Posts

VS9TV NEWS (VOICE OF SOCIETY)

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

Image
రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ చేసిన అధికారులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్, జూన్,25 : రాజస్థాన్లో ఓ వృద్ధుడు ఫిర్యాదు చేసేందుకు వే చి ఉండగా...మహిళా కానిస్టేబుల్ తన టేబు ల్ పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చు న్న ఫొటో వైరల్ కావడంతో ఆమెను సస్పెండ్ చేశారు.దుంగార్పూ ర్ జిల్లాలోని బిచ్చివార పో లీస్ స్టేషన్లో ఇది జరిగింది.ఈ ఘటనపై తీవ్ర వి మర్శలు రావడంతో,ఆమెపై క్రమశిక్షణా చర్య లు కూడా ప్రారంభించినట్లు పోలీసులు వెల్ల డించారు.

శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు...

Image
శ్రీశైల దేవస్థానం హుండీలు లెక్కింపు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,శ్రీశైలం,జూన్, 22 : శ్రీశైల దేవస్థానం,కార్యనిర్వహణాధికారి ఉత్త ర్వుల మేరకు సోమవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.ఈ హుండీల లె క్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 5,45,55,0 35 నగదు రాబడిగా లభించింది.కాగా ఈ హుండీల రాబడిని భక్తులు గత 27రోజులలో (26.05.202 6 నుండి 21.06.2026 వరకు) సమర్పిం చడం జరిగింది.అలాగే ఈ హుండీలో 12 7 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారు, 3.680 కేజీలు వెండి లభించాయి.అదేవిధం గా 392-యుఎస్ఏ డాలర్లు,10,10 5–యు. ఏ.ఇ దిర్హమ్స్,17-సౌది రియా ల్స్,38- సింగ పూర్ డాలర్లు,5–ఇంగ్లాం డు పౌండ్స్,18–మ లేషియా రింగిట్స్, 160–ఆస్ట్రేలియాడాలర్లు, 40–యూరోస్,10–కెనడా డాలర్లు,11–కత్తా రు రియాల్స్,3–ఓమన్ రియాల్స్,100-ఓమన్ బైసాలుమొదలైనవి ఈ హుండీల లెక్కింపులో లభించాయి.పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మ ధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చే పట్టడం జరిగింది.ఈ హుండీల లెక్కింపును కా ర్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు పర్య వేక్షించారు.హుండీల లెక్కింపును ధర్మకర్తల మండలి సభ్యులు జి.లక్ష్మేశ్వరి,జి.గంగమ్మ,కె. కాంతివర్ధిని...

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

Image
ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్నకూతురిని హత్య చేసిన తండ్రి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజం నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మాచర్ల,జూన్, 21: ప్రేమించిన యువకుడిని వివాహం చేసు కుం దనే ఆగ్రహంతో కన్న తండ్రే తన కు మార్తెను హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచ ర్లలో కలకలం రేపింది.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ,పోస్టుమా ర్టం నివేదికలో అసలు విషయం బయటపడ టంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్ద రు సంతానం.కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది.ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే జమ్మలమడక నాగరాజుతో ఆమె ప్రేమలో పడింది.ఇద్దరూ ఒ కే సామాజిక వర్గానికి చెందినప్పటికీ,తమ ప్రే మ వివాహాన్ని పెద్దలు అంగీకరించరని భావిం చిన జంట ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది.వివాహం అనంతరం కొంతకాలం చెన్నైలో ఉన్న వీరు,తర్వాత నరసరావు పేట లోని ఓ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందారు. కుమార్తె కనిపించకపోవడంతో చంద్రశ్రీను మా చర్ల పో...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్...నిందితులను కర్నూలు ఒకటవ ప ట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డుపై నడిపించిన పోలీసులు...

Image
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్... రిమాండ్ నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్డు పై నడిపించిన పోలీసులు నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం, జూన్,19 : కర్నూలు నగరంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గురువారం రాత్రి తైసీమ్ బాషాపై జరిగిన హత్యాయత్నం కేసును కర్నూ లు ఒకటవ పట్టణ పోలీసులు వేగంగా చేధిం చారు.నిందితులైన జలీల్ అహ్మద్,జునైద్,ఫైస ల్,ఆరిఫ్‌లను 24గంటల్లోనే చట్టపరంగా అరెస్ట్ చేసి న ట్లు ఒక టవ పట్టణ సీఐ మారుతి శంక ర్ శుక్రవారం తెలిపారు.కేసు దర్యాప్తులో భా గంగా నిందితులను అదుపులోకి తీసుకుని వి చారణ నిర్వహించిన అనంతరం,వారిని న్యా యస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపా రు.నేరాలకు పాల్పడడం వల్ల కలిగే చట్టపర మైన పరిణామాలపై నిందితులకు అవగాహన కల్పించారు.భవిష్యత్తులో ఇటువంటి సంఘ టనలకు పాల్పడకుండా కౌన్సెలింగ్ నిర్వహిం చినట్లు తెలిపారు. అనంతరం నిందితులను కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి కొండారెడ్డి బురు జు వరకు రోడ్డుపై నడిపించి తీసుకెళ్ళారు.ప్ర జల శాంతి భద్రతలకు విఘాతం ...

ఏసీబీ వలకు చిక్కిన సంగారెడ్డి విద్యుత్‌ అడి షనల్‌ ఏఈ...

Image
ఏసీబీ వలకు చిక్కిన సంగారెడ్డి విద్యుత్‌ అడిషనల్‌ ఏఈ నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,సంగారెడ్డి,జూ న్,19 : సంగారెడ్డి జిల్లా,బొల్లారం టీజీఎస్‌పీడీసీఎల్‌ లో అదనపు ఏఈగా పనిచేస్తున్న బి.రామకృ ష్ణారెడ్డి లంచం తీసుకుంటూ గురువారం మ ధ్యాహ్నం బహిరంగంగా పట్టుబడ్డారు.కారుతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న ఘటనలో తనపై చర్యలు తీసుకోవద్దని కోరిన బాధితుడి నుంచి రూ.25వేలు లంచం డిమాండ్ చేశారు.బాధి తుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి హైదరాబాద్ కో ర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

సూపర్ సిక్స్ అట్టర్ ప్లాప్...చంద్రబాబు వెన్ను పోటుకు రెండేళ్లు పోస్టర్ ,బుక్ లెట్ ఆవిష్కర ణ...కాటసాని రామభూపాల్ రెడ్డి,వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎమ్మెల్యే...

Image
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ,బుక్ లెట్ ఆవిష్కరణ  కాటసాని రామభూపాల్ రెడ్డి,వైఎస్సార్‌సీ పీ నంద్యాల జిల్లా అధ్యక్షులు,పాణ్యం మాజీ ఎ మ్మెల్యే  ప్రజా చరిత్ర న్యూస్,పాణ్యం,జూన్,03 : వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షు లు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూ పాల్ రెడ్డి వారి కార్యాలయంలో మీడియా స మావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నా యకులతో కలిసి “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్,బుక్‌ లెట్‌ను ఆవి ష్కరించారు.కాటసాని రామభూ పాల్ రెడ్డి మాట్లాడుతూ...సూపర్ సిక్స్ పేరు తో ఇచ్చిన హామీలు నేడు అట్టర్ ఫ్లాప్ అ య్యాయని,యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి,నిరుద్యోగులను న ట్టేట ముం చారని అన్నారు.నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రెండేళ్లు గడిచినా ఆ హామీ ఎక్కడ అ మలైందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన ఆడబిడ్డ నిధి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని,మహిళలను ఓట్ల కోసం మాత్ర మే ఉపయోగించుకుని ఇప్పుడు పూర్తిగా వి స్మరించారని మండిపడ్డారు.అలాగే 50 ఏళ్లకే పెన్షన...

