Posts

Showing posts from April, 2025

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి...ఆప్టా...

Image
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను కాపాడండి...ఆప్టా VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో జిఓ 117కు ప్రత్యామ్నంగా తెస్తున్న మార్పులో భాగంగా ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలను 1,2 తరగ తులతో ఏర్పాటు చేసి,అందులో 1:30 ఉపాధ్యాయ,వి ద్యార్ది నిష్పత్తిని ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో ఇప్పుడు ఏ ర్పడే అనేక రకాల ప్రాథమిక పాఠశాలలో ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలల సంఖ్య అధి కం.అందులో 20 నుండి 30 మధ్యలో నమోదు కల పాఠశాలల సంఖ్య ఎక్కువ. అందువ లన రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఏర్పడుతూ ఉంది.తరువాత కాలంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు జీరో ఎన్రోల్మెంట్ తో మూతపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని గతంలో ఉదాహరణలు చాలా ఉన్నాయి.ఈ ప్రమాదం రాకుండా ఉండాలి అంటే ఫౌండేషన్ ప్రాథమిక పాఠశాలలో కూడా 1:20 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం పోస్టులు కేటాయింపు జరగాలని ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసి యేషన్ ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు ఎ.జి.ఎస్ గణపతి రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రకాష్ రావులు ఆదివారం మానవ వనరులు శాఖ మంత్రి నారా లోకేష్ బాబు,ప్రాథమిక విద్య ప్రిన్సిపల్ సెక్రటరి,డైరెక్టర్ లకు లేఖ రాశారు.అదేవిధంగా మోడల్ ప్రైమరీ పాఠశాల యం దు ...

సుద్దవాగులో చకచకా పూడికతీత పనులు...

Image
సుద్దవాగులో చకచకా పూడికతీత పనులు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : శ్రీరామ్‌నగర్,గణేష్‌నగర్,బృందావన్ కాలనీ తదితర పరిసర ప్రాంతాలలో ప్రజలు కొన్నే ళ్లుగా ఎదుర్కొంటున్న మురుగు దుర్వాసనకు ఎట్టకేలకు మోక్షం లభించింది.రెండు జెసిబి లు,ఒక హిటాచితో 1.25కిలోమీటర్ల మేర పూడికతీత పనులు చకచకా జరిగిపోతున్నా యి.మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి చేసి,వ్యర్థాలను అక్కడి నుండి ట్రాక్టర్లలో తర లించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలిరౌడీ షీటర్లకు కౌన్సిలింగ్కర్నూలు పోలీసులు...

Image
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ కర్నూలు పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా  ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు,నేరచరిత్ర గలవారికి,చెడు నడత కలిగిన వ్యక్తులకు  కౌన్సిలింగ్ ఆదివారం నిర్వ హించారు.సత్ప్రవర్తనతో జీవించాలని,నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని,చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొం టే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికా రులు హెచ్చరించారు.

అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు,అన్నదానం...దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్...

Image
అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి  ఆలయంలో ప్రత్యేకపూజలు,అన్నదానం దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆల యంలో అమావాస్య పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్ర మం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.వి జయ్ కుమార్,వి.చంద్ర,వి.నరసింహులు,వి.కృష్ణ,టి.నాగిరెడ్డిలతో కలిసి ఆలయంలో దా తల సహకారంతో ప్రతినెల అమావాస్య,హనుమాన్ జయంతి,శ్రీరామనవమి పర్వ దినాల లో ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు.అదేవిధంగా ఈ అ మావాస్య నందు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల తరువాత మల్లెల గో త్రం,కీ.శే.టి.పెద్ద రంగయ్య,టి.సుభద్రమ్మ,టి.ఉమాకాంత్,టి.స్నేహలత,టి.పునీత్ అక్షయ్, టి.రాధిక,టి.రేవంత్ సాయిలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఆలయంలో జరుపుతున్న ప్రతి కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు,ప్రజలకు ఆయన కృ తజ్ఞతలు తెలియచేశారు.అనంతరం దాతలు టి.సుభద్రమ్మ,టి.ఉమాకాంత్ లను ఆలయ కమిటీ బృందం శాలు...

యూట్యూబ్ లో చూసి తాళం వేసిన ఇళ్ళల్లో దొంగతనం చేసిన నిందితులు...

