నేడు జరగబోయే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు...విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ...

నేడు జరగబోయే కానిస్టేబుల్ మెయిన్స్ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
సీసీ కెమరాలు,డ్రోన్ కెమెరాలతో  పర్యవేక్షణ
పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందే అభ్యర్దులు 
పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డు లేదా 
ఇతర గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలి
కర్నూలు కేంద్రంలో మొత్తం 16పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
పరీక్షకు హాజరు కానున్న మొత్తం 7,588 మంది అభ్యర్ధులు
విక్రాంత్ పాటిల్,కర్నూలు జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా జూన్,1వ తేది ఆదివారం పోలీసు కానిస్టేబుల్ (సివిల్,ఎ పిఎస్పీ) అభ్యర్ధులకు మెయిన్స్ రాత పరీక్షలను కర్నూలు పట్టణంలోని  16పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తు న్నారు.ఈ సంధర్బంగా కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటో రియంలో శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు.ఈ పరీక్ష ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నాం 1-00గంట వరకు ఉంటుందన్నారు.పరీక్ష రాసే అభ్యర్దులకు జిల్లా ఎస్పీ సూచనలు తెలిపారు.పరీక్ష రాసే అభ్యర్దులను  ఉదయం 9-00 గంటల నుం డే పరీక్ష హాలులోకి అనుమతిస్తారన్నారు.ఉదయం 10-00 గంటల తర్వాత ఎట్టి పరిస్ధి తులలోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరన్నారు.హాల్ టికెట్ తో పాటు బ్లూ లేదా బ్లా క్ బాల్ పెన్నులను తెచ్చుకోవాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్దుల హాజరును బయో మెట్రిక్ ద్వారా నమోదు చేస్తారన్నారు.సెల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ వాచ్ లు,ఇతర వస్తువులు ప రీక్ష హాల్లోకి అనుమతించబోమన్నారు.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమరాలు,డ్రోన్ కెమె రాలతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.అన్నీ పరీక్ష కేంద్రాల చుట్టూ 200మీటర్ల పరిధి లో ని జిరాక్స్,కంప్యూటరు కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపా రు.కర్నూలులో మొత్తం 16పరీక్షా కేంద్రాలలో 7,588మంది అభ్యర్ధులు మెయిన్స్ రాత పరీక్ష వ్రాస్తున్నారని ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఏలాంటి సంఘటనలు జరగకుండా పటి ష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసుకునే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీ సుకోవాలని ఎస్పి తెలిపారు.

16 పరీక్ష కేంద్రాలు : 

1) జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ (ఎ), సెంటర్-ఎ,నంద్యాల రోడ్, కర్నూలు.

2) జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ (ఎ), సెంటర్-బి,నంద్యాల రోడ్,కర్నూలు.

3) జి.పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ &టెక్నాలజీ,నందికొట్కూర్ రోడ్,వెంకాయ ప ల్లి (గ్రామం),కర్నూలు.

4) రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, ఈఈ (గ్రామం),వెంకాయపల్లి దగ్గర, నందికొట్కూర్ రోడ్,కర్నూలు.

5) సెయింట్. జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్, సెంటర్-ఎ,కర్నూలు.

6) సెయింట్. జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్, సెంటర్-బి,కర్నూలు.

7)  మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్, సెంటర్-ఎ,ఎ-క్యాంప్, కలెక్టరేట్ వెనుక, కర్నూలు.

8) మాంటిస్సోరి సీనియర్ సెకండరీ స్కూల్,సెంటర్-బి,ఎ-క్యాంప్,కలెక్టరేట్ వెనుక, కర్నూలు.

9) డా.కె.వి.సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,దూపాడు (గ్రామం),ఎన్.హెచ్-44, కర్నూలు.

10)  మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్, సెంటర్-ఎ,ఎన్. హెచ్-44,గుత్తి రో డ్,కర్నూలు.

11)  మాంటిస్సోరి ఇండస్ రెసిడెన్షియల్ స్కూల్,సెంటర్-బి,కర్నూలు.

12)  ఎథీనా స్కూల్,హోటల్ కోనీ రెంట్ డైమ్ దేవరపాడు కర్నూలు. 

13)  డా. కె.వి.సుబ్బారెడ్డి స్కూల్,దూపాడు (గ్రామం),కర్నూలు.

14)  డా.కె.వి.సుబ్బారెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ,దూపాడు (గ్రామం), కర్నూలు.

15)  బృందావన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్,పెద్దటేకూర్,కర్నూలు.

16) శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల,గాయత్రి ఎస్టేట్,కర్నూలు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...