాటు,ఈ ప్రచారానికి పాల్పడిన పలువురు యూట్యూబ ర్లు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.వా రు పెట్టిన పోస్టు వల్ల ప్రజల భావోద్వేగాలకు నష్టం జరిగిందని ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించా రు.మంగళవారం ఉదయం 10-00 గంటలకు మాధవీలతతో పాటు మిగతా యూ ట్యూ బర్లు,సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని తెలిపారు.ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ కేసులోని ఇ తర వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.ఈక్రమంలో వారి సోషల్ మీడియా ఖాతా లపై నిఘా పెట్టినట్లు సమాచారం.సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్య లు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

విశాఖలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18వమహాసభల జయప్రదం కోసం రెడ్ షర్ట్ కార్మికుల కవాతు...

Image
విశాఖలో జరిగే సిఐటియు ఆల్ ఇండియా 18వమహాసభల జయప్రదం కోసం రెడ్ షర్ట్ కార్మికుల కవాతు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు ఓల్డ్ సిటీ (సిఐటియు) అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సోమవారం కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు నుండి వన్ టౌన్ మండిబజార్,పెద్ద పార్కుల మీదుగా వందల మంది కా ర్మికులు ఎర్రని అంగీలు ధరించి కవాతు చేస్తూ సిఐటియు ఆల్ ఇండియా మహాసభలు జ యప్రదం చేయండి అని ప్రచారం చేస్తూ జిల్లా పరిషత్,గాంధీ విగ్రహం వరకు వెళ్లడం జ రిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఐటీయు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ,శ్రామిక మ హిళ రాష్ట్ర కన్వీనర్ నిర్మలమ్మ,సిఐటియు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి విజయ రామాంజ నేయులు,సిఐటియు నగర ఉపాధ్యక్షులు రాజశేఖర్ సివిల్ సప్లై రాష్ట్ర అధ్యక్షులు ఆర్.కృష్ణ మాట్లాడుతూ బ్రిటిష్ వాడు కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను చ ట్టాలను ఈ దేశ అభివృద్ధి కోసం పని చేస్తామని దేశ ప్రజలను కార్మికులను మో సం చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి వారి అనుబంధ ప్రభుత్వాలు కార్మికులను మోసం చేస్తూ కా ర్మిక చట్టాలను రద్దుచేసి క...

క్యాలెండర్ అంటే పేజీలు తిరిగేయటం కాదు... మెప్మా ఆర్పీ - 2026 క్యాలెండర్ ఆవిష్కరణ లో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి...

Image
క్యాలెండర్ అంటే పేజీలు తిరిగేయటం కాదు గడచిన కాలం బేరిజ్ వేసుకొని భవిష్య త్తు ప్రణాళిక వేసుకోవటమే మెప్మా ఆర్పీ - 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో ఇండియన్ బ్యాంక్ మేనేజర్ శృతి VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : మెప్మా ఆర్పీల సంఘం కార్యదర్శి ఉమాదేవి అధ్యక్షతన నూతన - 2026 క్యాలెండర్ ఇం డియన్ బ్యాంక్ మేనేజర్ శృతి,సామాజిక ఉద్యమ కార్యకర్త అర్జ ఉష,శ్రామిక మహిళా సం ఘం జిల్లా కన్వీనర్ నిర్మల,స్థానిక లక్ష్మీనగర్ వికాస్ స్కూల్లో ఆదివారం అవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా మేనేజర్ శృతి మాట్లాడుతూ క్యాలెండర్ అంటే తేదీలు చూసి పే జీలు చెప్పటం కాదు.జరిగిన కాలంలో మనం ఏం చేశాం.ఏం చేయలేకపోయాం.భవి ష్యత్తులో ఏం చేయాలి అని ప్రణాళిక వేసుకోనీ కృషి ఫలితం వచ్చేది క్యాలెండర్ ఆవిష్కర ణ కూడ అదే అని హితవు పలికారు.ఆర్పీల సంఘం క్యాలెండర్ ను తీసుకురావడం అది కూడా ప్రయోజనకరంగా ఉండే విధంగా సావిత్రిబాయి పూలే,కెప్టెన్ లక్ష్మీషేగళ్,రాణి రుద్ర మదేవి,ఝాన్సీలక్ష్మిబాయి,మదర్ తెరిసా,సరోజినీనాయుడు,మల్లు స్వరాజ్యం,కల్పనా చా వ్లా,చాకలి ఐలమ్మ,ఇందిరాగాంధీ,మలాలా,యూసఫ్ జాయ్ వంటి వీరవనితలు దేశం కోసం సమాజం కోసం కృషి చేసిన వారు.అలాంటి త...

ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు...రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు...అభినందించిన రాష్ట్ర ప్రజలు...

Image
ట్రెడిషనల్ విలువిద్యలో సత్తా చాటిన ఎపి క్రీడాకారులు రాష్ట్రానికి ఏడు బంగారు,ఆరు సిల్వర్ పథకాలు అభినందించిన రాష్ట్ర ప్రజలు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ట్రెడిషనల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 27,28,29వ తేదీల్లో హైదరాబాద్,ఖైరతాబాద్,ప్రభు త్వం డిగ్రీ కళాశాలలో 5వ ట్రెడిషనల్ అర్చరీ పోటీలు నిర్వహించారు.పోటీలకు ట్రెడిషనల్ అర్చరీ ఫెడరే షన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ మద న్ కుమార్ హాజరయ్యారు.ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ పోటీలలో ఐదు రాష్ట్రాల క్రీడాకారుల నుండి పాల్గొన్నట్లు చెప్పారు.కోచ్ ఎన్.వజ్రరాజు మాట్లాడుతూ ట్రెడిషన ల్ అర్చరీ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి 30మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. క్రీడాకారులకు కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యామందిర్ హైస్కూల్ నందు శిక్షణ ఇవ్వ డం జరిగిందని పేర్కొన్నారు.పోటీలలో ఆంధ్రప్రదేశ్ క్రీడా కారులకు ఏడు బంగారు పథ కాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాంస్య పథకాలు సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ ర్వకా రణం అని ఆయన కొనియాడారు.గెలుపొందిన క్రీడాకారులను తల్లి,తండ్రులు,రాష్ట్ర ప్రజలు అ...

తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది...ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్...హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)

Image
తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది తల్లి,తండ్రులు తమ పిల్లలు వాహనాలపై  చేస్తున్న వ్యవహారం గమనించండి ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ చిన్న నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలి హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం ప్రభుత్వ వ్యవస్థల్లో విధులు నిర్వహిస్తున్న వారు నో హెల్మెట్...నో ఎంట్రీ పాటించాలి   దండు విద్యాసాగర్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు నీలం సత్యనారాయణ,వ్యవస్థాపక అధ్యక్షులు నో హెల్మెట్...నో పెట్రోల్ పై భారీ అవగాహన బైక్ ర్యాలీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : తల్లి జన్మనిస్తే...హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది.చిన్న నిర్లక్ష్యం...నిండు ప్రాణాలు బలి.హెల్మెట్ దరిద్దాం...ప్రాణాలు కాపాడుకుందాం అని ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్,యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,వ్యవస్థాపక అధ్యక్షులు నీలం స త్యనారాయణలు కర్నూలు ప్రజలకు హితవు పలికారు.ఈ మేరకు ఆదివారం కర్నూలు ట్రా ఫిక్ సిఐ మన్సూరుద్దీన్ సహకారంతో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఆధ్వర్యం లో నో హెల్మెట్...నో పెట్రోల్ పై అవగాహన కల్పిస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందు...

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం...ప్రమా దంలో వ్యక్తి దారుణ మృతి...

