కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషిని మర్యాద పూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఎస్పీ....
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలంలోని పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించేందుకు గురువారం విచ్చేశారు.ఈ సందర్భంగా ఓర్వకల్లు విమానాశ్రయంలో కేంద్రమంత్రిని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుఛ్ఛం అందజేశారు.భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు.కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం నంద్యాల జిల్లా, అహోబిలం క్షేత్రానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.
Comments
Post a Comment