Image
కర్నూలు ఆర్టిసి డిపో మేనేజర్ ఇంట్లో చోరీ కేసును చేధించిన కర్నూలు త్రీ టౌన్ పోలీసులు... 27తులాల బంగారం ఆభరణాలు,35 తులాల వెండి ఆభరణాలు నిందితుల నుండి స్వాధీనం... దొంగతనంకు వినియోగించిన రంపం, ఇనుప రాడ్డు,రెండు మోటారు సైకిళ్ళు స్వాధీనం... ఇళ్ళకు తాళం వేసి ఊళ్ళకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసు స్టేషన్ లలో సమాచారం అందించాలి ఎల్ హెచ్ ఎం ఎస్ యాప్ వినియోగించుకోవాలి  జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి VS9TV న్యూస్,కర్నూలు క్రైం :   కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని సాయివైభవ్ నగర్ లో నివశిస్తున్న ఆర్టిసి డిపో - 1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ఈ నెల 13వ తేదిన కర్నూలు పోలీసులు దొంగలను పట్టుకొని దొంగలించబడిన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...ఆర్టీసి డిపో -1 మేనేజర్ సర్ధార్ హుస్సేన్ తన కుటుంబ సభ్యులతో కలిసి హైదారాబాద్ కు ఒక ఫంక్షన్ నిమిత్తం వెళ్ళిన సంధర్బం చూసుకొని షేక్షావలి (స్పైస్ డాభాలో పని చేసే యువకుడు),తనతో పాటు చట్టంతో విభేదింఛిన ఐదు మంది బాలురను జత చేసుకుని ఎలాగైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో యూట్యూబ్ లో వీడియోలు ...

మత్స్యకారులకు ఎన్నికల హామీని నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం...

Image
పి.జి.వెంకటేష్,తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార కమిటి జిల్లా అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : రాష్ట్రంలో సంక్షేమ పాలన సూపర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.కూటమి ప్రభుత్వం వచ్చిన 10నెలల్లోనే ఎన్నికల హామీలు ఒకొక్కటి నెరవేరుస్తూ ఇది మంచి ప్రభుత్వం అనిపించుకునేవిధంగా పింఛన్ల పెంపు నుంచి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పుడు కొత్తగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది.మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా మత్స్యకారుల సేవలో... పేరుతో సాయం అందించనుంది.ఏప్రిల్, 15వ తేదీ నుంచి జూన్,14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు పడకూడదని ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.నేడు శ్రీకాకుళం జిల్లా,ఎచ్చెర్ల నియోజకవర్గం,బుడగట్లపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారని అయన తెలిపారు.ఈ మేరకు కర్నూలు పట్టణంలోని బిర్లా కాంపౌండ్,కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ బెస్త సాధికార జిల్లా ...

నగరాభివృద్దే ప్రధాన అజెండా...వాడివేడిగా నగరపాలక సర్వసభ సమావేశం...

Image
రూ.9.22కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్  సమస్యల పరిష్కారం కోసం సభ్యుల పట్టు   మూడు కూడళ్ళకు,రెండు ప్రాంతాలకు కొత్త పేర్లు  VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరాభివృద్ధే ప్రధాన అజెండగా నగరపాలక సర్వసభ్య సమావేశం జరిగింది.శనివారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని కౌన్సిల్ హాలులో ఏర్పాటుచేసిన సమావేశానికి మేయర్ బి.వై.రామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఎంపీ బస్తిపాటి నాగరాజు,ఎమ్మెల్యేలు గౌరు చరిత రెడ్డి, బొగ్గుల దస్తగిరి,కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు హాజరయ్యారు.ముందుగా జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ముష్కరుల దాడిలో మృతి చెందిన 28 మందికి,ఇటివల మృతి చెందిన 38వ వార్డు కార్పొరేటర్ గిప్సన్ ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు సభ సభ్యులంతా మౌనం పాటించారు.అనంతరం సర్వసభ్య సమావేశానికి తొలిసారి వచ్చిన ఎం.పీ.బస్తిపాటి నాగరాజుకి వేదికపై సత్కరించారు.అనంతరం మొత్తం 26తీర్మానాలపై పాలకవర్గ సభ్యులు చర్చించి ఆమోదం తెలిపారు. రూ.9.22కోట్లతో రహదారులు,మురుగు కాలువలు,‌ఇతరత్రా అభివృద్ధి పచ్చజెండా ఊపారు.సమావేశం ప్రారంభించిన కాసేపటికి కాస్త గందరగోళం ఏర్పడడంతో మేయర్ సభను పది ...

ప్రభుత్వ విద్య రంగాన్ని కాపాడుకుందాం... ఎస్ఎఫ్ఐ...

