Posts

Showing posts from February, 2025

రామతీర్థంలో పార్వతి దేవి సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గ్రామోత్సవ ఉత్సవాలు

Image
రామతీర్థంలో పార్వతి దేవి సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గ్రామోత్సవ ఉత్సవాలు VS9TV న్యూస్,బనగానపల్లె : నంద్యాల జిల్లా, బనగానపల్లె మండలం, రామతీర్థం పార్వతి దేవి సమేత శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి గ్రామోత్సవ కార్యక్రమం సందర్భంగా నంది కోల సేవ వీరభద్ర సేవా ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,భక్తులు పాల్గొన్నారు.

మార్చి,1న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రాలయం రాక

Image
మార్చి,1న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మంత్రాలయం రాక భద్రతా ఏర్పాట్లు పరిశీలన విక్రాంత్ పాటిల్.కర్నూల్ జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మార్చి,1న విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరుకానున్నారు.ఈ నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.హెలిప్యాడ్ ప్రాంగణం,గెస్ట్ హౌస్,ఆలయ ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడారు.మంత్రి నారా లోకేశ్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను,సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రాలయం తెదేపా నాయకుడు రాఘవేంద్రరెడ్డి, ఎమ్మిగనూరు డిఎస్పి ఉపేంద్ర బాబు,స్పెషల్ బ్రాంచ్ సిఐ తేజ మూర్తి,మంత్రాలయం సీఐ రామాంజులు,తదితరులు పాల్గొన్నారు.

అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలోప్రత్యేక పూజలు,అన్నదానం...

Image
అమావాస్య పురస్కరించుకొని శ్రీశ్రీశ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు,అన్నదానం... దాసరి మోహన్,ఆలయ కమిటీ చైర్మన్  VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు అర్బన్ పరిధి,32వ వార్డ్,ముజఫర్ నగర్,శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పురస్కరించుకొని శుక్రవారం ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం చేపట్టినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దాసరి మోహన్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా దాసరి మోహన్ మాట్లాడుతూ కమిటీ బృందం వడ్డె ఆంజనేయులు,వి.విజయ్ కుమార్,వి.చంద్ర, వి.నరసింహులు, వి.కృష్ణ,టి.నాగిరెడ్డిలతోకలిసి ఆలయంలో దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య,హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలలో ప్రత్యేక పూజలు,అన్నదానం కార్యక్రమం జరుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈ అమావాస్య నందు ఆలయం పూజారి విరుపాక్షయ్య ప్రత్యేక పూజల అనంతరం రామదారి గోత్రం రాజశేఖర్ (సైకిల్ షాప్ ), రమేష్,కుటుంబ సభ్యులు రాజ్యలక్ష్మి,రవీంద్ర,రాజేంద్ర,సుజాత,పూజిత,రాఘవేంద్రల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటుచేయడం జరిగిందని అన్నారు.అదేవిదంగా దాతలు రాజశేఖర్, రమేష్ బాబు,మాజీ అధ్యక్షులు వడ్డె ఆంజనేయులు,వడ్డె చంద్రలను ఆలయ కమిటీ బృందం శాలువా,పూలమాల...

కోటప్పకొండ తిరుణాలకు రికార్డ్ స్థాయిలో ఆదాయం.

Image
కోటప్పకొండ తిరుణాలకు రికార్డ్ స్థాయిలో ఆదాయం. గత ఏడాది కంటే రూ14,19,945 అధిక ఆదాయం. ఈఓ డి.చంద్రశేఖరరావు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : కోటప్పకొండ అనగానే...అందరికీ గుర్తొచ్చేది మహా శివరాత్రి తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో...అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలకు ఏపీలోని భక్తులతో పాటు... పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా విచ్చేస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ మొత్తం శివనామస్మరణతో మారుమ్రోగిపోయింది.లక్షలాది మంది భక్తుల రాకతో త్రికూట పర్వతం సందడిగా మారింది.తమ ఇష్టదైవానికి శివుడుకి మొక్కులు చెల్లించుకుని భక్తులు తన్మయత్వం పొందారు.ఫిబ్రవరి, 26న మహా శివరాత్రి సందర్భంగా.. కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేసిన భక్తులు ఆ త్రికోటేశ్వరుడిని దర్శించుకుని...వివిధ రూపాల్లో స్వామివారికి రూ.1.77.68.172(కోటి, డెబ్భై ఏడు లక్షలు,అరబై ఎనిమిది వేలు, నూట డెబ్భై రెండు) ఆదాయాన్ని సమర్పించారు.వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రూ.65,01,070 ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.38,17,395లు అన్నదానం ఇతర స్కీముల ద్వారా 1,01,789 హుండీల కానుకల ద్వారా రూ.73,47,918లు ఆదాయం వచ్చినట్లు...