జనసేన పార్టీ హైదరాబాద్‌ నడిబొడ్డన పు ట్టిం ది.తెలంగాణ నలుమూలలా తిరిగాను...పవన్ కళ్యాణ్,జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్య మంత్రి...

Image
జనసేన పార్టీ హైదరాబాద్‌ నడిబొడ్డన పు ట్టింది. తెలంగాణ నలుమూలలా తిరిగాను పవన్ కళ్యాణ్,జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,జూన్, 02 : తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లా డుతుందని అడుగుతున్నారు.జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్‌ నడి బొడ్డన...ఇది తెలం గాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదు,ఇప్పు డు విమర్శించే గొంతులు 2027లో లేవు అని, నేను తెలంగాణ నలు మూలలా తిరిగాను అ ని జనసేన అధ్యక్షులు,ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఈ మేరకు ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ బాగుండాలని అ ను కునే వాణ్ని.ఆదిలాబాద్‌ లాంటి నక్సల్‌ ప్రభా విత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించే వారు తి రగలేదన్నారు.నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు.విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం అ న్నారు.తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఏపీ ప్రజలపై విద్వేషం లేదు.హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు అడుగుతున్నారు. మీ అయ్య జాగీరా తెలంగాణ..మీరెవరు న న్ను బెదిరించడానికి ...బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా...నా ఇంటి అడ్రస్‌ చెప్పడానికే ఇ క్కడ ప్రెస్‌మీట్‌ పెట్టా.కేసీఆర్‌ గురించి 12ఏళ్ల ల్లో ఎప...

చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి...

Image
చెట్టుపై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్లను కిందికి చల్లిన కోతి ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,జూన్, 01 : యూపీ,ఉత్తరప్రదేశ్,బులంద్హర్లో ఒక కోతి చెట్టు పై కూర్చుని ఏకంగా రూ.2 లక్షల కరెన్సీ నోట్ల ను కిందికి చల్లింది...ఆస్తి రిజి స్ట్రేషన్ కోసం వ చ్చిన ఒక న్యాయవాది బ్యాగ్ ను లాక్కున్న ఆ కోతి,చెట్టెక్కి అందులోని నోట్లను గాల్లోకి విసిరే సింది.దీంతో ఆ నోట్లను ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు.కాసేపటి తర్వాత కోతి ఆ బ్యాగ్ ను వదిలేసి వెళ్లిపోయింది.దీనికి సంబంధించి న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరలవుతోంది.

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం...సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గు ర్తింపు,అరెస్ట్...

Image
ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో ఆస్తుల ధ్వం సం సీసీ కెమెరాల ఆధారంగా 18మంది గుర్తింపు, అరెస్ట్  ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం సహించం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు శ్రీధర్,కర్నూలు టూ టౌన్ సీఐ ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు క్రైం,జూన్ 01: ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛా లెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయో త్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొంద రు వ్యక్తులు ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్తులతో పా టు,బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలి గించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యా ప్తు చేపట్టారు.ఘటనకు సంబంధించిన సీసీ కె మెరా ఫుటేజీలు,సోషల్ మీడియా వీడియో లు,ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18మంది వ్యక్తులను గు ర్తించి అరెస్టు చేశారు.కోర్టుకు తరలించారు.ప్ర జా ఆస్తులు,ప్రభుత్వ ఆస్తులు,ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి ప...

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజి ల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి...ధర్నా చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సిఐటియు భారీ ర్యాలీ...

Image
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి ధర్నా చౌక్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు సిఐటియు భారీ ర్యాలీ ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కలెక్టరేట్,జూన్, 01: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్,డీజి ల్ వంటగ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ సిఐటియు న్యూసిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆ టో యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బి.రా ధాకృష్ణ అధ్యక్షతన ధర్నా చౌక్ నుండి కార్మికు లు,ప్రజలు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యా లయం దగ్గరకు చేరుకొని సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్మికులు డౌన్ డౌన్ నరేంద్ర మోడీ డౌన్ డౌన్ చంద్రబాబు నా యుడు రోజురోజుకు ప్రజలపై భారాలు వేస్తు న్న నరేంద్ర మోడీ చంద్రబాబు డౌన్ డౌన్ పెట్రో లు,డీజిల్ వంట క్యాష్ ధరలు తగ్గించే వరకు పోరాడుతాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు,సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్.నరసింహులు,సిఐటియు నగర అధ్యక్షులు వై.నగేష్,సిఐటియు జిల్లా నాయకు లు టి.రాముడులు కార్యక్రమానికి విచ్చేసిన కార్మికులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడు...

ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి...ఎస్ఎఫ్ఐ...

Image
ఎన్ టిఏ,నీట్ సంస్థలను రద్దు చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలి ఎస్ఎఫ్ఐ సాగర్ సందేశం న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్, జూన్,01:   నూతన విద్యా విధానం (నెప్ 2020)లో భా గంగా విద్యా కేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర లా స్థా యిలో జరిగే ఎం సెట్,పీజీ సెట్ లాంటివి రద్దు చేసి నీట్,సియూ సెట్,నీట్,లాంటివి ముందు కు తెచ్చి లక్షలాది మంది విద్యార్థుల జీవితాల ను నాశనం చేసింది అని ఎన్ టిఏ,నీట్ లను ర ద్దు చేసి విద్యార్థులను పేపర్ లీక్,లూట్ ల నుంచి విముక్తి చేయాలనీ దేశ వ్యాప్తంగా జూ న్,3-6తేదీలలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలుకు పిలుపునివ్వడం జరిగింది అని,నీట్, ఎన్ టిఏ సంస్థల వల్ల నష్టపోయిన విద్యార్థు లు,తల్లితండ్రులు,విద్యావేతలు అందరూ పా ల్గొనాలని ఎస్ ఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో పిలుపునిచ్చారు.రాష్ట్ర ఉపాధ్య క్షులు భగత్ రవి,రాష్ట్ర సహాయ కార్యదర్శి అ క్బర్,జిల్లా కార్యదర్శి రంగప్ప,జిల్లా అధ్యక్షులు సాయిఉదయ్ హాజరై మాట్లాడారు.దేశంలో గత 10సంవత్సరాలుగా నీట్,యూజిసి నెట్, సియూ సెట్,సీ బీఎస్సి పరీక్షలు సక్రమంగా ని ర్వహించడంలో కేంద్ర ఎన్డిఏ ప్రభుత్వం విఫలం అయింది అని తక్షణమే కేంద్ర విద్యా శాఖ మం త్రి ధ...

ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దం డాయన'...

Image
ఏపీలో మహిళల భద్రత కోసం 'ఆపరేషన్ దండాయన' ప్రజా చరిత్ర న్యూస్,అమరావతి ప్రతినిధి, జూన్,01: ఏపీ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం 'ఆపరే షన్ దండాయన' కార్యక్రమాన్ని తీసుకొస్తున్న ట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.నే రస్థులకు త్వరితగతిన శిక్షలు,60 రోజుల్లో ఛా ర్జిషీట్ల దాఖలు,రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు దీనిలో భాగమని వెల్లడించారు.మ హిళలపై నేరాలకు జీరో టాలెరెన్స్ పాలసీ తీ సుకొస్తామని,స్పీడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్ట మ్తో నిరంతర పర్యవేక్షణ జరుపుతామని తెలి పారు.

పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్ప వు...ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించం డి...క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి...చల్లా ఓబులేసు,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్ప వు ఉద్యోగులు విధులను శ్రద్ధతో నిర్వర్తించండి క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగండి చల్లా ఓబులేసు,నగరపాలక సంస్థ కమిషనర్  ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరేషన్, జూన్,01: నగరంలో ప్రతి శానిటేషన్ డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని,మార్పు కనబడ కపోతే సంబంధిత శానిటేషన్ ఇన్ స్పెక్టర్లు,కా ర్యదర్శులపై చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు హెచ్చరించా రు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాల నీలోని నగరపాలక సమావేశ భవనంలో పారి శుద్ధ్య పర్య వేక్షక సిబ్బందితో సమావేశం నిర్వ హించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లా డుతూ...తాను ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్య టిస్తూ,లోపాలను సరిచేసుకునేందుకు దిశా ని ర్దేశం చేస్తుంటే వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.శ్రద్ధతో విధులను నిర్వ ర్తించాలని,క్షేత్రస్థాయిలో విసృతంగా తిరగాల ని సూచించారు.తిరిగినప్పుడే సమస్యలు సు లువుగా అర్థం అవుతుందన్నారు‌.‌ప్రతి వాహ నానికి వెళ్ళాల్సిన మార్గాన్ని మ్యాపింగ్ చే యాలని,ఆ విషయాన్ని డ్రైవర్‌కి,పారి శుద్ధ్య సి బ్బందికి,ప్రజలకు స్పష్టం తెలియజేయాలని ...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

Image
మాదకద్రవ్యాల సమాచారమిద్దాం పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు కార్పోరేషన్, మే,01 :      మాదకద్రవ్యాల బారిన పడకుండా యువత ను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరించి,ఈగల్‌ (ఎలైట్‌ యాం టీ-నార్కోటిక్స్‌ గ్రూప్‌ ఫర్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌) కు సహకారం అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.క్షే త్రస్థాయిలో రాత్రింబవళ్లు ప్రజల మధ్య విధు లు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు అప్రమ త్తంగా ఉండాలని,ఎక్కడైనా డ్రగ్స్‌,గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరా లేదా రవాణా జరుగుతున్నట్లు గమ నిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు సమాచారం అందించాలని సూచించారు.సో మవారం 5వ శానిటేషన్ డివిజన్ కార్యాల యం వద్ద ఈగల్ టీం ఆధ్వర్యంలో మాదకద్ర వ్యాల నిర్మూలనపై పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మా ట్లాడుతూ...మాదకద్రవ్యాలు యువత భవి ష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.సమాజాన్ని ఈ ముప్పు నుంచి కాపాడేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయు తంగా వ్యవహరించాలన...

విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వి ద్యార్థిని,విద్యార్థులకు నోటు పుస్తకాలు,వృ ద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణీ...కమ్మరి పా ర్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సం క్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు...

Image
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వి ద్యార్థిని,విద్యార్థులకు నోటు పుస్తకాలు, వృద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణీ కమ్మరి పార్వతమ్మ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వి శ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేష న్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ప్రజా చరిత్ర న్యూస్,కైకలూరు : మే,31 : కైకలూరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ పేద విద్యార్థిని,వి ద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ,వృద్ధులకు బియ్యము,పెన్షన్ పంపిణి కార్యక్రమం కైకలూ రు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు తుపాకు ల సోమాచారి అధ్యక్షతన ఆదివారం కార్యక్ర మం ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి ఆంద్రప్ర దేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,నంద్యాల పార్లమెంట్ మ హిళా అధ్యక్షురాలుకమ్మరి పార్వతమ్మ,మాజీ మంత్రి,కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీ నివాస్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మల చేతుల మీదుగా విద్యార్థులకు నోటు పుస్తకాలు,వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు.అనంతరం కైకలూరు రూరల్ ఆర్టీజా న్స్ క్లస్టర్ లోగో ఆవిష్కరణ చేశారు. ఈ కార్య...

అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గణేష్ నగర్ పార్క్...పిర్యాదు చేసిన చర్యలు శూన్యం...పట్టించుకోని అధికారులు...అగ్ర హిస్తున్న స్థానికులు...

Image
అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిన గణేష్ నగర్ పార్క్ పిర్యాదు చేసిన చర్యలు శూన్యం పట్టించుకోని అధికారులు అగ్రహిస్తున్న స్థానిక వాసులు ప్రజా చరిత్ర న్యూస్,కర్నూలు ప్రతినిధి, మే,25 : నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వార్డులో ప్రజ ల ఆరోగ్యం,ఆనందం,ఆహ్లాదం కోసం పార్క్ ల కోసం కొంత స్థలాన్ని కేటాయిస్తారు.ఆ స్థలంలో స్థానిక ప్రజల కమిటీ బృందం విజ్ఞాపన మేరకు ఆ పార్క్ లో ఉదయం, సాయంత్రం స్త్రీ,పురుషు లు,పిల్లలు,వయోవృద్ధులు నడక కోసం,పిల్లలు ఆడుకోవడానికి కావలసిన వసతులు అన్ని అందులో ఏర్పాటు చేస్తారు.ప్రధానంగా పిల్లల కోసం ఊయల,జారుడు బండ,సైక్లింగ్,గుండ్రం గా తిరిగే పరికరాలు వివిధ రకాల వ్యాయా మం చేసుకునే వీలుగా పరికరములను ఏర్పా టు చేస్తారు.దీంతో పిల్లలు యువకులు మహి ళలు వృద్ధులు వాటిని ఉపయోగించుకొని ఉదయం,సాయంత్రం పార్కులకు వెళ్లి ఎవరికి కావాల్సిన వ్యాయామాలు వారు చేసుకుంటూ తమ ఆరోగ్య పరిరక్షణ,మానసిక ఉల్లాసం పొందుతారు.అందుకోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు. అయితే కొన్ని పార్క్ లు నిర్వహణ లోపం వల్ల నిర్మానుష్యంగా మారుతున్నాయి.అలాంటి పా ర్క్ ల్లో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి.ఇదే ...

అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం...

Image
అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినో త్సవం ప్రజా చరిత్ర న్యూస్,హైదరాబాద్,మే,25 : తప్పిపోయిన పిల్లల,అపహరణకు గురైన పిల్ల ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం అంతర్జాతీయంగా ఈ దినోత్సవం జరుపుకుం టారు.2001నుండి ఆరు ఖండాలలోని ఎరవైకి పైగా దేశాల్లో ఈ దినోత్సవాన్ని పురస్కరించు కుని అవగాహ నా కార్యక్రమాలు,తల్లిదండ్రు లు,పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,స్వచ్చం ద సంస్థలు,ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై సెమినార్లు,ప్రదర్శనలు వంటి కార్య క్ర మాలు పెద్దఎత్తున నిర్వహిస్తారు.1998లో యునైటెడ్ స్టేట్స్ లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్లోయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ ప్రారంభించబడింది.పిల్లల అపహ రణ,పిల్లలపై లైంగిక వేధింపులు,పిల్లలు దోపి డీకి గురవ్వకుండా ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్న స్వచ్చంద సంస్థ ఇది.ఇరవై తొమ్మిది దేశాలు ఈ సంస్థ పరిదిలో పనిచేస్తున్నాయి.తప్పిపో యిన పిల్లలను వెతికి వారి కుటుంబాలకు తి రిగి కలిపే ఆశను సూచించే ఫేర్గెట్మినాట్ అనే పువ్వును ఈ రోజుకు ప్రతీకగా ఉపయో గిస్తా రు.గత వారం క్రితం సుప్రీంకోర్టు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పిపోయ...

అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇ ప్పించండి...అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

Image
అవసరమైన రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇ ప్పించండి అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం VS9TV న్యూస్,మార్కాపురం : అవసరమైన రంగాల్లోనే నిరుద్యోగ యువ త కు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారు లను ఆదేశించారు.స్థానిక కలెక్టరేట్లోని ఆమె ఛాంబర్ లో బుధవారం జిల్లాలోని నైపుణ్య అభివృద్ధి అధికారులతో పాటు సంబంధిత శా ఖ అధికారులతో జిల్లా నైపుణ్య అభివృద్ధి అభి వృద్ధి కమిటీ మొదటి సమావేశం నిర్వహించా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.సంబంధిత శాఖ అధికారులు వారి పరిధిలో ఉండే నిరుద్యోగులకు జాబ్ మేళాల వివరాలు తెలియ జేయాలన్నారు.అ దేవిధంగా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరారు.వ్యవ సాయ,సోలార్ పంప్ టెక్నీషియన్,డ్రోన్ పైలెట్స్, ప్రకృతి వ్యవసాయం,నిర్మాణరంగం వంటి వా టిలో యువతకు శిక్షణ ఇప్పించాల్సిన ఆవశ్య కతను తెలియజేశారు.జిల్లా నైపుణ్య అభివృ ద్ధి కమిటీలో ఉన్న వివిధ శాఖలకు చెందిన 19 మంది సభ్యులు సమన్వయంతో నిరుద్యోగు లకు మంచి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు క ల్పించాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్...

రేపు వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచుర ణ...ఈ నెల 24వరకు సలహాలు,సూచనల స్వీ కరణ...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు...

Image
రేపు వార్డుల ప్రతిపాదిత ముసాయిదా ప్రచురణ ఈ నెల 24వరకు సలహాలు,సూచనల స్వీకరణ నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం మార్చి,24న జారీ చేసిన జీవో నెంబర్ 65 ఉత్తర్వుల మేరకు కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 52 ఎన్ని కల వార్డులను 68వార్డులుగా పునర్విభజన కు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను సోమవారం ప్రచురించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదివారం ఒ క ప్రకటనలో తెలిపారు.సోమవారం వార్డుల స రిహద్దులతో కూడిన ప్రతిపాదిత ముసాయి దాను అధికారికంగా ప్రచురించి,మున్సిపల్,క లెక్టరేట్,ఆర్డీవో,తహశీల్దార్లు, సబ్-రిజిస్ట్రార్ కా ర్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించను న్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధా రంగా అన్ని సమగ్ర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ముసాయిదాను రూపొందించి నట్లు కమిషనర్ పేర్కొన్నారు.ముసాయిదాపై ప్రజలు,ప్రజాప్రతినిధులు,రాజకీయ పార్టీలు,ప్ర జా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయా లు,సలహాలు,సూచనలు ఏవైనా ఉంటే ఈనెల 24వ తేదీ సాయంత్రం 5-00గంటలలోపు నగ రపాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక వి భాగానికి వ్రాతపూర్వకంగా సమర్పించాలని...

విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు...రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు...

Image
విజయ్‌ నాకు సమవుజ్జీ కాదు కమల్‌ సీఎం అయితే అసూయపడతా స్టాలిన్‌ నాకు మంచి మిత్రుడు పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాణ్ని రాజకీయాలతో సంబంధం లేదు రజినీకాంత్‌ సంచలన వ్యాఖ్యలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారని.. అందుకే విజయ్‌ గెలిచారని స్టార్‌ హీరో రజినీ కాంత్‌ అన్నారు.తనకు రాజకీయాలతో ఎలాం టి సంబంధం లేదన్నారు.తానే గనక పార్టీ పెడి తే ఖచ్చితంగా గెలిచేవాడినన్నారు.డీఎంకే అ ధినేత స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని తెలి పారు.అందుకే ఆయన్ని కలిసినట్లు వెల్ల డిం చారు.ఎన్నికల ఫలితాల అనంతరం స్టాలిన్‌ను కలిసిన నేపథ్యంలో రజినీపై విమర్శలు వచ్చి న విషయం తెలిసిందే.దీంతో ఆదివారం చెన్నై లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏ ర్పాటు చేసి వివరణ ఇచ్చారు.మరోవైపు విజ య్‌ సీ ఎంగా గెలవకూడదని తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని రజినీకాంత్‌ చెప్పారు. విజయ్‌ను తనకు సమవుజ్జీగా భావించడం లే దన్నారు.తమ వయసులో 25ఏళ్ల వ్యత్యాసం ఉందన్నారు.కమల్‌ హాసన్‌ సీఎం అయితే అ సూయ పడతాను గానీ,విజయ్‌ విషయంలో అలాంటిదేమీ లేదన్నారు.రెండు ప్రధాన పార్టీ లను ఢీకొని గె లిచిన విజయ్‌కు తాను శుభా కాంక్షలు తెలిపానని గ...

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం...నదిలోకి దూకి నిర్మాత ఆత్మహత్య...

Image
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నదిలోకి దూకి నిర్మాత ఆత్మహత్య VS9TV న్యూస్,హైదరాబాద్ : తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ సినీ నిర్మాత కె.రాజన్ అ డయార్ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది.ఈ విషయం తెలుసుకున్న అ గ్నిమాపక శాఖ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి ఆసు పత్రికి తరలించారు.ఆయన ఆత్మ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కె.రాజన్ 1983లో బ్రహ్మచా రిగల్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా తమిళ చిత్రసీమ లోకి అడుగుపెట్టారు.అతను ప్రభుదేవా డబు ల్స్,ఆమె పావం,సోయంత దాట్ల వంటి చిత్రాల ను కూడా నిర్మించాడు.ఆయననమ్మ ఊరు మ రియమ్మ,అంబగిగల్ వంటి చిత్రాలకు దర్శక త్వం వహించారు.అతను కబడ్డీ కబడ్డీ,పాం బు సట్టై,అజితిన్ తడువు,పగసూరన్ వంటి చి త్రాలలో కూడా నటించాడు.ప్రస్తుతం ఆయన వయసు 86సంవత్సరాలు.తమిళ చిత్రసీమ లోని చిన్న బడ్జెట్ చిత్రాలకు తన మద్దతును కొనసాగిస్తున్నారు.నిర్మా త కె.రాజన్ చెన్నై డి స్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూ డా పనిచేశారు.ఫిల్మ్ ఫెస్టివల్స్,ఇంటర్వ్యూల ద్వారా తన అభిమానులలో చాలా ప్రజాదరణ పొందాడు.మే,17 ఆదివారం సాయంత్రం తన కారులో ప్రయాణిస్...

కల్లూరు వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వా లి...పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరి త రెడ్డి...

