ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్నకూతురిని హత్య చేసిన తండ్రి

ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం

పోస్టుమార్టంతో వెలుగులోకి వచ్చిన నిజం
నేటిపత్రిక ప్రజా చరిత్ర న్యూస్,మాచర్ల,జూన్, 21:

ప్రేమించిన యువకుడిని వివాహం చేసు కుం దనే ఆగ్రహంతో కన్న తండ్రే తన కు మార్తెను హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా మాచ ర్లలో కలకలం రేపింది.హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ,పోస్టుమా ర్టం నివేదికలో అసలు విషయం బయటపడ టంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.వివరాలు ఇలా ఉ న్నాయి...మాచర్ల పట్టణంలోని 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్రశ్రీనుకు ఇద్ద రు సంతానం.కుమార్తె చౌడేశ్వరి ఇంటర్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది.ఈ క్రమంలో తమ ఇంటికి సమీపంలో నివసించే జమ్మలమడక నాగరాజుతో ఆమె ప్రేమలో పడింది.ఇద్దరూ ఒ కే సామాజిక వర్గానికి చెందినప్పటికీ,తమ ప్రే మ వివాహాన్ని పెద్దలు అంగీకరించరని భావిం చిన జంట ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది.వివాహం అనంతరం కొంతకాలం చెన్నైలో ఉన్న వీరు,తర్వాత నరసరావు పేట లోని ఓ స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందారు. కుమార్తె కనిపించకపోవడంతో చంద్రశ్రీను మా చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వారం రో జులైనా ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నానికి ప్రయత్నించాడు.దీంతో గురజాల డీఎ స్పీ జోక్యం చేసుకుని యువతి ఆచూకీ కను గొంటామని హామీ ఇవ్వడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఘటన జరిగిన మూ డు రోజుల తర్వాత పోలీసులు చౌడేశ్వరి,నాగ రాజుల ఆచూకీ గుర్తించి,వారిని మాచర్ల పోలీ స్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చర్చలు జరిపారు.ఇద్దరూ మేజర్లు కావడంతో తాము చట్టపరంగా ఏమీ చేయలేమని పోలీసులు స్పష్టం చేశారు.అయి తే,పెద్దల సూచన మేరకు ఐదు రోజుల పాటు ఎవరింటికి వారు వెళ్లి,ఆ తర్వాత తుది నిర్ణ యం తీసుకోవాలని నిర్ణయించా రు.ఈ నేప థ్యంలో చౌడేశ్వరిని తన ఇంటికి తీసుకెళ్లిన చంద్ర శ్రీను,మరుసటి రోజు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని బంధువులకు తెలి పాడు.దీంతో ప్రేమ వివాహం కారణంగా మన స్తాపానికి గురై యువతి ఆత్మహత్య చేసుకుం దని మొదట అందరూ భావించారు.అయితే, అను మానాస్పద మృతిగా కేసు నమోదు చేసి న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా షా కింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.చౌడేశ్వ రి గొంతు నులిమి హత్య చేసిన అనంతరం, ఆమెను ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది.దీంతో పో లీసులు తండ్రి చంద్రశ్రీ నును అదుపులోకి తీ సుకుని విచారిస్తున్నారు.కూతురు తనకు ఇ ష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకుందనే కార ణంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథ మిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలి పారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...