శునకాల బెడద నియంత్రణకు చర్యలు

Image
శునకాల బెడద నియంత్రణకు చర్యలు శస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలన   చికిత్సలకు ఏడబ్లూబిఐ అనుమతులు మంజూరు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు ప్రారంభం ఎస్.రవీంద్రబాబు,కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలో శునకాల బెడద నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు అన్నారు. గురువారం ఆయన గార్గేయపురం డంప్ యార్డులోని శునకాల సంతాన నిరోధక శస్త్ర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో కుక్కల బెడద నియంత్రణకు సంబంధించి,వాటికి సంతాన నిరోధక శస్త్ర చికిత్సలను తిరిగి పునః ప్రారంభించినట్లు వెల్లడించారు.ఏజెన్సీకి ప్రాజెక్ట్ రికగ్నేషన్ సర్టిఫికెట్ లేనందున గత ఏడాది ఆగస్టు,8న శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయని,తిరిగి ప్రారంభించేందుకు అనుమతుల కోసం ఇటీవల భారత జంతు సంక్షేమ మండలికి దరఖాస్తు చేసుకున్నామన్నారు.మండలి సభ్యురాలు గత నెల 8న శస్త్ర చికిత్స కేంద్రాన్ని పరిశీలించారని,ఇటీవల అనుమతులు మంజూరు చేశారన్నారు. దీంతో శునకాలకు శస్త్ర చికిత్సలను పునః ప్రారంభించడం జరిగిందని, ఒక్కొక్క శునక శస్త్ర చికిత్సక రూ.1500 ఏజెన్సీకి నగరపాల...

శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న గౌరు దంపతులు

Image
శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న గౌరు దంపతులు VS9TV న్యూస్,కల్లూరు : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం కర్నూలు జగన్నాథ గట్టు,శ్రీ రూపాల సంగమేశ్వర స్వామిని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి,ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు,నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి గౌరు వెంకట రెడ్డి,యువ నాయకుడు గౌరు జనార్ధన్ రెడ్డిలు దర్శనం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు ప్రత్యేక పూజలో పాల్గొన్న అనంతరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

రక్తదానం చేద్దాం...ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం...

Image
రక్తదానం చేద్దాం...ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం... యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : ప్రతిఒక్కరు రక్తదానం పట్ల అవగాహనా పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ, కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామిలు అన్నారు.బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వాయిస్ ఆఫ్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ జె. నాగరాజు సతీమణి జె.లక్ష్మిదేవికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు, మన తెలుగు దినపత్రిక,విఎస్ 9 టీవీ కర్నూలు ప్రతినిధి వి.విజయ్ కుమార్ రక్తదానం చేశారు.ఈ సందర్బంగా నీలం సత్యనారాయణ, మునిస్వామిలు మాట్లాడారు.జె.లక్ష్మీదేవి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుంది.ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న విజయ్ కుమార్ ఆమెకు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరికి రక్తం అవసరం ఏర్పడుతుందని అన్నారు.మానవత్వంతో వారికి రక్తం ఇవ్వడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలిగిన వారమవుతాం అని చెప్పారు.రక్తదానం పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగ...

అసెంబ్లీ పాసుల విషయంలో వివక్ష దారుణం

Image
అసెంబ్లీ పాసుల విషయంలో వివక్ష దారుణం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కవరేజ్ నిమిత్తం మీడియా సంస్థలకు ఇచ్చే పాసులు విషయంలో వివక్ష దారుణం అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) పేర్కొంది.చట్టసభల్లో జరిగే కార్యకలాపాలను మీడియా సంస్థల ద్వారా ప్రజలకు చేరవేయాల్సిన విధిని జర్నలిస్టులు నిర్వహించాల్సి ఉందన్నారు.ఈ విషయంలో అసెంబ్లీ అధికారులు అనుసరిస్తున్న వైఖరిని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ,చిన్న రామాంజనేయులు,విద్యాసాగర్,చంద్రమోహన్,విజయ్ కుమార్,రాజశేఖర్, జి.విజయ్ కుమార్,యూసుఫ్ ఖాన్,మల్లికార్జున,అసిఫ్,పరమేష్, నాగేంద్రుడు,గిలిగిత్త విజయ్ కుమార్,వరప్రసాద్,గంగాధర్, వై.వెంకటేశ్వర్ రెడ్డిలు ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.అసెంబ్లీ పాసుల విషయంలో కొన్ని సంస్థలకు అవకాశం కల్పించి,మరికొన్ని సంస్థలను నిరాకరించినట్లు తెలిసిందని,ఈ విషయంపై సభాపతి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి,మీడియా సంస్థలన్నింటికీ తగిన రీతిలో పాస్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఒకరిని అక్క...

శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠినచర్యలు తప్పవు

Image
శ్రీవారి భక్తులను మోసగిస్తే కఠినచర్యలు తప్పవు టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరిక VS9TV న్యూస్,తిరుపతి : శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు హెచ్చరించారు.  టీటీడీ పీఆర్ ఓ అని చెప్పుకుంటూ ప్రసాద్ అనే పేరుతో చెలామణి అవుతూ ఛైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎన్ఆర్ఐ భక్తుడు గోపాల్ రాజు చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చైర్మన్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులకు ఆదేశించారు.విజిలెన్స్ వింగ్ సిబ్బంది బాధితుడి నుండి వివరాలు సేకరించి చేపట్టిన ప్రాథమిక విచారణలో నిందితుడు హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్ గా గుర్తించారు.విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూ టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ నెం: 18/2025తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్ఆర్ఐ భక్తుల నుండి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వార...

ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి.

Image
ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆస్పత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయి. డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ, అత్యవసర విభాగాలలో మందుల కొరతపై మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు. ఆరా తీశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలోని పలు రకాల మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు.క్యాజువాలిటి,ఎమర్జెన్సీ విభాగాలలో మందుల కొరత లేదు. ఎమర్జెన్సీ మెడిసిన్ కొరకు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నామన్నారు పేషంట్ కి అవసరమైన మందులు ఇవ్వడానికి ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని అన్నారు.కొన్ని మందులు లేని వాటిపై లోకల్ పర్చేజ్ లో మందులన్నీ కొనుగోలు చేశామన్నారు. పీఎంబిజెకె ద్వారా,లోకల్ ఏజెన్సీ నుంచి అన్ని అత్యవసర మందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు.మందుల కొరత ఎలాంటి సమస్య లేదు.అన్ని రకాలుగా మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు రోగులు క్షతగాత్రులు అత్యవసర విభాగానికి వస్తే వారిని ఎక్స్రేకు,స్కానింగ్ కు తీసుకెళ్లేందుకు స్ట్రెచర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.న్యూ డయాగ్న...

ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ ఐపీ సేవల ప్రారంభం

Image
ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ ఐపీ సేవల ప్రారంభం డా.కె.వెంకటేశ్వర్లు,ఆసుపత్రి సూపరింటెండెంట్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల స్టేట్ క్యాన్సర్ ఇన్స్ టిట్యూట్ లో మంగళవారం ఐపి సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె.వెంకటేశ్వర్లు అన్నారు.ఈ సందర్బంగా వారు వివరాలు వెల్లడించారు.స్టేట్ కేన్సర్ ఇన్స్ టిట్యూట్ కు అత్యంత ఖరీదైన వైద్య పరికరాలు వచ్చాయి.మరికొన్ని త్వరలో రానున్నాయి.ఇప్పటికే సుమారు రూ.36 కోట్ల విలువైన లీనియర్ యాక్సిలరేటరీ, రూ.7 కోట్ల విలువైన సీటీ సిములేటర్ పరికరాలు చేరుకున్నాయి.ఇంత ఖరీదైన, అత్యాధునిక పరికరాలు రాష్ట్రంలోని ఏ ఇతర ప్రభుత్వాసుపత్రుల్లోనూ లేవని అన్నారు.అత్యవసర క్యాన్సర్ వైద్య విభాగపు సేవలు,ప్రస్తుతానికి గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నుంచి జరుగుతాయని చెప్పారు.లీనియర్ అక్లరేటర్ పరికరము రోగుల వైద్యసేవల కోసం అందుబాటులోకి రావడానికి ఏ ఈ ఆర్ బి అనుమతులు లభించవలసి ఉంది త్వరలో రావచ్చు అని తెలిపారు. స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రస్తుతానికి అందుబాటులో లేవని,సేవలు,పరీక్షలు గవర్నమెంట...

