Posts

Showing posts from February, 2026

బాణసంచా తయారీ కేంద్రం భారీ పేలుడు...18 మంది మృతి...

Image
బాణసంచా తయారీ కేంద్రం భారీ పేలుడు 18 మంది మృతి VS9TV న్యూస్,కాకినాడ : కాకినాడ జిల్లా,సామర్లకోట మండలంలోని బాణ సంచా తయారీ పరిశ్రమలో భారీ పేలు డు సంభవించింది.మండ లంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూ ర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ కేంద్రంలో శనివారం భారీ ఒక్కసారిగా పేలుడు సంభవించింది.ఈ ఘట నలో 18మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.భారీ ఎత్తున మంటలు ఎగసిపడ డంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.పేలుడు శబ్దాలు సుమారు ఐదు కి లో మీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు.శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉ న్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.తీ వ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది.

పోస్టుమార్టం నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన హోం గార్డ్ ను ఎసిబి పట్టివేత...

Image
పోస్టుమార్టం నివేదిక కోసం లంచం డిమాండ్ చేసిన హోం గార్డ్ ను ఎసిబి పట్టివేత VS9TV న్యూస్,కీసర : మల్కాజిగిరి జిల్లా,కీసరలో లంచం వ్యవహారం వెలుగుచూసింది.పోస్ట్మార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగే ష్‌ను అవినీ తి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి పట్టుకు న్నారు.వివరాల్లోకి వెళ్తే...తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెం దాడు.కుటుంబ సభ్యులు పో స్ట్ మార్టం నివేదిక కో సం నగేష్‌ను సంప్రదించారు.ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న సందీప్ పేరును ప్రస్తావిస్తూ రిపోర్ట్ కావాలంటే రూ.2 లక్షలు ఇ వ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉ న్నాయి.చివరకు మృతుడి మేనల్లుడు శరత్‌ తో చ ర్చించి రూ.40వేలకు ఒప్పందం కుదుర్చుకు న్నాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించా రు.అధికారులు పన్నిన ఉచ్చులో భాగంగా మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు స్వీకరిస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డా డు.పట్టుకున్న డబ్బులను స్వాధీనం చేసుకున్న అధి కారులు,నగేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్య లు ప్రారంభించారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఆపరేషన్ వజ్ర ప్రహర్ చేపట్టిన కర్నూలు జిల్లా పోలీ సులు...

Image
ఆపరేషన్ వజ్ర ప్రహర్ చేపట్టిన కర్నూలు జిల్లా పోలీసులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : రాష్ట్ర డిజిపి చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహర్ కా ర్యక్రమంలో భాగంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పా టిల్ ఆదేశాలతో కర్నూలు పోలీసులు కర్నూ లు, ఆదోని,పత్తికొండ,ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ల పరి ధిలలోని ఆయా గ్రామాలలో శనివారం విస్తృ తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎమ్మిగనూరు సబ్ డివిజన్ : పెద్ద కడుబూరు పియస్ పరిధిలోని జాలవాడి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, అనుమానిత ప్రాంతాలు,అనుమానిత వ్యక్తుల ఇళ్ళ లో సోదాలు,పంటపొలాల్లో గంజాయి,నాటుసారా తయారీ,మద్యం అక్రమ విక్రయాలు,గుట్కా నిల్వలు వంటి అంశాలపై సోదాలు నిర్వహించారు. ఆదోని సబ్ డివిజన్ : ఆదోని పోలీసులు వాల్మీకి నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి,10 లీటర్ల నాటు సారా,12 మద్యం సీసాలు, నంబర్ ప్లేట్ లేని రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.ఆయా గ్రా మాలలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీ సులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, సి.ఐలు మంజునాథ్,రాజశేఖర్ రెడ్డి,నల్లప్ప,రా మలింగమయ్య,చంద...

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి...మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు...

Image
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి జిల్లా ఎస్పీ  ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి సుధాకర్ బాబు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఏరోజు ఒక పార్టీ ఆఫీస్ పై మరో పార్టీ దాడికి వెళ్లినట్టు కర్నూలు చరిత్రలో లేదని,కానీ బిజెపి పార్టీ గుండాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి విధ్వం సం సృష్టించి గేట్లు విరగొట్టి,ఫ్లెక్సీలు చింపివేసి విధ్వంశం చేస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలే దని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు.మీరు మీడియా, పేపర్లలలో చూసివుంటారని,పేపర్లలో వచ్చిన దానికి ప్రతిష్పందన ఉండాలి కదా.ఎవరు ఏమి చేశారు అన్నది.ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో న...

అనధికార నిర్మాణాలను లేఅవుట్లను క్రమబద్ధీకరిం చుకోవాలి...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనా థ్...

Image
అనధికార నిర్మాణాలను లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం‌, లేఅవుట్ రెగ్యలైజేషన్ స్కీం ద్వారా అనధికార నిర్మా ణాలను,అక్రమ లేఅవుట్లను ప్రజలు క్రమబద్ధీకరిం చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వ నాథ్ సూచించారు.శనివారం ఆయన జొహరాపురం లో వివిధ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు, నిర్మాణా లను తనిఖీ చేశారు.నోటీసుల జారీపై ఆరా తీశారు. కొత్తగా జరుగుతున్న నిర్మాణాలు ప్లాన్‌కి ప్రకారం జరు గుతుందా? లేదా? అని పరిశీలించారు.ఈ కార్యక్ర మంలో బిల్లింగ్ ఇన్ స్పెక్టర్లు దివాకర్,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష,తదితరులు పాల్గొన్నారు.

కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు...అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి...

