ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...
ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్నరోడ్డు స్థలాన్ని కాపాడాలికల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకిఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అందచేత
కల్లూరు అర్బన్,పందిపాడు,ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలాన్ని కాపా డాలని కాలనీ వాసులు మంగళవారం కల్లూరు తహసీల్దార్ కె.ఆంజనేయులు,నాల్గవ పట్ట ణ సిఐ విక్రమ్ సింహను కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్బంగా కాలనీ వాసు లు రాము,నాగేంద్ర,అన్వర్ భాష,శేఖర్ రెడ్డి,మౌలాలి,శ్రీదేవి,ప్రసాదు,నాగరాజులు మాట్లా డుతూ 2010వ సంవత్సరంలో ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీలో సుమారు 2500 ప్లాట్ల ను పేదలకు కేటాయించింది.కాలనీ లేఅవుట్ ప్రకారం ప్రజల సౌకర్యార్థం నాలుగు పార్కు లు,ఇతర ఖాళీ స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు.కాలనీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో,మౌలిక సదుపాయాలు పెరుగుతుండటంతో భూముల విలువ పెరిగింది.దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది స్వార్థపరులు,అక్రమార్కులు కాలనీలోని పార్కు స్థలా లు,రోడ్డుస్థలాలు,ఖాళీ స్థలాలపై కబ్జాకు కుట్రలు చేస్తున్నట్లు చెప్పారు.నిబంధనలకు విరు ద్ధంగా పార్కు స్థలాల్లో ప్లాట్లు వేసి అమాయకులకు విక్రయిస్తున్నారు.ఇది పూర్తిగా చట్టవి రుద్ధం.ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన చెందారు.ఇలాంటి ఘటనల పట్ల స్థానిక నివాసితులు ప్రశ్నిస్తే,సదరు వ్యక్తులు ఎదురు తిరుగుతూ దౌర్జన్యానికి దిగుతున్నారు.ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి" అంటూ బెదిరింపులకు పాల్పడుతు న్నారన్నారు.కావున కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐలు చొరవ చూపించి,కబ్జా లను అరికట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.
Comments
Post a Comment