Image
కల్లూరు వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరి తరెడ్డి VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : నగర పరిధిలో ఉన్న కల్లూరు వార్డుల అ భివృ ద్ధికి నగరపాలక అధికారులు ప్రత్యేక ప్రాధాన్య త ఇవ్వాలని పాణ్యం నియోజ కవర్గ ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి సూచించారు.శనివారం స్థానిక ఎస్బీఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి నగరపాలక అధికా రులతో సమావేశం నిర్వహించారు.కల్లూరు వా ర్డుల వారీగా జరుగుతున్న అభివృద్ధి పను లు, పెండింగ్ సమస్యలు,ప్రజల అవసరాలపై సమ గ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...వార్డుల వారీగా కాకుండా జ నాభా ప్రాతిపదికన నిధులను కేటాయించడం ద్వారా ప్రజలకు అవసరమైన మౌలిక వసతు లు సమర్థ వంతంగా అందించవచ్చని పేర్కొ న్నారు.పార్కు స్థలాలకు ఫెన్సింగ్ వేసి వాటిని ప రిరక్షించాల్సిన అవసరం ఉందని,340 సి ర హదారి విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే చెక్‌పోస్ట్ నుం డి సఫా కళాశాల వైపునకు నగరపాలక పరిధి లో వరకు డ్రైన్ నిర్మా ణానికి తక్షణమే నిధు లు కేటాయించాలని సూచించారు.శంకుస్థాప న చేసిన అభివృద్ధి...

జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరే షన్ డే ”...సరైన పత్రాలులేని 40వాహనాలు స్వాధీ నం...కర్నూలు జిల్లా పోలీసులు...

Image
జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరే షన్ డే ” సరైన పత్రాలులేని 40వాహనాలు స్వాధీనం కర్నూలు జిల్లా పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వ జ్రప్రహార్” లో భాగంగా రాష్ట్ర డిజిపి హరీష్ కు మార్ గుప్తా ఆదేశాల మేరకు,ఈగల్ ఐజి ఆకే రవికృష్ణ పర్యవేక్షణలో,కర్నూలు జిల్లా ఎస్పీ వి క్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కా ర్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వ హించారు.పత్తికొండ సబ్ డివిజన్,వెల్దుర్తి గ్రా మం,ఎమ్మిగనూరు సబ్ డివిజన్,నందవరం పీఎస్ పరిధిలోని,కనకవీడు గ్రామం,ఆదోని సబ్ డివిజన్,పెద్ద తుంబళం పీఎస్ పరిధిలో ని కుప్పగల్ గ్రామం,కర్నూలు సబ్ డివిజన్,క ర్నూలు తాలుకా పియస్ పరిధిలోని వెంకన్న బావి,దిన్నెదేవర పాడు,అంబేద్కర్ నగర్ ప్రాం తాలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహిం చారు.ఈ సందర్బంగా మాదకద్రవ్యాల విని యోగం,అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు.డిఎస్పీలు,సిఐలు, ఎస్సైలు,స్పెషల్ టీంలు,పోలీసు సిబ్బంది మొత్తం 162 మంది ప...

ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రిడిటే షన్లు ఇవ్వండి...రాయలసీమ జర్నలిస్టుల ఫో రం...

Image
ఇ ఫైలింగ్ అయిన పత్రికలకు వెంటనే అక్రి డిటేషన్లు ఇవ్వండి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లాలో పెండింగ్ లో ఉన్న పత్రికల కు వెంటనే అక్రెడిటేషన్ లు ఇవ్వాలని కర్నూ లు పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జయమ్మకి రాయలసీమ జర్నలిస్టుల ఫోరం ఆ ధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులు బత్తిన నవీ న్,సిరిపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లు మాట్లాడుతూ గతంలో అ క్రిడిటేషన్లు కొన్ని పత్రికలకు సర్క్యు లేషన్ తక్కువ ఉన్నాయని,ఈ ఫైలింగ్ చేసేట పుడు ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు మాత్రమే అక్రిడిటేషన్లు ఇవ్వా లని సర్క్యులేషన్ తక్కువ ఉన్న పత్రికలకు ఈ ఎకనామికల్ సంవత్సరంలో ఆర్ఎన్ఐ రూల్ ప్రకారం పేపర్ సర్క్యులేషన్ అప్లోడ్ చేసుకుం టే రూల్ ప్రకారం అక్రెడిటేషన్ ఇచే విధంగా అ క్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది.ఈ నేపథ్యం లో ఏప్రిల్,1వ తేదీ నుండి ఇ- ఫైలింగ్ సైట్ ఓపె న్ కావడంతో అర్హత పొందిన పత్రిక నిర్వాహ కులు ఇ-ఫైలింగ్ చేయించి కార్యాలయంలో స మర్పించి 45రోజులు అవుతున్నా ఇంతవరకు అక్రిడిటేషన్లు ఇవ్వలేదని డిడిని ప్రశ్నించారు.అ నంతరం సమ...

పంచలింగాల టోల్‌గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరి శీలన యాత్ర బస్సు ప్రారంభం...

Image
పంచలింగాల టోల్‌గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరి శీలన యాత్ర బస్సు ప్రారంభం VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా పంచలింగాల టోల్‌గేట్ వద్ద శనివారం నిర్వహించిన బ్లాక్ స్పాట్స్ పరిశీలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సును జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం పంచ లింగాల టోల్‌ గేట్ పరిసర ప్రాంతాల్లో గుర్తించి న ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించి,రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు మరియు హైవే అధికా రులకు పలు సూచనలు చేశారు.రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం లేకుండా చర్యలు తీసుకో వాలని,ప్రమాదాలకు కారణమయ్యే అంశాల ను వెంటనే గుర్తించి పరిష్కరించాలని అధికా రులు ఆదేశించారు.ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులు,స్పీడ్ నియంత్రణ చర్య లు,సరైన లైటింగ్,రహదారి గుర్తులు ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చే శారు.

జర్నలిస్టులకు టోపీలు పంపిణీ...

Image
జర్నలిస్టులకు టోపీలు పంపిణీ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : మౌర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు, యూనియన్ నాయకులకు ఏపీ యూడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావుతో కలసి డాక్టర్ వసీం శనివారం టోపీలు పంపిణీ చేశా రు.ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ...వా ర్తల సేకరణలో జర్నలిస్టులు నిత్యం బిజీగా ఉంటారన్నారు.ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల కనీ స జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదన్నారు. ప్రధానంగా ఎండాకాలం ఎండలు మండు తు న్నాయని,తలమీద ఎలాంటి రక్షణ లేకుండా జర్నలిస్టులు క్రయాణిస్తున్నారని ఈ క్రమంలో కొందరు వడదెబ్బకు గురై ప్రాణాల మీదకు తె చ్చుకుంటున్నారని చెప్పారు.అలా కాకుండా ఎండకు వెళ్ళేట ప్పుడు టోపీలు ధరించాలని సూచించారు.జర్నలిస్టుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తమ ఆసుపత్రి తరుపున టోపీలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.చివరిగా ఇటీవల ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐ జేయూ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్ని కైన ఈ.ఎన్.రాజును రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు,జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ జా తీయ కార్యవర్గ సభ్యులు,జిల్లా అధ్యక్షులు ఈ. ఎన్.రాజు, ఏ...

పెంచిన పెట్రోల్ డీజిల్,గ్యాస్ ధరలు ఉపసం హరించుకోవాలి...సీఐటీయు డిమాండ్...