Image
కువైట్‌లోని భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి VS9TV న్యూస్,హైదరాబాద్ : ​కువైట్ సిటీ,ప్రాంతీయంగా నెలకొన్న ప్రస్తుత భ ద్రతా పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో నివ సిస్తున్న భారతీయ పౌరులందరూ అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఒక ప్రకటన విడుదల చే సింది.తాజా పరిణామాలను గమనిస్తూ,తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ​ముఖ్యమైన మార్గదర్శకాలు : ​అప్రమత్తత అవసరం : ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉండాలి.స్థానిక భద్రతా నిబంధనలను, మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి.​వార్తలను గమనించండి : కువైట్ ప్రభుత్వం చేసే అధికారిక ప్రకటనలను, వార్తా మాధ్యమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని రాయబార కార్యాలయం కోరింది. ​సాధారణ సేవలు : ఎంబసీ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని,తదుపరి అప్‌డేట్స్ కోసం వేచి ఉండాలని స్పష్టం చేసింది. ​సహాయం కోసం సంప్రదించండి : భారతీయులకు ఏదైనా సందేహాలున్నా లేదా అత్యవసర సహాయం కావాలన్నా ఈ క్రింది మార్గాల ద్వారా ఎంబసీని సంప్రదించవచ్చు : ​హెల్ప్‌లైన్ నంబర్: +965 65501946 ​ఈమెయిల్: community.kuwait@mea.gov.in~

37వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ...

Image
37వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ VS9TV న్యూస్,కల్లూరు : కల్లూరు మండలం,37 వ వార్డు వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క వీధిలో పేదల సేవలో ఎన్టీఆర్ భరో సా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.కా ర్యక్రమానికి గౌరు దంపతుల తనయుడు యువ నా యకులు గౌరు జనార్ధన్ రెడ్డి,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మలు హాజరై ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు.అదేవిదంగా ప్రజా సమస్యలు,మౌలిక సదుపాయాలు,ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై ప్రజలను అడిగి తెలుసుకోవడం జరిగింది.ఈ కార్యక్ర మంలో క్లస్టర్ ఇన్చార్జి జనార్ధన్ ఆచారి, 37వ వార్డు ఇన్చార్జి సుతారు రాఘవేంద్ర,41వ వార్డు ఇన్చార్జి నా గేశ్వరరావు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అభి మానులు,తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

మహిళలు,బాలల రక్షణ,సైబర్ నేరాలు,రహదారి భద్రతపై అవగాహన...

Image
మహిళలు,బాలల రక్షణ,సైబర్ నేరాలు,రహదారి భద్రతపై అవగాహన VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లాలో మహిళలు,బాలల రక్షణ,సైబర్ నేరాల నివారణ,రహదారి భద్రత మరియు పోలీస్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పోలీసు అధికారులు విస్తృత స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలు మరియు పట్టణాలు,గ్రామాలను సందర్శించి సీఐలు,ఎస్సైలు,జీఎంఎస్కేలు కలిసి వివిధ అవగాహన సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ప్రధానంగా మహిళలపై నేరాలు, బాల్య వివాహాల నిరోధం, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ పై అవగాహన,ఈవ్ టీజింగ్ పై నియంత్రణ,సైబర్ నేరా లు,ఆన్‌లైన్ మోసాలు,ట్రాఫిక్ నిబంధనలు,పోలీస్ సేవల గురించి సూచించారు.ఏవైనా అనుమానాస్పద సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు స మాచారం ఇవ్వాలని సూచించారు.అత్యవసర పరి స్థితుల్లో ఉపయోగించాల్సిన డయల్ 112,డయల్ 100,1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ గురించి వివరిం చారు.

తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య...

Image
తూర్పుగోదావరి జిల్లాలో పరువు హత్య VS9TV న్యూస్,తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా,మండపేట నియోజక వర్గం,ద్వారపూడి గ్రామంలో హత్యా సంఘటన చోటుచేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి... మృతుడు పోలిపల్లి సూర్యప్రకాశ్ (41),ఆయన విల్లి సంధ్య (40).సంధ్య ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు.వీరిద్దరూ గత రెండు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమించుకున్నారు.ఈ నెల 26వ తేదీన అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.ఈ వివాహంపై అభ్యంత రం వ్యక్తం చేసిన యువతి కుటుంబ సభ్యులు, సుమారు రాత్రి 11:30 గంటల సమయంలో పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి అతి కిరాతకంగా రాళ్లతో దాడి చేయడంతో పోలిపల్లి సూర్యప్రకాశ్ తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం తెలి సిన వెంటనే మండపేట రూరల్ ఎస్సై వి.కిషోర్,సీఐ పి.దొరరాజు సిబ్బందితో ఘటనా స్థలం చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నట్లు తెలిపారు.ఈ దర్యాప్తులో ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్యా కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప త్రికి తరలించామని,దర్యాప్తు అనంతరం పూర్తి వివ రాలు తెలియజేస్తామని సీఐ...

ఘనంగా ఎలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ నూతన షాప్ ప్రారంభం...హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు,నందికొట్కూరు నియోజకవర్గం ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి...ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...

Image
ఘనంగా ఎలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ నూతన షాప్ ప్రారంభం హాజరైన టీడీపీ సీనియర్ నాయకులు,నందికొ ట్కూరు నియోజకవర్గం ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్,కల్లూరు : కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,రేడియో స్టేషన్ ప్రక్కన ఎలైట్ అల్యూమినియం ఇంటీరియర్స్ నూతన షాప్ ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజక వర్గం ఇంచార్జి గౌరు వెంకట రెడ్డి,ఆంద్రప్రదేశ్ రా ష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మలు హాజరై వారి చేతుల మీ దుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చా ర్జి జనార్ధన్ ఆచారి,37వ వార్డు ఇన్చార్జి సుతారు రా ఘవేంద్ర,41వ వార్డు ఇన్చార్జి నాగేశ్వరరావు,సీనియ ర్ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,తదితరు లు,పాల్గొన్నారు.

