రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

పైపులైన్ లో భూములు కోల్పోయిన రైతులకు ఒక సెంటుకు రూ.50 వేలు ఇవ్వాలి

10 సెంట్లకన్నా ఎక్కువ భూమి పోయిన రైతుల కుటుంబాల్లో ఒక ఉద్యోగం ఇవ్వాలికి 

పైపులైను పోయిన గ్రామాలలో చెరువులు కుంటలకు మోటార్ల ద్వారా నీళ్లు నింపాలి

ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్...

VS9TV న్యూస్,కర్నూలు మండలం :

 ఓర్వకల్లు మండలంలోని పరిశ్రమలకు నీళ్లు తీసుకురావడం కోసం పూడిచెర్ల, కేతవరం, గార్గెయపురం రైతుల భూములు కోల్పోయిన విషయం పైన ఆర్డీఓ ఆఫీస్ లో ఆర్డిఓ సందీప్ కుమార్,కర్నూలు తహసిల్దార్ రమేష్ బాబుఓర్వకల్లు డిప్యూటీ తాసిల్దార్ రాజేష్,ఏపీఐఐసీ జెడ్.ఎం.మధుసూదన రెడ్డి సమక్షంలో సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ కేతవరం పూడిచెర్ల, గార్గేయపురం రైతులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ ఓర్వకల్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల హబ్ ను ఏర్పాటు చేసిందని,వాటికి నీరు అవసరాల కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల కాలువ నుండి భారీ పైపులైన్ తీసుకొస్తున్నారని,వచ్చే దారిలో గార్గేయపురం,కేతవరం,పూడిచెర్ల గ్రామాల రైతుల పొలాలు పోతున్నాయని అన్నారు.2022లో ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారని,వాటికి సమాదా నంగా మా భూములు ఇవ్వలేమని,మాకు అన్యాయం జరుగుతుందని అర్జీ ఇవ్వడం జరిగిందన్నారు.ఆ తర్వాత గ్రామాలలో రైతులతో ఎటువంటి గ్రామసభ జరపకుండా రైతుల అనుమతి తీసుకోకుండా పైపులైన్ పనులను తీసుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించి పనులను పూర్తి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అనేకసార్లు పనులను రైతులు అడ్డుకున్నా అనేకసార్లు అధికారులు మరియు ఆర్టీఓ కలిసి రైతుల మొర విన్నవించినా ఏమాత్రం స్పందించలేదని విమర్శించారు.ఈ మధ్యకాలంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి రైతులకు ఉన్న ఇబ్బందులను సమస్యలను విన్నవించగా తక్షణమే రైతులతో సమావేశం జరపాలని,రైతుల అభిప్రాయాలను తీసుకోవాలని ఆర్డీఓని ఆదేశించారు.దాంతో రైతులతో సమావేశం జరిపి రైతుల అభిప్రాయాలను తీసుకున్నారు.రైతుల అభిప్రాయాలలో రైతులు మాట్లాడుతూ మా భూములలో పైపులైన్ వేసిన తర్వాత భారీ రాళ్లు,మట్టిని భూముల వెంబడి వదిలేశారని అన్నారు.వాటిని తొలగించాలంటే ఒక రైతుకు రూ.60 వేల నుండి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని ఆవేదన చెందారు. అంతేకాకుండా ఆ భూమి మళ్ళీ సాగులోకి రావాలంటే 14,15 సంవత్సరాలు అవుతుందని వాపోయారు.రైతులు ముక్తకంఠంతో మా భూములకు సెంటుకు రూ.50 వేలు ఇవ్వాలని,10సెంట్ల కంటే ఎక్కువ భూమి పోయిన రైతుల కుటుంబాల్లో ఒక ఉద్యోగం ఇచ్చి,మా పొలాలను ఇబ్బందులు లేకుండా చదును చేయడం కొరకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే ఇవ్వాలని,గార్గేయపురం,కేతవరం, పూడిచెర్ల గ్రామాలలో ఉన్న నీటి కుంటలు,చెరువులు, పైపులైనుకు మోటర్లు బిగించి నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు.పనులు చేసే సందర్భంగా రోడ్డు పక్కనే భారీ గోతులు తీయడంతో కేతవరం రైతు మేకల రంగస్వామి లక్ష రూపాయలు విలువగల ఆవు గుంతలో పడి కోలుకోలేక చనిపోయిందని,వీటిపై కాంట్రాక్టర్ ఉన్నతాధికారులందరికీ విన్నవించినా స్పందించలేదని,తక్షణమే చనిపోయిన ఆవు రైతు మేకల రంగస్వామికి లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కేతవరం,పూడిచెర్ల, గార్గేయపురం రైతులు రైతులు నాగన్న,శ్రీధర్ రంగస్వామి,బుగ్గరాముడు,కుర్వమధు, గార్గేయపురం వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...