Image
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో వ్యక్తి దారుణ మృతి VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...కర్నూలు నగరం,సం జయ్ గాంధీనగర్ కు చెందిన సూర్య పోగు మదన్ కుమార్ అలియాస్ చిన్న (34) గతంలో ఎల్ ఐసిలో పనిచేశాడు.నేడు న గరంలోని సర్వీస్ సెంటర్ నుండి  అతను  ద్విచక్ర వాహ నం ను తీసుకుని రాజవిహార్ మీ దుగా జిల్లా కలెక్ట రేట్,సంజయ్ గాంధీనగర్ లోని తన గృహానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో మెడికల్ కళాశాల ప్రాంతంలో జయరాజ్ స్టీల్స్ (AP-39-WA-52 20) బస్సు అతివేగంతో వెనుక వైపు నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం లో మదన్ కుమార్ తలపై బస్సు వెళ్లడంతో తలఛిద్రం అయి,అక్కడికక్కడే మృతి చెందా డు.మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు.మరోవైపు  ప్రస్తుతం భార్య ఏడు నెలలు గర్భిణీ గా ఉంది.సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని,మృ తదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.మృతుడి తల్లి పిర్యాదు మేరకు ట్రాఫిక్ పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరో సా...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

Image
విజిబుల్ పోలీసింగ్ తో ప్రజల భద్రతకు భరోసా విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : విజిబుల్ పోలీసింగ్ ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాం త్ పాటిల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా లో ప్రజల భద్రత,శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 'విజిబుల్ పోలీసింగ్'కార్యక్రమాన్ని విస్తృ తం గా నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా పోలీ సులు ప్రజలకు మరింత చేరు వవుతూ,నేరాల ను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగా హన కల్పించడం వంటి చర్యలు చేపడుతు న్నారు. వాహనాల తనిఖీలు : అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తని ఖీ చేస్తున్నారు.ముఖ్యంగా నిషేధిత వస్తువు లు,గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నా రు. సైబర్ నేరాలపై అవగాహన : ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉం డేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.తెలియని లింకులను క్లిక్ చేయవద్దని,వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దని సూచిస్తున్నారు. రహదారి భద్రత నిబంధనలు : రహదారి భద్రతపై అవగాహన కల్పించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్త...

హైదరాబాద్‌లో సీక్రెట్‌గా ‘హుష్–డేటింగ్’...

Image
హైదరాబాద్‌లో సీక్రెట్‌గా ‘హుష్–డేటింగ్’ VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ‘హుష్– డేటింగ్’ అనే కొత్త ట్రెండ్ చర్చనీయాంశం గా మారింది.పేరెంట్స్ నిఘా,సామాజిక ఒత్తిళ్లు పెరిగిపోవడంతో యువతీ–యు వకులు తమ ప్రేమ,స్నేహ సంబంధాలను పూర్తిగా గోప్యంగా కొనసాగిస్తున్నారు. బయటకు కనిపించని విధంగా ఆన్‌లై న్‌లో ప్రత్యేక ప్రొఫైల్స్ రూపొందించుకుని డేటింగ్‌కు అడుగులు వేస్తున్నారు.ఇంటి పెద్దలకు తెలియకుండా ఉండేందుకు వీరు సాధారణ సోషల్ మీడియా కాకుం డా సీక్రెట్ గ్రూప్ చాట్స్, ఎన్‌క్రిప్టెడ్ మెసే జింగ్ యాప్‌లు వంటివి ఉపయోగిస్తున్నా రు.బహిరంగంగా మాట్లాడకుండా ‘హుష్’ అనే భావనతోనే కమ్యూనికేషన్ కొన సాగిస్తున్నారు.కలిసే విషయంలో కూడా స్పష్టమైన ప్లాన్ ఉంటుంది. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను దూరంగా ఉంచుతూ,గచ్చిబౌలి,మాదా పూర్ పరిస రాల్లోని పబ్లిక్ కాఫీ షాపులు,ఓపెన్ స్పేస్‌ లు వంటి చోట్లను ఎంచుకుంటున్నారు. అక్కడ కూడా ఎక్కువ సేపు కాకుండా, సాధారణ మిత్రుల్లా కనిపించేలా జాగ్ర త్తలు తీసుకుంటున్నారు.సోషల్ నిపుణు ల మాటల్లో,ఇది పూర్తిగా డిజిటల్ యుగ ప్రభావం.ఒకవైపు స్వేచ్ఛ కోరుకుంటున్న యువత,మరోవైపు కుటుం...