ఘనంగా హ్యాపీ మొబైల్స్ రెండవ బ్రాంచ్ ప్రారంభం...

Image
ఘనంగా హ్యాపీ మొబైల్స్ రెండవ బ్రాంచ్ ప్రారంభం VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఈద్గా సమీపంలో హ్యాపీ మొబైల్స్ రెండవ బ్రాంచ్‌ను నిర్వాహకులు గురువారం ఘనంగా ప్రారంభించారు.ప్రారంభోత్సవం సందర్భంగా షోరూ మ్‌ వద్ద నుంచి ప్రచార బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ రాజవిహార్ మీ దుగా పాత బస్టాండ్,కొండారెడ్డి బురుజు వరకు సాగింది.నగరంలోని పలువురు యు వత,వినియోగ దారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం షోరూం మేనేజర్లు శ్రీ కాంత్,రామకృష్ణ మాట్లాడుతూ నేటి తరానికి అనుగుణంగా అత్యాధునిక ఫీచర్లతో కూడి న మొబైల్స్‌ను అందుబాటు ధరల్లో అందిస్తు న్నామని తెలిపారు. క్రెడిట్ కార్డు సదుపాయం,ఈఎంఐ సదుపాయాలతో పాటు ప్రత్యేక తగ్గింపు ధరలు,ఆకర్ష ణీయమైన గిఫ్ట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.మొబైల్ ఫోన్లతో పాటు గృహోపకరణాలు కూడా తక్కువ ధరల్లో లభ్యమవుతున్నాయని,అలాగే ప్రభుత్వ స బ్సిడీతో సోలార్ పవర్ సిస్టమ్స్‌ను కూడా తమ షోరూమ్ ద్వారా వినియోగదారులకు అం దజేస్తున్నట్లు పేర్కొన్నారు.నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వా హకులు కోరారు.

ఘనంగా 12 వ మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు...

Image
ఘనంగా 12వ మఠాధిపతిగా శ్రీ శ్రీ శ్రీ వీరధర్మజ  వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్సవ వేడుకలు హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు  అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ VS9TV న్యూస్, కడప ప్రతినిధి : కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 12వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు వారి పట్టాభిషేకం మహోత్స వ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వత మ్మ హాజరయ్యారు.అనంతరం విశ్వకర్మ అన్నదాన సత్రం నందు మన విశ్వబ్రాహ్మణ సంఘీ యులు,పలు విశ్వ బ్రాహ్మణ  సంఘ నాయకులతో చర్చించి అన్ని సంఘాలు కలిపి ఒకే ఏ కీకృత సంఘంగా ఏర్పాటు చేసుకోవడానికి మన విశ్వబ్రాహ్మణ పెద్దలు తీర్మానం చేయ డం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలి శాసన సభాపతి,తెలంగాణ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధు సూదనాచారి,సీనియర్ న్యాయవాది పేరు సోమల గురుప్ర సాద్ ఆచార్య,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ...

హైకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట...

Image
హైకోర్టులో జర్నలిస్టులకు భారీ ఊరట VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ,అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మా ర్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దా ఖలు చేసిన పిటిషన్‌ను గురు వారం హైకోర్టు విచారించింది.ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 20 26,ఏప్రిల్,30 వరకు కొనసాగించాలని ఆదేశించింది.ఈ పిటిషన్‌ లో,జీఓ 252,సవరిం చిన జీఓ 103 వల్ల జర్నలి స్టుల వృత్తి కార్యకలాపాలు,స దుపాయాలపై ప్రతికూల ప్రభా వం పడుతుందని ఫెడరేషన్ పేర్కొంది.పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయ వాది అడ్వొకే ట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపించారు.విచారణ సందర్భంగా స్పెషల్ అడ్వకేట్ జ న రల్ కోర్టుకు వివరణ ఇస్తూ,జర్నలిస్టుల వృత్తి కార్య కలాపాలకు ఆటంకం కలగకుండా ఉం డేందుకు తాత్కాలికంగా రెండు నెలల పాటు అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు తెలిపారు. న్యాయం సాధించే వరకు పోరాటం ఆగదు : ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు,ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026, ఏప్రిల్,30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.అలాగే,జీఓ 252,సవరించిన జీఓ 103పై లేవనెత్తిన అభ్య...

హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు...

Image
హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు,ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడు బో య గిడ్డయ్య @ సంతెన్నకు జీవిత ఖైదు శిక్ష విధించినట్లు కర్నూలు ఒకటవ అదనపు జి ల్లా & సెషన్స్ న్యాయ మూర్తి పి.కమలదేవి తెలియజేశారు.ఈ మేరకు గురువారం నింది తుడు వివరాలు వెల్లడించారు.ఉలిందకొండ పి.ఎస్.క్రైమ్ నెం.76/2016, సెక్షన్లు 302, 201,379 r/w 109 ఐపీసీ ప్రకారం నమోదు చేయబడిన కేసులో,ఫిర్యాదుదారుడు ముల్లా ముర్తు జావలి (40),కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,ఉలిందకొండ గ్రామంకు చెందిన వ్యక్తి.అయితే గూడూరు గ్రామానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలిక హత్య కు గురైన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో నింది తులు కర్నూలు జిల్లా,కల్లూరు మండలం,ఎర్రకత్వ గ్రామానికి చెందిన బోయ గిడ్డయ్య @ సంతెన్న(60),గూడూరు మండ లం,గ్రామానికి చెందిన బోయ తలారి రంగడు (35)ల పై దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయగా,కేసు విచారణ చేపట్టారు.ఈ నే పథ్యంలో కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమల దేవి గురువా రం తీర్పు వెలువరించారు.న...

హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్... కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్...

Image
హత్య కేసులో నలుగురు ముద్దాయిల అరెస్ట్ కర్నూలు డీఎస్పీ జె.బాబు ప్రసాద్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు నగరం,పాతబస్తీ,అనిల్ బార్ ప్రాంతంలో ఈ నెల 22వ తేదీన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసి,ఆయుధాలు స్వాదీనం చేసుకున్నట్లు కర్నూలు డిఎస్పీ జె.బాబు ప్రసాద్ పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం డిఎస్పీ కార్యాలయంలో ముద్దా యిల వివ రాలు వెల్లడించారు.22వ తేదీన రాత్రి సుమారు 10:00 గంటలకు పాత బస్టాండ్,అనిల్ బార్ దగ్గర పిర్యాది మారుతి పిర్యాది బాబాయి విజయ్,ముద్దాయిలు మద్యం త్రాగి ఉండి, పిర్యాది బాబాయి విజయ్ ని మద్యం తీసుకొనిరమ్మంటే మాట వినలేదని గొడవ పడినట్లు చెప్పారు.ఆ విషయంలో కక్ష పెంచుకొని ముద్దాయిలు నలుగురు ఖండేరి లోని ITI కాలే జీ దగ్గరకి ఆటోలో వెళ్ళి,పిర్యాది,పిర్యాది బాబాయి విజయ్ తో గొడవపడి కత్తులు,కర్రల తో దాడి చేస్తుండగా,ఆ విషయం తెలుసుకున్న మృతుడు అమరచింతల మనోహర్ అ క్కడికి వెళ్ళడం జరిగింది.అయితే ముద్దాయిలు అతనిని కొట్టి,ఎడమ వైపు మెడపై కత్తితో పొడవగా మనోహర్ అక్కడి కింద పడిపోయాడు.దీంతో బందువులు చికిత్స నిమిత్తం ప్ర భుత్వ సర్వజన వైద్యాశాలకు తరలించారు.డాక్టర్లు పరిశీలించి మనోహర్ అప్పటి...

అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలి...అంగన్వాడీ రిలే నిరాహార దీక్షల్లో వక్తలు...

Image
అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలి అంగన్వాడీ రిలే నిరాహార దీక్షల్లో వక్తలు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లాలో గత నాలుగు రోజులుగా అంగ న్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో కదిలిక రావడం లేదని.విధి లేని పరిస్థితుల్లో అంగన్వాడీ టీ చర్లు ఆయాలు,వేలాదిమంది మార్చి రెండవ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడు తున్నామని సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు పేర్కొన్నారు.గురువా రం దీక్ష శిబిరానికి సిఐటి యు నగర ఉపాధ్యక్షులు మహ్మద్ రఫీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ యూనియన్ ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత మ్మ ప్రసంగించారు.రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులందరూ అంగన్వాడీలపై పనిభారం విపరీ తంగా పెరిగిందని,తక్కువ వేతనాలతో పని చేస్తున్న విషయాన్ని అందరూ అంగీకరిస్తు న్నారని ఆమె తెలిపారు.కూటమి,ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల దీక్షల పట్ల చాలా ఉదా సీనంగా ఉందని,ఇది కూటమి ప్రభుత్వానికి తగదని అన్నారు.రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు,టిడిపి నాయకులు, ఎ మ్మెల్యేలు,మంత్రులుగా ఉన్...

నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి... లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి... ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి... నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

Image
నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వ హించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ,తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపా లక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.గురువారం ఆయన క్యాంపు కార్యాల యంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శుల తో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అం దించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వ కూడదని స్పష్టం చేశారు.అతిసారం ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ప్రతి రోజు ఉదయం అన్ని సచివాలయాల పరిధి లో అమినిటీస్ కార్యదర్శులు,తాగునీటి సరఫరా సిబ్బంది సంయుక్తంగా క్లోరిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రప ర చాలని,ఆర్‌సి రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహిం చాలని ఆదేశించారు.పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నార...

నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి...కఠినంగా వ ్యవహరించాలి...డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ చేయిం చాలి...అసాంఘిక కార్యకలపాలపై నిఘా ఉంచాలి... విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎస్పీ...

Image
నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి కఠినంగా వ్యవహరించాలి డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ చేయించాలి అసాంఘిక కార్యకలపాలపై నిఘా ఉంచాలి విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయా లని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు.ఈ సంధర్బంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీ లు,సిఐలు,ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం కర్నూ లు ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ...విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా చేయా లన్నారు.పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితుల ఫిర్యాదుల సమస్యలపై సత్వరమే స్పం దించి న్యాయం చేయాలన్నారు.నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేస్తనే పోలీసు శాఖ కు మంచి పేరు వస్తుందన్నారు.కార్డన్ సెర్చ్ లు,రాత్రి గస్తీలు,రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్,పల్లె నిద్ర కార్యక్రమాలు,గ్రామాల సందర్శనలు,ఆ కస్మిక తనిఖీలు,బైండోవర్ లు,పిడి యాక్టులు నమోదు చేయాలన్నారు.ప్రజా శాంతికి భంగం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణలు,పి డి యాక్టులు నమోద...