Image
పెంచిన పెట్రోల్ డీజిల్,గ్యాస్ ధరలు ఉపసం హరించుకోవాలి సీఐటీయు డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీ జిల్ ధరలు భారీగా పెంచుతూ సామాన్య ప్రజ లపై రవాణా రంగం కార్మికులపై పెనుబారం మోపిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరే కంగా జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్ యూనియన్ న్యూ సిటీ క మిటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కర్నూలు కొ త్త బస్టాండ్ ఇన్ గేటు ముందు శనివారం రా స్తారోకో కార్యక్రమం ఆటో యూనియన్ న్యూ సిటీ ఉపాధ్యక్షులు పి.నబి సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐటియు న్యూ సిటీ అధ్యక్ష,కార్యదర్శులు నగేష్,ఆర్,న రసింహులు,ఆటో యూనియన్ సీఐటీయు జి ల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ మాట్లాడు తూ భారీగా పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.పెంచిన పెట్రోల్,డీజిల్ ధరల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపై ఆటో డ్రైవర్లపై పెను బారంగా మారిందని,నరేంద్ర మోడీ నియంతృ త్వ ధోరణి విడనాడాలని,ఒకపక్క ఆధిపత్యం కోసం యుద్ధం వల్ల అనేక దేశాలు అతలాకుత లం అవుతుంటే, కనీసం యుద్ధం నివారించాల ని ప్రకటన కూడా చేయకపోవడం నరేంద్ర మో డీ ర...

32వ వార్డు,ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి...సిపిఎం డిమాండ్...

Image
32వ వార్డు,ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య పరిష్కరించాలి సిపిఎం డిమాండ్  VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు ముజఫర్ నగర్ లో మంచినీటి సమస్య తక్షణ మే పరిష్కరించాలని కాలనీలోని 10వ లైన్ లో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ధర్నా చే పట్టారు.ఈ సందర్బంగా సిపిఎం పార్టీ న్యూసి టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్ మాట్లా డుతూ మున్సిపల్ పరిధిలోని 32వ వార్డు,ము జఫర్ నగర్ లో హంద్రీ వెంట ప్రతి లైనుకు దా దాపు 15ఇండ్లకు మంచినీరు సరఫరా సరిగా జరగడంలేదని అన్నారు.ప్రజలు కనీసం తాగు నీటికి కూడా నోచుకోవడం లేదని ఆవేదన చెం దారు.తాగునీటి సమస్యను పరిష్కరించలే ని అధికారుల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఆందోళ న చేపట్టడం జరిగిందని చెప్పారు.అంతేకాకుం డా...32వ వార్డ్ లో వాటర్ మెన్ ల వ్యవ హా రం దారుణంగా ఉందన్నారు.ఇంటి పన్నులు, కుళాయి పన్నులు కడుతున్న ప్రజలు తమ ఇంటి నిర్మాణానికి కుళాయి నీరు వాడుకోకూ డదు అని రాష్ట్రంలో లేని కొత్త నిబంధనలతో కుళాయిలు తొలగించడం దుర్మార్గం అని మం డిపడ్డారు.ఇప్పటికైనా వాటర్ మెన్ లు ఇలాం టి దుర్మార్గమైన వ్యవహారాలు మానుకోవాల ని,స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని...

అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలులో వైస్సార్సీపీ ధర్నా...కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఆపాలని నేతల డిమాండ్...

Image
అక్రమ అరెస్టులకు నిరసనగా కర్నూలులో వైస్సార్సీపీ ధర్నా కార్యకర్తలపై పోలీసు వేధింపులు ఆపాలని నేతల డిమాండ్ రెడ్‌బుక్ రాజకీయాలతో వైస్సార్సీపీని అణగ దొక్కలేరని హెచ్చరిక బాలుని ఘటనపై ప్రభుత్వ తీరును ఖండించి న నాయకులు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలులో వైస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు,అరెస్టులు చేస్తున్నారంటూ వైస్సార్సీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.కర్నూ లు యువజన విభాగ నాయకుడు బాలునిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇంటికి వెళ్లగా, పోలీసుల బెదిరింపులకు భయపడి అతను ఆ త్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని నాయకు లు ఆరోపించారు.ఇటీవల ఓ యువకుడు తన సూసైడ్ నోట్‌లో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడి పేరు ను ప్రస్తావించినప్పటికీ ఇప్ప టివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని,అయితే అదే విషయం పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వైస్సార్సీ పీ కార్యకర్త సన నరసింహను తెల్లవారుజా మున అరెస్ట్ చేశారని విమర్శించారు.ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే తప్పుడు కేసులు న మోదు చేస్తూ,పోలీసులను అడ్డుపెట్టుకొని టీ డీపీ ప్రభుత్వం వైస్సార్సీపీ శ్రేణులను అణగదొ క్కాలని చూస్తోందని ఆరోపిస్తూ కర్నూలులో వై స్సార్సీపీ ఆధ్వర్యంలో గురువా...

శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు...

Image
శాంతి భద్రతల పరిరక్షణకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు,సమావేశాలకు అనుమతి లేదు ఎం.ఉపేంద్ర బాబు,కర్నూలు ఇంచార్జ్ డీఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేర కు కర్నూలు పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ,ప్రజా ప్రశాంతత దృష్ట్యా భా రతీయ పోలీస్ చట్టం 1861లోని సెక్షన్ 30 పో లీసు యాక్ట్ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని కర్నూలు ఇంచార్జ్ డీఎస్పీ ఎం.ఉపేంద్ర బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు.కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో తరచుగా జరుగుతున్న ధ ర్నాలు,ఆందోళనలు,రాస్తారోకోలు తదితర కార్యక్రమాల వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ముందస్తు లిఖి తపూర్వక అనుమతి లేకుండా ప్రజా సమావే శాలు,ఆందోళనలు,ధర్నా లు,రాస్తారోకోలు,ఊ రేగింపులు,ప్రచార కార్యక్రమాలు నిర్వహించరా దని స్పష్టం చేశారు.అనుమతుల కోసం ఆర్గ నైజర్లు,నిర్వాహకులు ముందుగానే సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూ చించారు.ఈ ఉత్తర్వులు ఈ నెల 01వ తేదీ నుండి 31వ తేదీ వరకు కర్నూలు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అమలులో ఉంటుందని ఇ...

సర్వేనెంబర్ 142 వక్ఫ్ భూముల కొనుగోలు నిలిపివేయాలి...ఆవాజ్ కమిటీ డిమాండ్...

