మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...
మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలుట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్
మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనం ఇచ్చిన వారికి, తల్లిదండ్రులపై చర్య లుంటాయని కర్నూల్ ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ తెలిపారు.కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు,కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూల్ నగరంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు తీసుకునేందుకు రాజ్ విహార్ సెంట ర్ లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్బంగా సిఐ మన్సురుద్దీన్ మాట్లాడుతూ లైసె న్స్ లేకుండా వాహనం నడుపుతున్న మైనర్ల ను పట్టుకున్నట్టు తెలిపారు.15మంది మైనర్ వాహనాలను కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి హెచ్చరించిన ట్టు చెప్పారు.మైనర్లు పట్టుబడితే తక్షణమే కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రుల ను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని,మార్పు రాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.అనంతరం లైసెన్స్ లేకుండా బండి నడపబోమని మైనర్లచేత ప్రతిజ్ఞ చే యించారు.వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ట్రాఫిక్ నిబంధనల వీడియో షోలు మరియు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు మైనర్లకు చూపిం చారు.మొదటిసారిగా కౌన్సిలింగ్ చేసి,రెండవసారి పట్టు బడితే జరిమానాలు విధించ నున్నామని ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ తెలిపారు.
Comments
Post a Comment