రూ.20లకే వైద్యం అందిస్తున్ననయీమ్ పాషా

Image
రూ.20లకే వైద్యం అందిస్తున్న నయీమ్ పాషా VS9TV న్యూస్,హైదరాబాద్ : చిన్నతనంలో డబ్బుల్లేక తన తండ్రి పడ్డ అనారోగ్య కష్టాలను కళ్లారా చూసిన హైదరాబా ద్‌కు చెందిన నయీమ్ పాషా అనే వ్యక్తి,పేదరికం వల్ల ఎవరూ వైద్యానికి దూరం కాకూడ దని 'క్రియా సంఘ్ సొసైటీ' (KSS) అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు.దీని ద్వారా రసూల్‌పురాలో ఆయన నడుపుతున్న హెల్త్ సెంటర్‌లో కేవలం రూ.20లకే డాక్టర్ కన్స ల్టేషన్ ను ఇప్పించి,ఉచితంగా మందులు అందిస్తూ,ప్రతి నెలా దాదాపు 3,000 మంది రోగులకు అండగా నిలుస్తున్నారు. ఇలా కేవలం వైద్యమే కాకుండా,ఇప్పటివరకు 13,4 00మంది మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించ డంతో పాటు,ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఆ ప్రాంతానికి ఒ క పెద్ద దిక్కుగా మారారు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం...మీడియా అకాడమీ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు...

Image
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం మీడియా అకాడమీ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవ హరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడి గిస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక,2024,ఫిబ్రవరి 26న రెండేళ్ల కాలానికిగాను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.కాగా,జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాస్ రెడ్డి,జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషిని ప్రభుత్వం గుర్తించి ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది.తాజా ఉత్తర్వుల ప్రకారం,ఆ యన మరో రెండేళ్ల పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.జ ర్నలిస్టులకు అక్రిడిటేషన్లు,ఇళ్ల స్థలాలు,హెల్త్ కార్డులు,ఇతర సంక్షేమ పథకాల అమలులో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.

విజ‌య్‌ దేవరకొండ,ర‌ష్మిక జంట‌కు...ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు...

Image
విజ‌య్‌ దేవరకొండ,ర‌ష్మిక జంట‌కు ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు VS9TV న్యూస్,హైదరాబాద్ : విజ‌య్ దేవ‌రకొండ,ర‌ష్మిక మంద‌న్నల వివాహం మ‌రో రోజులో (గురువారం) ఉద‌య్‌ పూర్ లో జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే నూత‌న వ‌ధూవ‌రులు, స‌మీప బంధువులు ఇప్ప‌టికే క‌ల్యాణ వేదిక‌కు చేరుకోగా సినీ,రాజ‌కీయ సెల‌బ్రిటీలు ఒ క్కొక్క‌రే అక్క‌డ‌కు చేరుకుంటున్నారు.హల్దీ,సంగీత్ వంటి వ‌రుస సెల‌బ్రేష‌న్స్‌తో ఫుల్ బి జీగా ఉన్నారు.అయితే...విజ‌య్‌,ర‌ష్మిక వివాహం సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ ఈ జంట‌కు ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.ఈ లేఖ‌లో...మాధ వి,గోవర్ధన్ రావు దేవరకొండలు పంపిన వివాహ ఆహ్వ‌నం అందినట్లు తెలియచేశారు. దే వ‌ర‌ కొండ‌ మంద‌న్న కుటుంబాల‌కు అభినంద‌న‌లు తెలిపారు.ఇన్నాళ్లు తెర‌పై అల‌రించార‌ ని,ఇక‌పై విజ‌య్‌,ర‌ష్మిక జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ఆరంభం అవుతున్న‌ద‌ని,వారు క‌ ల‌కాలం క‌ల‌సి ఉండాల‌ని,పరస్పర ప్రేమ,ఆలోచనతో బాధ్యతలను పంచుకుని,ఒకరినొక రు అర్థం చేసుకుని,బలాలను తెలుసుకుని,భాగస్వాములుగా జీవన ప్రయాణం కొనసా గించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు.ఈ సందర్భంగా వధూవర...

ట్రంప్ మరో సంచలన నిర్ణయం...ఇన్‌కం టాక్స్ రద్దు,విదేశీ వస్తువులపై పన్నులతోనే పాలన...

Image
ట్రంప్ మరో సంచలన నిర్ణయం ఇన్‌కం టాక్స్ రద్దు,విదేశీ వస్తువులపై పన్నులతోనే పాలన రెండోసారి అధ్యక్షుడిగా తొలి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం విదేశీ దిగుమతులపై 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధింపు VS9TV న్యూస్,హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో తొలిసారిగా కాం గ్రె స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు (స్టేట్ ఆఫ్ ది యూనియన్).ఈ సందర్భంగా తన ప్రభుత్వ విధానాలను స్పష్టం చేస్తూ అంతర్జాతీయంగా కీలక పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చే శారు.నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రసం గం సాగింది.కొన్ని రోజుల క్రితం ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే.ఈ తీర్పును అధిగమించేందుకు ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 19 74లోని మరో సెక్షన్‌ను ఉపయోగించి అన్ని దేశాల దిగుమతులపై తాత్కాలికంగా 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించింది.తన ప్రసంగంలో ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రం ప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. మరోవైపు,ఇరాన్‌...

మావోయిస్టు విప్లవ పోరాటం ముగుస్తోంది...డీజీపీ శివధర్‌ రెడ్డి...

Image
మావోయిస్టు విప్లవ పోరాటం ముగుస్తోంది డీజీపీ శివధర్‌రెడ్డి VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణలో రూపుదిద్దుకున్న మావోయిస్టు విప్లవ పోరాటం ఇక్కడే ముగుస్తోందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలను గమ నించి మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అ ప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ సహా నలుగురు అగ్రనేతలు పోలీ సుల ఎదుట లొంగిపోయారు.హైదరాబాద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో డీజీపీ సమక్షం లో దేవ్‌జీతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌,తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్‌ గంగన్న లొంగిపోయారు.ఈ సందర్భం గా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ..నలుగురు అగ్రనేతలు లొంగిపోవడం ద్వారా మావోయిస్టు పార్టీ అత్యున్నత సంస్థాగత నిర్మాణం పతన మైందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్య ర్థన మేరకు లొంగిపోతున్న మావోయిస్టుల పున రావాసానికి కట్టుబడి ఉంటామని,వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడుతామని ప...

