రక్తదానం చేద్దాం...ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం...

రక్తదానం చేద్దాం...ప్రజల ప్రాణాలు కాపాడుకుందాం...

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)

VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ :

ప్రతిఒక్కరు రక్తదానం పట్ల అవగాహనా పెంచుకోవాలని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చు అని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) రాష్ట్ర నాయకులు నీలం సత్యనారాయణ, కర్నూలు నగర కార్యదర్శి మునిస్వామిలు అన్నారు.బుధవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వాయిస్ ఆఫ్ ఇండియా స్టాఫ్ రిపోర్టర్ జె. నాగరాజు సతీమణి జె.లక్ష్మిదేవికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం నాయకులు, మన తెలుగు దినపత్రిక,విఎస్ 9 టీవీ కర్నూలు ప్రతినిధి వి.విజయ్ కుమార్ రక్తదానం చేశారు.ఈ సందర్బంగా నీలం సత్యనారాయణ, మునిస్వామిలు మాట్లాడారు.జె.లక్ష్మీదేవి అనారోగ్యంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతుంది.ఈ నేపథ్యంలో సమాచారం తెలుసుకున్న విజయ్ కుమార్ ఆమెకు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. అత్యవసర సమయాల్లో ప్రతి ఒక్కరికి రక్తం అవసరం ఏర్పడుతుందని అన్నారు.మానవత్వంతో వారికి రక్తం ఇవ్వడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోగలిగిన వారమవుతాం అని చెప్పారు.రక్తదానం పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం రక్తదాత విజయ్ కుమార్ ను అభినందించారు.విజయ్ కుమార్ మాట్లాడుతూ తాను ఇప్పటికే సుమారు 10సార్లు రక్తదానం చేశానని తెలిపారు.రక్తదానం చేసిన సందర్బంలో బాధితుల కళ్ళలో సంతోషం నాకు ఆశీర్వాదాలుగా భావిస్తానని చెప్పారు. రక్తం ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం కలగదని,కొద్దిరోజులోనే మన శరీరంలోకి కొత్త రక్తం ఏర్పడుతుందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ శ్రీనివాసులు,జె.నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....