Image
సర్వేనెంబర్ 142 వక్ఫ్ భూముల కొనుగోలు నిలిపివేయాలి ఆవాజ్ కమిటీ డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : జోహారాపురం గ్రామపరిధి,సర్వేనెంబర్ 142 వ క్ఫ్ భూముల కొనుగోలు నిలిపి వే యాలని,వ క్ఫ్ బోర్డు స్థలాన్ని కబ్జాకోరుల నుండి రక్షించా లని ఆవాజ్ నగర అధ్యక్ష కార్యదర్శులు పీ.ఇ క్బాల్ హుస్సేన్,ఎస్.ఎం.డి.షరీఫ్ లు బుధ వారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దాదాపు రూ.100కోట్లకుపైగా విలువ చేసే స్థలాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యా పారస్తులు వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజి స్ట ర్లు చేయించి,ప్లాట్ల రూపంలో వేయడం వల్ల ప్రజల మోసపోయారని వారు తెలియజేశా రు.వక్ఫ్ బోర్డు స్థలాన్ని అమ్మడం గాని,కొనడం గాని జరగదనే విషయం ప్లాట్ లు కొన్న వారికి తెలియకపోవడంతో అధికారులు అక్రమ రిజి స్టర్లు చేయడం వల్ల ముస్లిం సమాజానికి రూ.1 00 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని, దీంతో తీరని లోటు కలిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సర్వే నంబర్ 142లో కెపి వెంక ట్ రెడ్డి నగర్ పేరుతో కొందరు స్థిరాస్తి వ్యాపా రులు స్థిరాస్తి వెంచర్ వేశారు.(డైరెక్టర్ ఆఫ్ టౌ న్ అండ్ కంట్రీ ప్లానింగ్) అధికారులు అను మ తులు ఇచ్చారు.109 ప్లాట...

అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొనుగో లు చేయాలి...ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్...

Image
అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొనుగోలు చేయాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ VS9TV న్యూస్,మిడుతూరు : అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొను గోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం నంద్యాల జిల్లా, మిడుతూరు మండలం,మాసపేట గ్రామంలో ఉన్న ఐటీసీ కంపెనీ ముందు మూ డు గంటల పాటు రైతులను కలుపుకొని ఆందోళన చేప ట్టారు.ఈ సందర్భంగా జి.రామకృష్ణ మాట్లాడు తూ ఐటిసి కంపెనీ అనుమతితో జిల్లాలో అనే క చోట్ల పొగాకు పంటను రైతులు పండించార ని అన్నారు.విత్తనాలు నాటు మొదలుకొని,పొ గాకు పూర్తి అయ్యేంతవరకు వారి పర్యవేక్షణ లోనే రైతులు పంటలు పండిస్తారని తెలియజే శారు.అలా కాకుండా వారి అనుమతి లేకుం డా వేస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమని ఎప్ప టికప్పుడు చెబుతూ పంపిణీ ప్రచారం చేస్తుం దని కూడా తెలియజేశారు.కానీ కర్నూలు మం డలం,ఉల్చాల,తదితర గ్రామాలలో రైతులు వారి అనుమతితో వారి సూచనలు పాటిస్తూ పొగాకు పంట వేసినప్పటికీ చివరిలో పొగాకు బాగోలేదని నీళ్లతో పండించారని,వివిధ సాకు లు చెప్పి పొగాకు కొనుగోలు చేయకుండా రై తులను ఇబ్బందులకు గు...

క్రీడా స్ఫూర్తితో యువతరం రాణించాలి... అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్యారమ్స్ పోటీలు...మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి...

Image
క్రీడా స్ఫూర్తితో యువతరం రాణించాలి  అట్టహాసంగా ప్రారంభమైన జిల్లాస్థాయి క్యారమ్స్ పోటీలు  మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి VS9TV న్యూస్,కర్నూలు స్పోర్ట్స్ : క్రీడా స్ఫూర్తితో యువతరం క్రీడా రంగంలో రా ణించాలని మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రె డ్డి అన్నారు.మంగళవారం కర్నూలు నగరంలో ని యునైటెడ్ క్లబ్ ఆవరణలో జిల్లా స్థాయి క్యా రమ్ పోటీలను క్లబ్ అధ్యక్షులు భీమేశ్వర్ రెడ్డి, కార్యదర్శి బలరామ్,గేమ్స్ సెక్రటరీ చెన్నకేశవ రాజుతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సం దర్భంగా మాజీ జెడ్పిటిసి దేశాయి సమీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యు వతరం డిజిటల్ మత్తును వీడి క్యారమ్స్ సాధ న వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆటో విడుపు కోసం కాకుండా క్యారమ్స్ క్రీడ ను ప్రొఫెషనల్గా ఆడితే మంచి ఉద్యోగ అవకా శాలు పొందవచ్చు అన్నారు.అనంతరం క్లబ్ అ ధ్యక్ష,కార్యదర్శులు భీమేశ్వర్ రెడ్డి,బాలరామ్ లు మాట్లాడుతూ క్రమశిక్షణతో అంకితభావం తో ప్రతిరోజు క్యారమ్స్ సాధన చేయాలని సూ చించారు.వివిధ ప్రాంతాల నుంచి సింగిల్స్ వి భాగంలో 70మంది పేర్ల ను నమోదు చేసుకు న్నారని,డబల్ ఎంట్రీ 40టీములు వచ్చాయని తెలిపారు.ఈ పోటీలు వ...

కూటమి సర్కార్ సంచలన నిర్ణయం...ట్రా న్స్‌జెండర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు...

Image
కూటమి సర్కార్ సంచలన నిర్ణయం ట్రాన్స్‌జెండర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : సమాజంలో దశాబ్దాలుగా వివక్ష,నిరాకరణ,ఉ పాధి లేమి,గుర్తింపు సమస్యలతో సతమతమ వుతున్న ట్రాన్స్‌జెండర్ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొండంత భరోసా ఇచ్చింది.ట్రాన్స్‌జెం డర్ల హక్కుల పరిరక్షణ,వారి సామాజిక అభి వృద్ధి కోసం ప్రత్యేకంగా ‘రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు’ ను ఏర్పాటు చేస్తూ, దానికి ప్రతినిధులను ని యమిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీఓ ఎంఎ స్ నంబర్ 14ను విడుదల చేసింది.కేంద్ర ప్ర భుత్వం తీసుకొచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019’, ‘రూల్స్-2 020’ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చే పట్టింది.మహిళా,శి శు,దివ్యాంగులు,వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో ఈ బోర్డు పనిచేస్తుంది.ఈ బోర్డులో వి విధ ప్రాంతాల నుంచి ప్రతినిధులను ప్రభు త్వం నామినే ట్ చేసింది.ఆంధ్రా ప్రాంత ప్రతిని ధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్,రాయలసీమ ప్రాం త ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వ్య వహరిస్తారు.ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులుగా కో టా ప్రేమ్ సాగర్ రాయ్ (తూర్పుగోదావరి),న క్క ...

ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు...సెప్టెం బర్‌లో నోటిఫికేషన్...వార్డుల విభజన,బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం...ఎన్నికల ఏర్పా ట్లపై అధికారులతో సమీక్షించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా...

Image
ఏపీలో స్థానిక ఎన్నికల కసరత్తు...సెప్టెం బర్‌లో నోటిఫికేషన్ వార్డుల విభజన,బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ వేగవంతం ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీ క్షించిన ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వ హణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) స న్నాహాలు ప్రారంభించింది.ప్రస్తుత పాలకవర్గా ల పదవీకాలం ముగియ నుండటంతో,సెప్టెంబ ర్‌లో ఎన్నికల నోటిఫి కేషన్ జారీ చేసి,డిసెంబ ర్ నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.కొత్త ఏడాదికి నూతన పా లకవర్గాలు కొలువుదీరేలా చర్యలు చేపడుతోం ది.ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం అమరావ తిలో కీలక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశానికి పంచాయతీ రా జ్,గ్రామీణాభివృద్ధి, మున్సిపల్,బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు,కమిషనర్లు హాజ రయ్యారు.ఎన్నికల ఏర్పాట్లు,వార్డుల పునర్వి భజన,రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై ఆ యన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చే శారు.ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పురపాలక సంఘాల్లో వార్డులు,డివిజన్ల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని,...

