400 మంది పోలీసులతో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు పటిష్ట భద్రత...బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు దిశా,నిర్దేశం...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...
400 మంది పోలీసులతో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు పటిష్ట భద్రత బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు దిశా,నిర్దేశం విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కేటాయించిన విధులలో పోలీసులు అప్రమ త్తంగా ఉండాలని,అలసత్వం ప్రదర్శించరా దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శనివారం కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష సంధర్భంగా బందోబస్తు విధులకు వి చ్చేసిన పోలీసు లకు జిల్లా పోలీసు కార్యాల యంలోని పరేడ్ మైదానంలో శనివారం జి ల్లా ఎస్పీ దిశా,నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడానికి పటిష్ట చర్యలు తీసుకో వాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో ఉందని,పరీక్షలు ముగిశాక ఆ పత్రాలను పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలన్నారు.అభ్యర్దులకు పరీ క్షల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టిస్ వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టూ జిరాక్స్,కంప్యూటర్ కేంద్రాలను మూసివేసేవిధంగా చూడాలన్నారు.పరీక్ష జరిగే సమయం...