యూ ట్యూబర్‌ కోమలి ఆత్మహత్య...

Image
యూట్యూబర్‌ కోమలి ఆత్మహత్య VS9TV న్యూస్,హైదరాబాద్ : వ్యక్తిగత సమస్యలతో  యూట్యూబర్‌ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది.రాయదుర్గం ఇన్‌ స్పెక్టర్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం...విశాఖ పట్టణానికి చెందిన కోమలి...హై దరాబాద్‌లో బీఎస్సీ చదువుతోంది.కోమలి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మరియు సోషల్ మీడియాలో కామెడీ వీడియోలు,షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నా రు.ఆమె గత కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో లేదా కుటుంబ కలహాలతో బాధపడు తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన ఆమె,బుధవారం రాత్రి తన ని వాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.​కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆమె మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.సమాచా రం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమి త్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.​పో లీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఆ మె మరణవార్త విని సోషల్ మీడియా ఫాలోవర్లు,తోటి యూ ట్యూబర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చే స్తున్నారు.

చూస్తే ఎంతో అమాయకుడు...ఎటిఎంల వద్ద జనాలను దోపిడీ చేస్తాడు...

Image
చూస్తే ఎంతో అమాయకుడు ఎటిఎంల వద్ద జనాలను దోపిడీ చేస్తాడు VS9TV న్యూస్,శ్రీకాకుళం : చూడటానికి ఎంతో అమాయకుడుగా కనిపిస్తాడు.బ్యాంకు ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధు లు,నిరక్షరాస్యుల కోసం ఎదురు చూస్తాడు...అదను చూసి జనాలను మస్కా కొడతాడు. సాయం చేస్తున్నట్టు నటించి ఖాతాలు కొల్లగొట్టే స్తాడు.ఇలా ఒకటి కాదు రెండు కాదు.ఏ కంగా ఇరవై చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద మస్కా కొట్టి మాయ చేసి డబ్బులు లాగేసాడు ఈ కేటుగాడు.అలాంటి మాయలోడు ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పోలీసుల చేతికి చిక్కి కట కటాల పాలయ్యాడు.ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ అంటూ అనకాపల్లి పోలీసులు ప్రకటిం చారు.వివరాల్లోకి వెళితే...నర్సీపట్నం మండలం,ధర్మసాగరం గ్రామానికి చెందిన నూకరా జు ఈ నెల 17న నగదు డ్రా చేయానికి యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతనికి ఏటీఎంతో డబ్బులు డ్రా చేయడం తెలియక ఇబ్బందిపడ్డాడు.దీంతో అక్కడున్న గు ర్తు తెలియని వ్యక్తిని సహాయం అడిగాడు.అయితే అప్పటికే అవకాశం కోసం ఎదురుచూ స్తున్న...ఆ వ్యక్తి నూకరాజు నుంచి ఏటీఎం కార్డు తీసుకొని పిన్‌ నంబరు అడిగాడు.మూ డుసార్లు ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టి డబ్బులు రావడం లేదని చెప్పి...ఏటీఎం కార్...

తమిళనాడులో సంచలనం...కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ...

Image
తమిళనాడులో సంచలనం...కొత్త పార్టీ పెట్టిన చిన్నమ్మ VS9TV న్యూస్,తమిళనాడు : తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు అన్నా డీఎంకే బహిష్కృత నాయకురాలు శ శికళ సంచలన రాజకీయ ప్రకటన చేశారు.ఆమె జయలలిత (అమ్మ),ఎంజీఆర్,అన్నా ఆ దర్శ సూత్రాలతో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.మౌనంగా ఉంటూ ప్రజ లకు న్యాయం చేయలేనని ఆమె స్పష్టం చేశారు.జయలలిత జ యంతి సందర్భంగా రామ నాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తమ నూతన పార్టీకి సంబంధించిన జెం డాను ఆవిష్కరించారు.ఈ మేరకు అన్నాడీఎంకేపై శశికళ తీవ్రంగా మండి పడ్డారు.జైలు నుండి విడుదలయ్యాక తనను మళ్లీ అరెస్టు చేయాలని అన్నాడీఎంకే ప్రయత్నిం చిందన్నా రు."పార్టీ పతనమవుతోంది.ఈపీఎస్ (ఎడప్పాడి పళనిస్వామి)కి కార్యకర్తలపై శ్రద్ధ లేదు" అని తెలిపారు.ఈపీఎస్ "స్వార్థపరుడని,తన గురించే చూసుకుంటాడని"శశికళ కీలక వి మర్శలు చేశారు.అయితే శశికళకు 2027 వరకు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషే ధం ఉంది.జయలలితతో పాటు ఆస్తుల కేసులో శిక్ష పడగా,నాలుగు సంవత్సరాల జైలు అనంతరం 2021లో విడుదలయ్యారు 2016 డిసెంబర్‌లో జయలలిత మరణాంతరం అ న్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స...

109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి,తాత ఇచ్చిన అప్పు...వసూలు చేయనున్న మనవడు...