భారతీయ వైద్యరంగంలో ఒక సరికొత్త మైలు రాయి...ఒరిస్సా వైద్యుల ఘనత...

Image
భారతీయ వైద్యరంగంలో ఒక సరికొత్త మైలురాయి ఒరిస్సా వైద్యుల ఘనత VS9TV న్యూస్,హైదరాబాద్ : ఒక క్షణం జరిగిన ఘోర ప్రమాదం ఒక యువ కుడి భవిష్యత్తును పూర్తిగా చీకటిలోకి నెట్టే సింది.కానీ దేవుడిలా వచ్చిన డాక్టర్లు అసాధ్యా న్ని సుసాధ్యం చేసి ఒక వైద్య అద్భుతాన్ని సృ ష్టించారు.ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘ టన భారతీయ వైద్యరంగంలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచింది.14 ఏళ్ల వయసున్న శివాన్ష్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ ఒక భా రీ మిషన్ లో చిక్కుకోవడంతో అతని చెయ్యి పూర్తిగా తెగిపోయింది.కళ్లెదుటే జరిగిన ఆ ఘోరమైన దృశ్యంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలతో,కన్నీరు మున్నీరవుతూ... తెగిపోయిన చేతిని తీ సుకుని వెంటనే ఆసు పత్రికి పరుగుతీశారు.ఆసుపత్రిలోని నిపుణు లైన వైద్యుల బృందం తక్షణమే స్పందించి,ఎం తో సంక్లిష్టమైన మైక్రో సర్జరీకి శ్రీకారం చుట్టారు. సుమారు ఎనిమిది గంటల పాటు ఏకధాటిగా అత్యంత శ్రమకోర్చి సాగిన ఈ ఆపరేషన్ లో డాక్టర్లు తెగిపోయిన నరాలు,రక్తనాళాలు,ఎ ముకలను అత్యంత నిశితంగా అతికించారు. శాశ్వతంగా వికలాంగుడిగా మిగిలిపోతాడను కున్న శివాన్ష్ కు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదిం చారు.నిజమైన పబ్లిక్ సర్వీస్ అంటే ఏమిటో...

నా శవాన్ని కుక్కలకు వదిలేయండి...సూసైడ్ నోట్ తో వ్యక్తి ఆత్మహత్య...

Image
నా శవాన్ని కుక్కలకు వదిలేయండి సూసైడ్ నోట్ తో వ్యక్తి ఆత్మహత్య VS9TV న్యూస్,ఆళ్లగడ్డ : ఏపీలోని నంద్యాల జిల్లా,ఆళ్లగడ్డ మండలం,ప డకండ్లకు చెందిన చిరంజీవి(25) ఆత్మహత్య ఘటన కంటతడి పెట్టిస్తోంది.పుట్టుకతోనే మెద డు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అత డిని బతికించేందుకు తల్లిదండ్రులు లక్షలు ఖ ర్చు చేశారు.అయితే తన వల్ల కుటుంబానికి భారమేనని భావించిన చిరంజీవి...చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసి రైలు కింద పడి ఆ త్మహత్య చేసుకున్నాడు."ఉరిశిక్ష పడిన వారికి కూడా చివరి కోరిక ఇస్తారు.అలాగే నాకూ ఓ కోరిక ఉంది.నా చివరి కోరిక తీర్చండి.నేను చ నిపోయాక నా శవాన్ని కుక్కలకు ఆహారంగా వేయండి.లేకపోతే ఎక్కడైనా చెత్త కుప్పలోనై నా పడేయండి.నా శవాన్ని అమ్మానాన్నలకు ఇ వ్వొద్దు.నా శవాన్ని చూసి వారు తట్టుకోలేరు. వారి ఆవేదన,బాధ నేను ఊహించలేను.ఇక సె లవు.." అంటూ రాసిన సూసైడ్ నోట్ కంట నీ రు తెప్పించింది.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

Image
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హనుమాన్ జయంతి వేడుకలు టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్ VS9TV కల్లూరు : కల్లూరు అర్బన్,బి ఆర్ రెడ్డి కాలనీలోని శ్రీ సీ తారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఫుడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సం దర్భంగా మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ టి.వాసంతి పేర్కొన్నారు. ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్ టీ వాసంతి ఆధ్వర్యం లో 121మందికి ట్రస్ట్ ద్వారా సభ్యులందరూ కలిపి అన్నదానం ఏర్పాటుచేయడం జరిగింద ని అన్నారు.అదేవిధంగా దాతలు సహకారం తో డైలీ ట్రస్ట్ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమం ది నిరుపేదలు,చిన్నపిల్లలకు సహాయ సహకా రాలు అందించడం జరుగుతుందని ట్రస్ట్ చైర్మ న్ వాసంతి తెలియజేశారు.

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

Image
విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,విజయవాడ : విజయవాడ మహానగరంలో టూ టౌన్ నందు శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రధా న కార్యదర్శి కడారి హేమ సుందర్,లక్ష్మి ఆధ్వర్యంలో మంగ ళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘ నంగా నిర్వహించారు.కార్యక్రమానికి బోండా ఉమా మ హేశ్వరరావు విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు,టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు, నెలి బండ్ల బాలస్వామి మాజీ టిడిపి ఫ్లోర్ లీ డర్,మాజీ కార్పొరేటర్,గోర్తి శ్రీనివాస చక్రవర్తి, విజయవాడ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం అ ధ్యక్షులు,బ్రహ్మశ్రీ జవ్వాది కూర్మచార్యులు వి జయవాడ పట్టణ గౌర వాధ్యక్షులు,ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సం ఘం మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ డాక్టర్ కొ త్తపల్లి సత్యనారాయణ,కడా రు హేమ సుందర్ విజయవాడ పట్టణ ప్రధాన కా ర్యదర్శి,పొన్నాడ దుర్గాప్రసాద్,పట్నాల హ రిబాబు రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర అధ్య క్షులు,చల్లపల్లి మోహన్ రావు,ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరే షన్ చైర్ పర...

జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృ ష్టి...నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులే సు...

Image
జనరద్దీ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో జనరద్దీ ఎక్కువగా ఉండే రైతు బజార్లు,మార్కెట్ యార్డులు,పూలబజా ర్ వంటి ప్రాంతాల్లో పరిశుభ్రతపై శానిటేషన్ ఇ న్‌స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించా రు.సోమవారం ఆయన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూలబజార్,సి.క్యాంపు రైతు బజార్,వి నాయక ఘాట్ వద్ద కే.సీ.కెనాల్‌ను పరి శీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...నగరంలో నిత్యం జనరద్దీ ఉం డే ప్రజా సమూహ ప్రాంతాల్లో పరిశుభ్రత పను లపై తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత అధికారులతో సమన్వయం చేసు కుని గార్బేజ్ పాయింట్లు లేకుండా చూడాల న్నారు.ప్రతి రోజూ ఉదయం సందర్శించి,ప్రత్యే క సిబ్బందిని నియమించి విధులు కేటాయిం చాలని సూచించారు.కొత్తగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ ట్రాలీలలోనే వ్యర్థాలను వేసేలా నిర్వా హకులకు,వ్యాపారస్తులకు చైతన్యం కల్పించా లని తెలిపారు.అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను అకస్మిక తని ఖీ చేశారు.స్వచ్ఛత పనుల విషయంలో ప్రభు త్వ ఆదే ...