Image
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను పాటిష్టపరచాలని ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ అన్నారు. శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కర్నూలు జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతుల సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత విద్యలో శాస్త్రీయత ఉండట్లేదని అందుకరణం చేత విద్యార్థులు ప్రపంచ ఙ్ఞానాన్ని అందిపుచ్చుకోవటం లేదన్నారు.ముఖ్యంగా దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పాఠ్యపుస్తకాల్లో మతోన్మాద విధానాలను చొప్పించి,సమాజంలో పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు కల్పితమైన అశాస్త్రీయమైన పాఠ్యాంశాలను విధించటం వల్ల మతోన్మాదం పాఠశాల స్థాయి నుండే పెరిగిపోతుందన్నారు.ఈ మతోన్మాద విధానాలను వ్యతిరేకించకుండా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వీటిని సాగిస్తూ విద్యార్థుల మధ్య మతం,కులం అంటూ చిచ్చులు పెట్టటం సరైన వైఖరి కాదన్నారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం హక్కులను కాలరాసే ప్రయత్నాలు మానుకొని శాస్త్రీయమైన నాణ్యమైన అందించాలని అన్నారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాస్థాయి వరకు విద్యార్థులు అనేక సమస్యలు నెలకొన్నాయి. క...

మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక...అధ్యక్షులుగా వానపల్లి బ్రహ్మనాయుడు...ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్...

Image
వానపల్లి బ్రహ్మనాయుడు,అధ్యక్షులు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : మంగళగిరి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని గురువారం మధ్యాహ్నం పట్టణంలోని మెయిన్ బజార్ నందు గల ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బందెల దయాకర్,ప్రధాన కార్యదర్శి మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా వానపల్లి బ్రహ్మనాయుడు, ప్రధాన కార్యదర్శిగా బందెల దయాకర్, కోశాధికారిగా బత్తుల సాంబశివరావు, గౌరవాధ్యక్షులుగా కూరపాటి మురళి రాజు,ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, మట్టుకొయ్య కృష్ణ,బాపనపల్లి శ్రీనివాసరావులను ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్ గా నువ్వుల శ్రీహరి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.మల్లేశ్వరరావు, కార్యదర్శులుగా దొప్పలపూడి రాము, మెడకాయల మస్తాన్,మంచికలపూడి సిరిబాబు,సహాయకార్యదర్శులుగా చెదలవాడ సాయిచంద్,నాయుడు నాగరాజు,గండికోట దుర్గారావులను ఎన్నుకున్నారు.కార్యవర్గ సభ్యులుగా శిరందాసు విజయ భాస్కర్ ,విడేల సాయి శ్రీనివాస్,కె.అభిరామ్ కృష్ణారెడ్డి, ఎం శివనాగిరెడ్డి,బత్తెన శ్రీనివాసరావు,ఆరేపల్లి రాజు,వేముల రాంబాబు,తిరుమల శెట్టి శ్రీనివాసరావు,మద్దెల కిషోర్,ఉద్దంటి రమేష్, పి.రమేష్ కె...

ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ పొందిన విద్యార్థులకు జ్ఞాపిక మేమంటతో సత్కారం... తూర్పాటి మనోహర్,బేడా బుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు...

Image
VS9TV న్యూస్,కర్నూలు : కర్నూలు నగరం,ఆటో నగర్,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్వగృహం వద్ద గురువారం ఇంటర్ ఫలితాలలో ఉత్తమ ప్రతిభ పొందిన బేడా బుడగ జంగంకు చెందిన విద్యార్థులు హరిప్రియ, సాయిభావన,సాయి వరుణ్ లను జ్ఞాపిక మేమంటోతో సత్కారం కార్యక్రమం ఏర్పాటుచేశారు.ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన బేడ బుడగ జంగం కుల సమగ్ర నివేదిక కేంద్రానికి పంపడం జరిగిందని అన్నారు.కేంద్ర మంత్రుల ద్వారా సంప్రదించి పక్రియను పూర్తి చేయాలని నంద్యాల ఎంపీని కోరారు.నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ బేడా బుడగ జంగాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు వీలైనంత త్వరగా పరిష్కరించాలని చూస్తున్నారని చెప్పారు.తాము కూడా కేంద్ర మంత్రుల ద్వారా సంప్రదించి వీళ్ళు ఎంత త్వరగా ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, యువత,కుల నాయకులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషిని మర్యాద పూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ....

Image
VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించేందుకు గురువారం విచ్చేశారు.ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానాశ్రయంలో కేంద్రమంత్రిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుఛ్ఛం అందజేశారు.భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం నంద్యాల జిల్లా, అహోబిలం క్షేత్రానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.

కొత్త జీవనోపాధి యూనిట్స్ ఏర్పాటు చేసుకొని ఆదాయ వనరులు పెంపొందించుకోవాలి... భాస్కర్ రెడ్డి,మెప్మా సిటీ మిషన్ మేనేజర్...

