తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...
తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదుఆవేదన వ్యక్తం చేసిన మహిళలు 20రోజులుగా త్రాగునీటికి ఇబ్బందులు మున్సిపల్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు?పట్టణ పౌర సంక్షేమ సంఘం
కల్లూరు రాముడి గుడి సమీప కాలనీలో తగినన్ని త్రాగునీటిని సరఫరా చేయాలని నగర పాలక సమస్థ సిబ్బందిని వేడుకున్నా...మా మొర ఆలకించడం లేదంటూ మహిళలు ఆవే దన వ్యక్తం చేశారు.శనివారం పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆ కాలనీ లో పర్యటించింది.స్థానిక మహిళలు వృద్ధులు అనారోగ్యంతో బాధపడుతున్న వారు తాగు నీటి సమస్యతో పడుతున్న ఇబ్బందులను విని ప్రతినిధి బృందం సభ్యులు ఆశ్చర్యానికి గుర య్యారు.ఈ సందర్భంగా కాలనీ మహిళా ప్రతినిధులు లక్ష్మమ్మ,ప్రమీలమ్మ,పట్టణ పౌర సం క్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, కాలనీ అసోసియేషన్ నాయకులు డి.కు మార్ మాట్లాడుతూ పిర్యాదు చేసిన స్పందించరు,ఫోన్ చేసిన అధికారులు ఎత్తడం లేద నీ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ప్రాంతంలో ఎప్పుడూ రాని త్రాగునీటి సమస్య ఇప్పుడే ఎం దుకు వచ్చిందని ప్రశ్నించారు.ఇంటి పన్నులు,కొళాయి పన్నులు సక్రమంగా చెల్లిస్తున్నా.. .త్రాగునీటిని కూడా పేదవాళ్లకు సరఫరా చేయలేరా అని ప్రశ్నించారు.ఈ కాలనీలో త క్కువ స్థలంలో ఎక్కువ పేద ప్రజలు జీవిస్తున్న విషయాన్ని నగరపాలక సంస్థ ఇంజనీర్లు గుర్తించాలన్నారు.కొందరికి ఎక్కువ నీళ్లు వదులుతూ,పేద వాళ్లకు తక్కువ నీళ్లు వదులు తూ వివక్షత చూపిస్తున్నారని విమర్శించారు.20 రోజులుగా త్రాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మున్సిపల్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ప్రశ్నించారు.వెంటనే కమిషనర్ జోక్యం చేసుకొని ప్రతిరోజు త్రాగునీటిని సర ఫరా చేయాలని కోరారు.త్రాగునీటి సమస్య వచ్చినప్పుడు ఆదుకోవడానికి బోరింగులు వే యాలని కోరారు.త్రాగునీటి సమస్య పరిష్కరించ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుటబైరా ఇస్తామన్నారు.ఈ పర్యటనలో మహిళలు కళావ తమ్మ,రమణమ్మ,కృష్ణవేణి, కె.మధుసూదన్,వై.రామాంజనేయులు పాల్గొన్నారు.
Comments
Post a Comment