నా పైసలు ఇవ్వండి...ఓడిన అభ్యర్థి ఆగ్రహం...

Image
నా పైసలు ఇవ్వండి...ఓడిన అభ్యర్థి ఆగ్రహం VS9TV న్యూస్,మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలంలోని సోమ్లా తండాలో సర్పంచ్ అభ్యర్థిగా భూక్యా కౌసల్య నామినేషన్ వేయగా ఆమెపై 27 ఓట్ల తేడాతో ఇస్లావత్ సుజాత అనే అభ్యర్థి విజయం సాధించింది.దీంతో తన కు ఓటు వేయలేదని ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఓడిపోయిన అభ్యర్థి ఇంటింటికి వెళ్లి డిమాండ్ చేస్తోంది.డబ్బు లు తిరిగి ఇవ్వాలని లేదంటే జెండా పట్టు కుని ప్రమాణం చేయాలని అడుతున్నా రు.దీంతో గ్రామస్థులు ఓడిపోయిన అభ్య ర్థి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ...పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి...

Image
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి  VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యా ణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాల యంలో క్రికెటర్లు,శిక్షకులు,సహాయక సి బ్బంది ఈ భేటీ అయ్యారు. ఈ సందర్బం గా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు.ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కు లు అందించారు.ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టుచీర,శాలువాతోపాటు జ్ఞాపిక,కొండ పల్లి బొమ్మలు,అరకు కాఫీతో కూడిన బ హుమ తులను అందించి సత్కరించారు. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని,అన్ని విధాలా అండగా నిలవా లని అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులకు స్వ యంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రా ష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహి స్తోందని,మహిళా క్రికెటర్లు తెలిపిన అంశా లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు దృష్టిక...

హైదరాబాద్ శాంతిభద్రతలు ప్రశ్నార్థకం !...

Image
హైదరాబాద్ శాంతిభద్రతలు ప్రశ్నార్థకం ! VS9TV న్యూస్,హైదరాబాద్ : హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో నగ రంలో ఐదు సంచలన హత్యలు జరిగా యి.ఇద్దరు రియల్టర్ల హత్యలు,ఒక యువతి గొంతు కోసిన దారుణం చోటు చేసుకున్నాయి.కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో సంచలనాత్మక నేరాలు జరుగుతూనే ఉంటాయి.ఆవేశంలో జరిగే నేరాలను పోలీసులు కూడా అడ్డుకోలే కపోవచ్చు కానీ పాత నేరస్తులు ప్లాన్ చేసి మ రీ హత్యలకు పాల్పడుతూంటే..ఆపలేకపో వడం మాత్రం పోలీసుల వైఫల్యం అవుతుంది. వ్యక్తిగత వివాదాలతోనే ఎక్కువ హత్యలు : ఇటీవలి హత్యలన్నీ వ్యక్తిగత శత్రుత్వా లు,ప్రేమ వైరాలు,ఆస్తి వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి.డిసెంబర్,11న ముషీరాబాద్‌లో 17ఏళ్ల పవిత్రను కత్తితో పొడిచి చంపిన యువకుడు ఆమెకు దగ్గ రి బంధువే.డిసెంబర్,3న యాకుత్‌ పురలో రియల్టర్ జునైద్‌ను హత్య చేసిన వారు ఆస్తి వివాదంలో ఉన్న కుటుంబ స భ్యులే.ఈ రకమైన పరిచయస్తుల చేతు ల్లోనే ఎక్కువ మంది హతమవుతున్నా రు.వ్యాపార వివాదాలతో మరికొంత మంది శత్రువుల్ని చంపడానికి వెనుకా డటం లేదు. పాతికేళ్ల పగతో రియల్టర్ హత్య : తన తండ్రి ఎన్ కౌంటర్ కు...ఓ వ్యక్తి కారణం అని అతని కొడుకు గుర్తుంచు కుని పాతికేళ్ల తర్వా...

రాధ బీచ్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్,ఆరవ అంతస్తులో అగ్నిప్రమాదం...

Image
రాధ బీచ్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్,ఆరవ అంతస్తులో అగ్నిప్రమాదం VS9TV న్యూస్,విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యా టక కేంద్రమైన ఆర్కే బీచ్ సమీపంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.బీచ్‌కు ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల రాధ బీచ్ రెసిడెన్సీ అనే అపార్ట్‌ మెంట్ కాంప్లెక్స్‌లోని ఆరవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుం ది.ప్రమాదం జరిగి న వెంటనే మంటలు భారీ గా ఎగిసిపడ టంతో ఆ ప్రాంతమంతా దట్టమై న పొగ కమ్ముకుంది.దీంతో భయాందోళన వా తావరణం నెలకొంది.ఈ సమాచారం అందు కున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించి,వాటిని ఇతర ఫ్లాట్ల కు వ్యాపించకుండా అదుపు లోకి తీసుకురావ డానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.అగ్నిప్ర మాదం జరిగిన ఫ్లాట్‌ లో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రక్షించేందుకు పోలీసులు,అగ్ని మాపక సిబ్బంది చర్యలు చేపట్టారు.ప్రమాదం జరిగిన ప్రదేశంలో దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో సహాయక చర్యలకు కొంత ఆటం కం కలిగింది.ఈ భారీ అగ్నిప్రమాదం ఎలా సం భవించింది అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఆరవ అంతస్తులోని ఆ ఫ్లాట్‌ లో ఉన్నవారి నుంచి పోలీసులు వివరాలు సే...

ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ...

Image
ఘనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ VS9TV న్యూస్,భూపాలపల్లి : తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సంద ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యా ప్తంగా మంగళవారం వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలం గాణ తల్లి విగ్రహాలను వర్చు వల్ గా ఆవిష్కరించారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.రాష్ట్రంలోని 33 కలెక్ట రేట్లలో రూ.5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహా లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రులు కార్య క్రమానికి హాజరయ్యారు.మొత్తం 18 అడుగు ల ఎత్తుతో విగ్రహాల నిర్మాణం జరిగింది.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ జరగడం ఆనందం గా ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవా లను పురస్కరిం చుకొని భూపాలపల్లి జిల్లాలో ఈ వేడుకలు ఘ నంగా ప్రారంభమయ్యాయి.జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ రాహుల్ శర్మ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలంగాణ తల్లికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ప్రతి ఏటా 9వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్త...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27మందికి జరిమానా...మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ...

Image
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27మందికి జరిమానా మన్సూరుద్దిన్,కర్నూలు ట్రాఫిక్ సిఐ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికీ జెఎఫ్ సిఎం కోర్ట్ జరిమానా విధించినట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు,కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ ఉత్తర్వులు మేరకు కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దిన్ ఆధ్వ ర్యంలో కర్నూలు ట్రాఫిక్ సిబ్బంది ప్రతి ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది.ఈ నేపథ్యంలో  డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసి,కోర్టులో హజరు పరిచారు.పట్టుబడిన 27మందికి కర్నూ లు జెఎఫ్ సిఎం కోర్టు వారు ఒక్కొక్కరికి రూ.10వేలు ప్రకారంగా,మొత్తం రూ.2.70లక్షలు జరిమానా విధించిన్నట్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ ఎస్ మన్సూరుద్దీన్ తెలిపారు.

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... హాజరైన మంత్రి సత్యప్రసాద్...