Image
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరం,అజిమొద్దిన్ నగర్ లో తస్లీమా పొదుపు లక్ష్మి గ్రూప్ వారు తయారు చేసే డిష్ వాష్ పౌడర్,ఫినాయిల్,సోప్ లు మార్కెటింగ్ కొరకు ఏర్పాటు చేసిన షాప్ ను ఇండియన్ బ్రాంచ్ మేనేజర్,మెప్మా సిటీ మిషన్ మేనేజర్,ఐద్వా రాష్ట్ర ఉప అధ్యక్షురాలు గురువారం ప్రారంభించారు.ఈ సంధర్బంగా గ్రూప్ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండియన్ మేనేజర్ వారు మాట్లాడుతూ తస్లీమా గ్రూప్ సభ్యులు అందరూ కలిసి గ్రూప్ యాక్టివిటీ చేసువడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇటువంటి చిరు వ్యాపార సంస్థలను ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇతర సభ్యులు కూడా యూనిట్స్ ఏర్పాటుకు ముందుకురావాలని తెలియ  చేశారు. మెప్మా సిటీ మిషన్ మేనేజర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ అర్హత ఉన్న అన్ని గ్రూప్ లకు సంబంధిత బ్యాంక్ లలో సుమారు రూ.20లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.ఋణం తీసుకున్న ప్రతి సభ్యురాలు ఏదో ఒక యూనిట్ ఏర్పాటు చేసుకొని వారి కుటుంబ ఆదాయం పెంచు కోవాలని ఆయన తెలియచేశారు.ఈ కార్యక్ర మంలో ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, స్వరాజ్యం పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు పద్మ,గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

నగర పౌరుల అరచేతిలో నగరపాలక సేవలు...

Image
ప్రతి ఒక్కరూ పురసేవ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఆర్.జి.వి.కృష్ణ,నగరపాలక అదనపు కమిషనర్  VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగర పౌరులు అరచేతిలో నగరపాలక సేవలు పొందవచ్చని నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి.కృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నగరాలు,పట్టణాల ప్రజల సౌకర్యార్థం,స్థానిక సమస్యలకు సులువుగా పరిష్కారం పొందేందుకు వీలుగా ‘పురమిత్ర’ యాప్‌ను రూపొందించిందని,నగరపాలకకు సంబంధించిన సమస్త సేవలను కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా,‌సులువుగా ‘పురమిత్ర’లోనే సకల సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.తాగునీరు, పారిశుద్ధ్యం,వీధి దీపాలు,ఇళ్లలో చెత్త సేకరణ,ఇంటిపన్ను చెల్లింపు,భవన నిర్మాణ అనుమతులు,ఆక్రమణలు,ప్రజారోగ్యం, దోమలు,కుక్కల బెడద,రహదారులపై గుంతలు,జనన,మరణ ధ్రువీకరణ పత్రాలు,కుళాయిల ఏర్పాటు,పేదరిక నిర్మూలన,వంటి 119రకాల సేవలు పురసేవ యాప్‌లో అందుతాయని వెల్లడించారు.దీనిని ప్లే స్టోర్‌ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.టైప్‌ చేసి లేదా లేదా వాయిస్‌ రూపంలోనూ పంపేందుకు అవకాశం ఉందని,సమస్యను ఫోటో తీస్తే ఆటోమెటిగ్ గా ఏఐ ద్వారా సంబంధిత చిరునామా అధిక...

జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ...

Image
VS9TV న్యూస్,అమరావతి క్రైం : జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది. కడప జిల్లాలో 417హెక్టార్ల సున్నపు రాయి గనులను అప్పటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం దాల్మియా సిమెంట్స్‌కు లీజు కిచ్చింది.ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీఐ గతంలోనే ఆరోపించింది.జగన్‌తో కలిసి దాల్మియా సిమెంట్స్‌ అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు సీబీఐ 2013లో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.తద్వారా జగన్‌ సుమారు రూ.150కోట్ల మేర అక్రమంగా లబ్ధి పొందినట్లు అందులో పేర్కొంది.రఘురామ్‌ సిమెంట్స్‌లో రూ.95కోట్ల విలువైన షేర్లు, రూ.55కోట్లు హవాలా రూపంలో దాల్మియా సిమెంట్స్‌ ఇచ్చినట్లు అభియోగం మోపింది.సీబీఐ ఛార్జ్‌ షీట్ ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.తాజాగా రూ.793 కోట్ల విలువైన అస్తులను అటాచ్‌ చేసింది.