భారీ ఎటిఎం చోరికి ప్రయత్నించిన దుండగలు

Image
భారీ ఎటిఎం చోరికి ప్రయత్నించిన దుండగలు ఉలిందకొండ పోలీసులు,గ్రామ యువకుల అప్రమత్తతతో ఎటిఎం చోరి విఫలయత్నం.  ఎటిఎం చోరి ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులను,యువకులను అభినందనలు విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ పోలీసులకు సహాకరించిన యువకులకు రివార్డులు అందజేత జె.బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,చిన్న టేకూరు గ్రామంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగలు టోయింగ్ వాహనంతో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటిఎం మిషన్ చోరికి ప్రయత్నించారు.ఎటిఎం షట్టర్ ను లాగి, లోపలున్న ఎటిఎం మిషన్ ను తాళ్ళతో లాగుకొని పోయే ప్రయత్నం జరుగుతుండగా,అక్కడే ఉన్న చిన్న టేకూరు గ్రామ యువకులు దొంగల చర్యలు గమనించి ఉలిందకొండ ఎస్సై ధనుంజయ్ కు ఫోన్ లో సమాచారం అందించారు.ఉలిందకొండ ఎస్సై ధనుంజయ్,ఓర్వకల్లు ఎస్సై సునీల్ , పోలీసులు,గ్రామ యువకులు దొంగల వెంటబడ్డారు.దీనితో దుండగలు ఎటిఎం మిషన్ ను తరలించుకుని పోయే ప్రయత్నం విరమించి టోయింగ్ వాహనం హైవే మీద వదిలేసి పారిపోయారు.ఈ విషయం తెలుసుకున్న కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్,కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు రాత్రి...

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించి మందులు కొరత నివారించాలి

Image
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించి మందులు కొరత నివారించాలి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సూపరిండెంట్,అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలి ఏఐవైఎఫ్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : కర్నూలు నగర నడి బొడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మౌలిక వసతుల కొరత,మందుల కొరత వేధిస్తున్నాయని,వీటిని వెంటనే పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్ కి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు,నగర కార్యదర్శి బీసన్న,* నగర నాయకులు అఖిల్,రంగన్నలు మాట్లాడుతూ ఎంతోమంది పేద ప్రజలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వైద్యం కోసం వస్తే వైద్యశాలలో మౌలిక వసతులు కొరత మందుల కొరతతో పేదవారికి మెరుగైన వైద్య సౌకర్యాలు అందక రోగులు వేళ్ళకు వేలు ఖర్చుపెట్టి బయట మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సమస్యను పరిష్కరించాలని వారు కలెక్టర్ కి విన్నవించారు.హాస్పిటల్లో మౌలిక వసతులపై ముఖ్యంగా క్షతగాత్రులు అత్యవసర విభాగానికి వస్తే వారిని ఎక్స్ రేకుగాని,స్కానింగ్ కానీ తీసుకెళ్లాలంటే స్ట్రక్చర్ల క...

జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థికసహాయం అందచేత

Image
జిఎన్ఆర్ హాస్పిటల్ లో పనిచేస్తున్న దేవమ్మకు ఆర్థికసహాయం అందచేత జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య  VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : జిఎన్ఆర్ హాస్పిటల్ లో గత మూడు సంవత్సరాలుగా ఆయాగా పనిచేస్తున్న దేవమ్మ భర్త అనారోగ్యంతో మృతి చెందాడు ఆమెకు ఇద్దరు కుమార్తెలు విషయం తెలుసుకున్న డాక్టర్ నాగేశ్వరయ్య ఆమెకు ఆమెకు ఆర్థిక సహాయంగా రూ.50వేలు జిఎన్ఆర్ హాస్పిటల్ లో సోమవారం సహాయం అందించారు.భవిష్యత్తులో ఆమెకి వారి కుమార్తెలకు చదువులకు గాను హాస్పిటల్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అలాగే ప్రతి హాస్పిటల్ లో పనిచేస్తున్న ఆయాలు గానీ నర్సులు గాని డ్యూటీ నర్సులు బీదవారు ఎంతోమంది ఉంటారు.హాస్పిటల్ కి నమ్మే వాళ్లు పనిచేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు అలాంటి వారికి హాస్పిటల్ అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య సతీమణి లక్ష్మీదేవి,డాక్టర్ మహేష్ నాయుడు,డ్యూటీ డాక్టర్ నాగేంద్ర,,మేనేజర్ శివ,హాస్పిటల్ ఇన్చార్జి కుమార్,జిఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు, డాక్టర్లు పాల్గొన్నారు.

పత్తిపంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి.