Image
109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి తాత ఇచ్చిన అప్పు వసూలు చేయనున్న మనవడు  VS9TV న్యూస్,హైదరాబాద్ : మధ్యప్రదేశ్ లోని సీహోర్‌కు చెందిన ఒక కుటుంబం 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని కోరుతూ ఇప్పుడు చట్టప రమైన పోరాటానికి సిద్ధమవు తోం ది.రూ.35 వేలతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకుంది.వి వరాలు ఇలా ఉన్నాయి...1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమ యంలో బ్రిటిష్ ప్రభు త్వానికి నిధుల కొరత ఏర్ప డగా,సీహోర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సేథ్ జుమ్మాలాల్ రూథియా రూ. 35,000 అప్పుగా ఇచ్చారు.ఆ అప్పును ప్రస్తుతం ఆయన మనవడు వివేక్ రూథియా ఆ చారిత్రక అప్పును వసూ లు చేసేందుకు బ్రిటిష్ క్రౌన్‌కు లీగల్ నోటీసు పం పేందుకు సిద్ధమవుతున్నారు.1917 నాటి రూ.35,000,ప్రస్తుత వడ్డీ లెక్కల ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ అవుతుందని అంచనా.అప్పు ఇచ్చినట్లుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రాసిచ్చిన పత్రాలు,వీలునామా,ఇతర రికార్డులు తమ వద్ద ఉన్నాయని కుటుం బసభ్యులు పేర్కొంటున్నారు.

నారా లోకేష్ పనితీరుపై ఏపీ హైకోర్టు ప్రశంసలు...

Image
నారా లోకేష్ పనితీరుపై ఏపీ హైకోర్టు ప్రశంసలు VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరుపై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యా ఖ్యలు చేస్తూ ప్రశంసించింది.ముఖ్యంగా విద్యాశాఖలో ఆయన తీసుకువస్తున్న సంస్కర ణలు,సమస్యల పరిష్కారంలో చూపిస్తున్న చొరవ అభినందనీయమని న్యాయస్థానం పే ర్కొంది.కస్తూర్బా పాఠశాలల సిబ్బంది జీతాలు పెంచుతామన్న ప్రకటనను స్వాగతించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న అనేక అంశాలను లోకేష్ బాధ్యతలు చేపట్టిన కొద్ది కా లంలో నే ఒక కొలిక్కి తీసుకురావడంపై కోర్టు సానుకూలంగా స్పందించింది.రాష్ట్రంలోని పాఠ శా లల్లో మౌలిక సదుపాయాల కల్పన,ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో పారదర్శకత కో సం తీసుకువచ్చిన కొత్త విధానాలను హైకోర్టు ప్రస్తావించింది.కోర్టులో పెండింగ్‌లో ఉన్న వి ద్యాశాఖకు సంబంధించిన కొన్ని వివాదాలను ప్రభుత్వం సామరస్యపూర్వకంగా పరిష్క రించేలా లోకేష్ చొరవ తీసుకోవడం పట్ల న్యాయమూర్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజా సమస్యల పట్ల ఆయన చూపిస్తున్న నిబ ద్ధతను న్యాయస్థానం కొనియాడింది.ప్రజా సమస్యలపై మంత్రి లోకేష్ వేగంగా స్పందిస...

సీనియర్ జర్నలిస్ట్ ఎస్.జేమ్స్ ఆనందరావు మృతి జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటు...సంతాపసభలో వక్తలు...

Image
సీనియర్ జర్నలిస్ట్ ఎస్.జేమ్స్ ఆనందరావు మృతి  జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటు సంతాపసభలో వక్తలు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : సీనియర్ జర్నలిస్ట్ జేమ్స్ మృతి జర్నలిస్ట్ సమాజానికి తీరనిలోటు అని సంతాపసభలో వ క్తలు అభిప్రాయపడ్డారు.మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం,సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో సీనియర్ జర్నలిస్ట్,నిత్యభాను,స్వచ్ ప్రభ పత్రికల ఎడిటర్,యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) కల్లూరు మండల నాయకులు ఎస్.జేమ్స్ ఆనంద రా వు మృతి సందర్బంగా యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) జిల్లా కమిటీ అధ్యక్ష,కార్య దర్శులు గిలిగిత్త విజయ్ కుమార్,యు.రాజశేఖర్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటుచే శారు. కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,గౌరవధ్యక్షులు పి.యూసుఫ్ ఖాన్,నాయకులు వి.విజయ్ కుమార్,నగర కమిటీ అధ్యక్షులు పి.నాగేందృడు,సివిఆర్ న్యూస్ ప్రతినిధి ఇస్మాయిల్,బిఆర్ కె న్యూస్ ప్రతినిధి బసవరాజు,ఆంధ్రప్రభ ప్రతినిధి సా యి కుమార్ నాయుడులు హాజరై ముందుగా జేమ్స్ ఆనందరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి సంతాపం తెలియచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ సీని యర్ జర్నలిస్ట్...

కేరళ పేరు...ఇక కేరళం...కేంద్ర క్యాబినెట్ ఆమోదం...

Image
కేరళ పేరు...ఇక కేరళం...కేంద్ర క్యాబినెట్ ఆమోదం VS9TV న్యూస్,హైదరాబాద్ : దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరు మార నుంది.ఈ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చేదిశగా కీలక అడుగుపడింది.సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాద నకు మంగళవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థి స్తూ ఇప్పటికే కేరళ (Kerala) అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసిన సంగతి తెలిసిం దే.అధికారిక రికార్డుల్లో రాష్ట్రం పేరును సవరించాలంటూ తీసుకు వచ్చిన తీర్మానానికి ఇటీ వల కేరళ శాసనసభ ఆమోదం తెలపగా...తాజాగా కేంద్ర క్యాబినెట్ దానిని పరిగణనలో కి తీసుకుంది.ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ...ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో 'కేర ళం' అని పిలిచేవారని అప్పట్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. కానీ, ఇ తర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు.కాగా...ఈ విషయం లో విజయ్ ప్రభు త్వానికి భాజపా మద్దతు ఇచ్చింది.ఈ మేరకు ఇటీవల ఆ పార...

కల్తీ పాలతో నలుగురు మృతి...వెలుగులోకి సంచలన విషయాలు...

