న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

లా నేస్తం,మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లించాలి

సుంకర రాజేంద్ర ప్రసాద్‌,ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

Vs9tvన్యూస్,కర్నూలు లీగల్ :

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి చేస్తోందని, అందులో భాగంగానే న్యాయవాదుల చట్టానికి సవరణలు చేస్తూ డ్రాఫ్ట్‌ రూపొందించిందని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.కర్నూలులోని ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్‌ అతిధి గృహంలో ఆదివారం ఐలు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవాదుల చట్టానికి సవరణలు చేయడం వెనక కుట్ర ఉందన్నారు.కేంద్రం తన నిరంకుళ విధానాలతో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసినట్లు న్యాయవ్యవస్థ మీద కూడా తన పెత్తనాన్ని చలాయించాలని చూస్తోందని తెలిపారు.బార్‌ కౌన్సిల్లకు స్వయం ప్రతిపత్తి లేకుండా ఆల్‌ ఇండియా బార్‌ కౌన్సిల్‌ కనుసన్నల్లో పనిచేసేలా చూస్తోందన్నారు. న్యాయవాదులు బయపడుతూ పని చేసే పరిస్థితి వస్తే దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోతుందన్నారు. యువ న్యాయవాదులకు గత ప్రభుత్వం నెలకు రూ.5వేలు లా నేస్తం పేరుతో ప్రకటించిందని,టిడిపి నాయకులు ఎన్నికలకు ముందు ఆ మొత్తాన్ని రూ.10వేలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తవుతున్నా లా నేస్తం ఇవ్వలేదని,దాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.గతంలో టిడిపి ప్రభుత్వం మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.4 లక్షల మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తామని ప్రకటించారని,వెయ్యి మందికి ఆ మొత్తం బకాయి ఉందని,దాన్ని వెంటనే చెల్లించాలని కోరారు.న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.న్యాయవాదుల పోరాటానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు.1న విజయవాడలో న్యాయ విద్యార్థుల రాష్ట్ర కన్వెన్షన్‌ నిర్వహిస్తున్నామని,ప్రతి లా కాలేజీ నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు.ఐలు జాతీయ నాయకులు నర్ర శ్రీనివాస్‌ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అనేక ఒత్తిడులు వస్తున్నాయన్నారు.కొన్ని సందర్భాల్లో న్యాయవాదులపై హత్యాప్రయత్నాలు జరిగాయన్నారు. న్యాయవాదులకు రక్షణ లేకపోతే ప్రజలకు న్యాయం అందే పరిస్థితి ఉండదన్నారు.న్యాయవాదుల రక్షణకు చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. న్యాయవాదుల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇవ్వాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు,అధ్యక్షులు కెంగార కుమార్‌, జిల్లా అధ్యక్షులు సింగరాజు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...