Image
పత్తిపంట కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించాలి. పత్తిపంటకు క్వింటాలుకు రూ.10వేలు పదివేలు ఇవ్వాలి  ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ డిమాండ్ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : పత్తిపంట కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభించాలని క్వింటాలుకు పదివేల రూపాయలు తక్కువ కాకుండా రైతులకు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ,ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఏ.కృష్ణ గూడూరు మండలం అధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.సోమవారం ప్రజా దర్బారులో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ను కలిసి రైతు సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జి. రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకుపైగా పత్తిపంట సాగు అయిందని,దిగుబడి కూడా ఈ సంవత్సరం కొంత మెరుగైందని ఎనిమిది క్వింటాళ్ల నుండి 12,13,14 క్వింటాళ్లు ఎకరాకు వచ్చాయని తెలిపారు.దిగుబడి వచ్చినప్పటికీ ధర లేకపోవడం వలన రైతులు పెట్టిన పెట్టుబడిదాకా అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఖరీఫ్లో పండిన పంట నవంబర్ మాసం వరకు పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు....

బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడు..

Image
బోరుబావిలో పడిన ఐదేళ్ల బాలుడు.. పైపుతో ఆక్సిజన్ సరఫరా VS9TV న్యూస్,ఢిల్లీ : రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లలో దారుణం చోటుచేసుకుంది.వ్యవసాయం పొలంలో ఆడుకుంటూ ఐదేళ్ల బాలుడు ప్రహ్లాద్ ప్రమాదవశాత్తు 32అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఘటనా స్థలంలో కుటుంబ సభ్యులు ఘోరంగా విలపిస్తున్నారు.సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్,ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.అలాగే బాలుడికి వైద్యులు పైప్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు.

అక్రిడిటేషన్ లను త్వరితగతిన పునరుద్దఃరించాలి

Image
అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలి కలెక్టర్ కు వినతిపత్రం అందజేత యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నగర కమిటీ VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : జర్నలిస్టుల అక్రిడిటేషన్ లను త్వరతగతిన పునరుద్ధరించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యూజేఎఫ్) నాయకులు అన్నారు.సోమవారం జిల్లా,కలెక్టర్ కార్యాలయం,సునయన అడిటోరియం,ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో నగర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నగర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పి.నాగేంద్రుడు,జి.మునిస్వామి మాట్లాడుతూ...జర్నలిస్టులకు ప్రభుత్వం మంజూరు చేసిన అక్రిడిటేషన్ కాలపరిమితి ఈనెల 28వ తేదీతో గడువు ముగియనుందన్నారు.కావున త్వరితగతిన నూతన అక్రిడిటేషన్లను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.లేనిపక్షంలో జర్నలిస్టులు తమ బస్సు చార్జీల రాయితీలను నష్టపోవాల్సి వస్తుంది.వెంటనే అక్రిడిటేషన్ లో పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించి మార్చి,1వతేదీ లోపలనే జర్నలిస్టులు అక్రిడిటేషన్లను పునరుద్ధరించి ఆర్టీసీ చార్జీలో రాయితీకి ఆటంకం రాకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.జిల్లా కలెక్టర్ స్పందిస్తూ రాష్ట్ర సమాచార ...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

Image
న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి లా నేస్తం,మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లించాలి సుంకర రాజేంద్ర ప్రసాద్‌,ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ Vs9tvన్యూస్,కర్నూలు లీగల్ : న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి చేస్తోందని, అందులో భాగంగానే న్యాయవాదుల చట్టానికి సవరణలు చేస్తూ డ్రాఫ్ట్‌ రూపొందించిందని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.కర్నూలులోని ఎపిఎస్‌ఇబి ఇంజనీర్స్‌ అతిధి గృహంలో ఆదివారం ఐలు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ న్యాయవాదుల చట్టానికి సవరణలు చేయడం వెనక కుట్ర ఉందన్నారు.కేంద్రం తన నిరంకుళ విధానాలతో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసినట్లు న్యాయవ్యవస్థ మీద కూడా తన పెత్తనాన్ని చలాయించాలని చూస్తోందని తెలిపారు.బార్‌ కౌన్సిల్లకు స్వయం ప్రతిపత్తి లేకుండా ఆల్‌ ఇండియా బార్‌ కౌన్సిల్‌ కనుసన్నల్లో పనిచేసేలా చూస్తోందన్నారు. న్యాయవాదులు బయపడుతూ పని చేసే పరిస్థితి వస్తే దేశంలో న్యాయ వ్యవస్థ కూలిపోతుందన్నారు. యువ న్యాయవాదులకు గత ప్రభుత్వం నెలకు ...