Image
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష హాజరైన మంత్రి సత్యప్రసాద్ VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స మీక్ష సమావేశం ఏర్పాటుచేశారు.సమావే శానికి మంత్రి సత్యప్రసాద్ హాజరయ్యా రు.ఈ సందర్బంగా రెవెన్యూ శాఖ సీఎస్ సాయిప్రసాద్ రెవెన్యూ శాఖ వివరాలు ముఖ్యమంత్రి దృష్టికి వివరించారు.గతే డాది జూన్,15 నుంచి ఈ ఏడాది డిశం బర్,1వ తేదీ వరకు 5,28,217 గ్రీవె న్స్ లు వచ్చాయి..4,55,189 గ్రీవెన్స్ లు పరిష్కరించగా,పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్స్ లు పాలనా సంస్కరణ లతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూ టేషన్ ప్రక్రియ వేగవంతం జరుగుతుందని పేర్కొన్నారు.అదేవిదంగా 2024,జూన్ నుంచి 22ఏ జాబితా నుంచి తప్పించాల ని 6,846 దరఖాస్తులు దాఖలుకాగా... 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే,వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు జరి గింది.రీసర్వేలో ఎలాంటి తప్పులు,పొర పాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్ర్ గ్రెడేషన్,2.77కోట్ల కుల ధ్రువీకరణ పత్రా లు ఆధార్‍తో అనుసంధానం..ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్,రిజిస్ట్రేషన్ శాఖ ద్వా రా రూ.10,169 కోట్ల ఆదాయం ల క్ష్యం...ప్లాట్లకు సంబంధించి యూజర్...

సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో...ఏపీ సీఎం చంద్రబాబు...

Image
సంక్రాంతి నుంచి అన్ని ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో ఏపీ సీఎం చంద్రబాబు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు ఆన్‌లైన్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.ఈ మేరకు ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ)పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక సూచనలు చేశారు.పారదర్శక పాలన అందించడంతో పాటు,ప్రభుత్వ పని తీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే అవసరం లేకుండా అన్ని సేవలను అందించాలని సీఎం నిర్దేశించారు.ఇందు కు 'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్'ను సమర్థంగా వినియోగించుకోవాలని,దీని పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించా లని సూచించారు.ఇప్పటికీ కొన్ని శాఖలు భౌతికంగానే సేవలు అందిస్తున్నాయని, అవి వెంటనే తమ పద్ధతి మార్చుకుని ఆన్‌లైన్‌ బాట పట్టాలని చంద్రబాబు అ న్నారు.రిజిస్ట్రేషన్ల అనంతరం డాక్యుమెం ట్లను కొరియర్ ద్వారా నేరుగా లబ్ధిదా రుల ఇళ్లకే పంపాలని సూచించారు. ఆర్టీసీ బస్టాం...

బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు... అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం...ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక...

Image
బెల్ట్‌షాపులపై భగ్గుమన్న మహిళలు అక్రమంగా దాచిన మద్యం సీసాలను వీధిలోకి తీసుకొచ్చి దహనం ఇకపై మద్యం అమ్మితే ‘ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిక VS9TV న్యూస్,బాపట్ల : బాపట్ల జిల్లా,పంగులూరులో బెల్ట్‌ షాపు లకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమిం చారు.ర్యాలీగా వెళ్లి బాపట్ల జిల్లా, పంగు లూరు మండలం,కోటపాడు గ్రామంలోని బెల్ట్‌ షాపులపై దాడి చేశారు.అక్రమంగా దాచిన మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి వీధిలో తగలబెట్టారు.ఇకనుం చి మద్యం అమ్మితే ఊరుకునేది లేదని నిర్వాహకులను హెచ్చరిక చేశారు.మ ద్యం వల్ల మా కుటుంబాలు నాశనమ వుతున్నాయని,కుటుంబాల్లో కలహాలు చెలరేగి భార్యాభర్తలు విడిపోతున్నారని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటోందని ఆ వేదన వ్యక్తం చేశారు.ఎవరైనా బెల్ట్‌ షాపు లు నిర్వహిస్తే తమ తడాఖా చూపిస్తా మని మహిళలు హెచ్చరించారు.వీరికి గ్రామస్తులంతా వీధిలోకి వచ్చి మద్దతు తెలిపారు.మద్యం షాపులను నిర్వాహకు లను కట్టడి చేయండి అంటూ ప్రోత్సహిం చారు.ఈ నేపథ్యంలో ఐద్వా అఖిల భారత నాయకు రాలు డి.రమాదేవి ఆధ్వ ర్యంలో కోటపాడు గ్రామంలోని దళిత కాలనీలో మహిళలతో సమావేశ మయ్యా రు.ఈ సందర్భంగా మహిళలు మాట్లా డుతూ మా గ్రామంలో ఏడు బెల్ట్‌ షాపులు నడుస్తు...