భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం...ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు...

భారత జీడీపీ కంటే...ఇళ్లలో బంగారం విలువే అధికం
ప్ర‌జ‌ల వ‌ద్ద‌ లక్ష‌ల కోట్ల ప‌సిడి నిల్వ‌లు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ మరో సంచలనానికి దారితీసింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో భారతీయ కు టుంబాల వద్ద ఉన్న బంగారం మొత్తం విలువ దేశ ఆర్థిక వ్యవస్థ (జీడీ పీ) పరిమాణాన్ని మించిపోయింది.అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,500 డా లర్లు దాటడంతో ఈ పరిస్థితి నెలకొంది.మోర్గాన్ స్టాన్లీ అంచనాల ప్రకారం...భారతీయ ఇళ్లలో దాదా పు 34,600 టన్నుల బంగారం నిల్వఉంది.ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకా రం లెక్కగడితే...భారతీయుల వద్ద ఉన్న ఈ బంగారం విలువ ఐదు లక్షల కోట్ల డాలర్ల కంటే ఎక్కువ.అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం భారత జీడీపీ సు మారు 4.1లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.అంటే దేశం మొత్తం ఉత్పత్తి చేసే ఆదాయం కం టే ప్రజల ఇళ్లలో ఉన్న పసిడి విలువే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఈ అంశంపై ఇ న్ఫోమెరిక్స్ వాల్యుయేషన్ అండ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ ఎక నామిక్ టైమ్స్‌తో మాట్లాడుతూ..."జీడీపీ అనేది ఒక ప్రవాహం లాంటిది,బంగారం అనేది నిల్వ ఉండే ఆస్తి.ఈ రెండింటిని నేరుగా పోల్చలేం.కానీ,భారత ఆర్థిక వ్యవస్థలో బంగా రా నికి ఉన్న సామాజిక,ఆర్థిక,మానసిక ప్రాధాన్యతను ఈ గణాంకాలు స్పష్టంగా చూపిస్తు న్నాయి" అని విశ్లేషించారు.
సంపద పెరుగుతుందా ? :
బంగారం విలువ పెరగడం వల్ల గృహాల బ్యాలెన్స్ షీట్లు బలపడతాయని మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు చెబుతున్నప్పటికీ,దీనిపై భి న్నాభిప్రాయాలు ఉన్నాయి.ఎమ్కే గ్లోబల్ విశ్లే షణ ప్రకారం..ఇళ్లలో ఉండే బంగారంలో దాదా పు 75 నుంచి 80 శాతం ఆభరణాల రూపం లోనే ఉంటుంది.భారతీయులు దీన్ని పొదుపు గా భావిస్తారు తప్ప,విక్రయించి సొ మ్ము చేసుకునే ఆస్తిగా చూడరు.అందుకే ధరలు పెరిగినా వినియోగంపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు అంటున్నారు.
ఆర్బీఐ :
కేవలం ప్రజలే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కూడా తన బంగారం ని ల్వలను పెంచుకుంటోంది.2024 నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ సుమారు 75 టన్నుల బం గారాన్ని కొనుగోలు చేసింది.దీంతో మొత్తం నిల్వలు 8 80 టన్నులకు చేరాయి.యుద్ధా లు,ఆర్థిక అనిశ్చితి సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడి కావడంతో కేంద్ర బ్యాం కులు కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నాయి.అయితే ఆర్థిక పరంగా చూస్తే బంగారం ఒక ఉత్పా దకత లేని ఆస్తి అని,ప్రజలు ఈటీఎఫ్ వంటి బాండ్ల వైపు మళ్లాలని నిపుణులు సూచిస్తున్నా,భౌతిక బంగారంపై మోజు మాత్రం తగ్గడం లేదు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...