అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొనుగో లు చేయాలి...ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్...
అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొనుగోలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్
అనుమతి ఉన్న రైతులందరీ పొగాకు కొను గోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం నంద్యాల జిల్లా, మిడుతూరు మండలం,మాసపేట గ్రామంలో ఉన్న ఐటీసీ కంపెనీ ముందు మూ డు గంటల పాటు రైతులను కలుపుకొని ఆందోళన చేప ట్టారు.ఈ సందర్భంగా జి.రామకృష్ణ మాట్లాడు తూ ఐటిసి కంపెనీ అనుమతితో జిల్లాలో అనే క చోట్ల పొగాకు పంటను రైతులు పండించార ని అన్నారు.విత్తనాలు నాటు మొదలుకొని,పొ గాకు పూర్తి అయ్యేంతవరకు వారి పర్యవేక్షణ లోనే రైతులు పంటలు పండిస్తారని తెలియజే శారు.అలా కాకుండా వారి అనుమతి లేకుం డా వేస్తే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోబోమని ఎప్ప టికప్పుడు చెబుతూ పంపిణీ ప్రచారం చేస్తుం దని కూడా తెలియజేశారు.కానీ కర్నూలు మం డలం,ఉల్చాల,తదితర గ్రామాలలో రైతులు వారి అనుమతితో వారి సూచనలు పాటిస్తూ పొగాకు పంట వేసినప్పటికీ చివరిలో పొగాకు బాగోలేదని నీళ్లతో పండించారని,వివిధ సాకు లు చెప్పి పొగాకు కొనుగోలు చేయకుండా రై తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు.గత సంవత్సరం కంటే ఈ సం వత్సరం జిల్లాలో పొగాకు పంట తగ్గిం దని,దానికి కారణం అనుమతి లేకుండా వేయ డంతో కొనుగోలు చేయక రైతులు దిబ్బలకు వేసిన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కావున జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అను మతి ఉన్న వారే పంట పండించాలని పదేపదే చెప్పారని తెలియజేశారు.కానీ ప్రస్తుతం వారి అనుమతితో వేసిన పంటలకు కొనుగోలు చే యమని చెప్పడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు.వెంటనే అనుమతి ఉన్న రైతులం దరి పొగాకు పంటను కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు.లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం కంపెనీ యాజమాన్యం జోక్యం చేసుకుని అందరి పొగా కు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుం టామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిం చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్య క్షులు రాఘవేంద్ర,నాయకులు కిషన్ రెడ్డి,అం జి,షాజహాన్,బాధిత రైతులు వెంకటేశ్వర్లు,కు మార్,మధుసూదన్,శ్రీనివాసులు,గోవర్ధన్,చ మ్మన్న,షేక్షావలి,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment