ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్
ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం
సన్మానించిన నగర సీపీ సజ్జనర్
నగదు పురస్కారం,ప్రశంసా పత్రం అందజేత
VS9TV న్యూస్,హైదరాబాద్ : 
నేరం జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కా దు.ఆ నేరగాడిని పట్టుకోవడమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఒక సామాన్య ఆటో డ్రైవర్.ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కేళ్లేందు కు ప్రయత్నిస్తే...ప్రాణాలకు తెగించి,తన ఆటో నే ఆయుధంగా మలచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహెర్ రౌడీషీటర్ ను అడ్డుకున్నా రు.కర్రతో దాడి చేస్తోన్న బెదరకుండా ప్రతిఘ టించారు.ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించి న ఆటో డ్రైవర్ జాహెర్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జ నర్ మంగళవారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలోని తన ఛాంబర్ లో ప్రత్యేకంగా సన్మానించారు.ఆయ నకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కా రాన్ని అందజేశారు.మార్చి,4వ తేదీ తెల్లవారు జామున బేగం బజార్ జిన్సీ చౌరాహా ప్రాంతం లో మంజు ఓమ్లతా తన కోడలితో కలిసి మా ర్నింగ్ వాక్‌కు వెళ్లారు.హిందీ మార్వాడీ విద్యా లయ స్కూల్ వద్దకు చేరుకోగానే,డబీర్‌పురకు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ సోహేల్ ఆమె మె డలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్ర యత్నించాడు.ఆ క్రమంలో నిందితుడి స్కూటీ అదు పుతప్పి కిందపడిపోయింది.బాధితురా లు గట్టిగా కేకలు వేయడంతో,అదే సమయం లో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ ఈ దృశ్యాన్ని సైడ్ వ్యూ మిర్రర్ ద్వారా గమనించారు.సంఘటన స్థలాన్ని దాటి సుమా రు 100మీటర్ల దూ రం ముందుకు వెళ్లినప్పటి కీ,జాహెర్ వెంటనే స్పందించి తన ఆటోను వే గంగా వెనక్కి తిప్పారు.పారిపోవడానికి ప్రయ త్నిస్తున్న రౌడీ షీటర్ బైక్‌ను తన ఆటోతో ఢీ కొ ట్టి అతడిని కిందపడేశారు.ఆ సమయంలో నిం దితుడు కర్రతో దాడి చేసినా భయపడకుండా ప్రతిఘటించి అడ్డుకున్నారు.ఆ సమయంలో పారిపోతుండగా వెంటనే గస్తీ తిరుగుతున్న పో లీసులు రౌడీ షీటర్ ను అదుపులోకి తీసుకు న్నారు.ఈ పని ముగించుకున్న జాహెర్,ఎలాం టి ప్రతిఫలాన్ని ఆశించకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు.ఆటో డ్రైవర్ సాహసం గురిం చి గోషామహల్ పోలీసులకు బాధితురాలు తెలియజేశారు.కాగా,ఈ వీరోచిత దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రౌడీ షీటర్ ను పట్టుకో వడంలో కీలక పాత్ర పో షించి,నిస్వార్థంగా వెళ్లిపోయిన ఆ అజ్ఞాత వీ రుడి కోసం గోషామహల్ పోలీసులు గాలింపు చేపట్టారు.సీసీటీవీ ఫుటేజీలో ఆటో నంబర్‌ను సేకరించి,సాంకేతిక పరిజ్ఞానంతో జాహెర్‌ ను గుర్తించారు.ఈ సందర్భంగా సీపీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ...ఆటో డ్రైవర్ మహమ్మద్ జా హెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమ న్నారు.చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో,ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న జాహెర్ సమాజాని కి నిజమైన రోల్ మోడల్.ఆయనలో ఒక అ ద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు.ఎలాంటి ప్ర తిఫలం కూడా ఆశించలేదు.ఇలాంటి బాధ్య తా యుతమైన పౌరులు ఉన్నప్పుడే నేరస్తుల కు భయం పుడుతుంది అని ప్రశంసించారు.నే రం జరుగుతున్నప్పుడు భయప డకుండా,మ హమ్మద్ జాహెర్ వలె ధైర్యంతో స్పందించి వెం టనే డయల్ 100లేదా స్థానిక పోలీసులకు స మాచారం అందించాలని నగరవాసులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.కాగా,డబిర్ పూ రకు చెందిన రౌడీ షీటర్ పై గోషా మహల్ పీఎ స్ లో కేసు నమోదు చేసి...అరెస్ట్ చేశారు.అ తడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 16కేసులున్నా యి.ఈ సన్మాన కార్యక్రమంలో గోల్కొండ జోన్ డీసీపీ జి.చంద్ర మోహన్,గో షామహల్ ఎస్‌హె చ్‌వో శ్రవణ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...