Image
కల్తీ పాలతో నలుగురు మృతి వెలుగులోకి సంచలన విషయాలు VS9TV న్యూస్,రాజమండ్రి : రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయా లు వెలుగులోకి వస్తున్నాయి.నలుగురు మృతి చెందగా,మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిం దని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.నేడు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.తూర్పు గోదావరి జిల్లా,కోరుకొండ మండలం,నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీ లో,పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్‌ గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై,ఒక పాల క్యాన్‌లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుం బాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగ ర్,స్వ రూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12మంది,అనూరియా సమస్య తో ఆసుపత్రుల్లో చేరారు.కాగా,ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా,8 మందికి చికి త్స ...

ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి... రా జకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవ గాహన...కర్నూలు నియోజకవర్గ ఆర్వో,కమిషనర్ పి.విశ్వనాథ్...

Image
ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కర్నూలు నియోజకవర్గ ఆర్వో,కమిషనర్ పి.విశ్వనాథ్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి,నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు.మంగళవారం వెంకటరమణ కాలనీలోని న గరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రత్యేక ప్రక్రియగా ఆర్వో వివరించారు.అర్హులైన ప్రతి ఓ టరు పేరు జాబితాలో ఉండేలా చేయడం,మరణించిన వారు,డూప్లికేట్ పేర్లు తొలగిం చ డం,చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరిచేయడం,కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ విధంగా రూపొందే ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండడం ద్వారా ప్రజాస్వామ్య వ్య ...

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బీజేవైఎం కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయా లి...జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి నాయుడు బోయ...

Image
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బీజేవైఎం  కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలి క్రాంతి నాయుడు బోయ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  VS9TV న్యూస్,కర్నూలు క్రైం : జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయపై ఈనెల 21వ తేదీన దాడి చేసిన బీజేవైఎం కార్యకర్తల పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు లు క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలంగాణలో జరుగుతున్న సంఘటన్ శ్రీజన్ అభియా న్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ జిల్లాల నూతన అధ్య క్షుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఉన్న క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ ఢిల్లీ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో చైనా డ్రోన్లను ఉపయోగించారని మా యువజన కాంగ్రెస్ నా యకులు తప్పును చూపించడం జరిగిందని,వాటిని జీర్ణించుకోలేని బిజెపి పార్టీ జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరపాలని పిలుపునివ్వడం జరిగిందని,కానీ ఒక రోజు ముందే జిల్లా ఎస్పీకి మరియు సంబంధిత కర్నూలు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కి సమాచారం అందించామని పార్టీ కార్యాలయం ముందు పోల...

చౌరస్తా బైపాస్ విస్తరణ వేగవంతం...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

Image
చౌరస్తా బైపాస్ విస్తరణ వేగవంతం నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : కర్నూలు నగరంలోని చౌరస్తా బైపాస్ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి ఆర్టీసీ బస్సుల రాకపోకలకు సౌలభ్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సం స్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.నగరంలోని బళ్ళారి చౌరస్తా బైపాస్ వద్ద మలుపు ప్రాంతంలో ఉన్న మరో రెండు షాపులను తొలగించి రహదారి విస్తరణ పనులు చేపట్టను న్నట్లు వెల్లడించారు.మంగళవారం ఆయన సంబంధిత ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలిం చి అధికారులకు దిశానిర్దేశం చేశారు.పోలీస్ శాఖ అనుమతులు పొందిన అనంతరం తొ లగింపు చర్యలు చేపట్టి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు స్పష్టం చే శారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ...నూతనంగా నిర్మించిన బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సులు సులభంగా తిరుగుటకు మలుపు ప్రాంతంలో అడ్డంకులుగా ఉన్న నిర్మాణాలను తొలగించ డం అవసరమని తెలిపారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా మద్దూర్ నగర్ కారికతీయ పాఠశాల వెనుకనున్న మున్సిపల్ విద్యానవనం (పింగళి సూరన తెలుగు తోట)ను ప...

ముగ్గురు వ్యక్తులపై కత్తులు,కర్రలతో దాడి... ఆపేందుకు వెళ్లిన వ్యక్తి మృతి...

Image
ముగ్గురు వ్యక్తులపై కత్తులు,కర్రలతో దాడి ఆపేందుకు వెళ్లిన వ్యక్తి మృతి VS9TV న్యూస్,కర్నూలు క్రైం :  కర్నూలు నగరం,పాతబస్తీ ఖండేరి వీధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుం ది.అన్నదమ్ములు ముగ్గురిపై దుండగులు కత్తులు,కర్రలతో దాడి చేయగా వారిలో మనోహ ర్ (35) తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన జరిగిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...గత ఎన్నికల సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్థలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పాతబస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న అనిల్ బార్ వద్ద విజయ్,మారుతి కలసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో తెలుగు రాజు,తెలుగు నగేష్,ఎరుకలి రాముడు కల సి మారుతిని దూషించడంతో ఘర్షణ తలెత్తింది.అక్కడున్న వారు సర్దిచెప్పడంతో ఎవరికి వారు ఇంటికి వెళ్లి అర్ధరాత్రి మళ్లీ ఫోన్ చేసుకుని దూషించుకున్నారు.పాతబస్తీలోని ఖం డేరి వీధి ఐటీఐ సెంటర్ వద్దకు ఆటోలో చేరుకుని విజయ్,మారుతిపై ప్రత్యర్థులు దాడి చే స్తుండగా అక్కడే నివాసముంటున్న మనోహర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారించే ప్ర యత్నం చేశాడు.తెలుగు రాజు,తెలుగు నగేష్,ఎరుకలి రాముడు అతన...

పోలీసు స్టేషన్ ఎదుట రెండు కుటుంబాల ఘర్షణ...

Image
పోలీసుస్టేషన్ ఎదుట రెండు కుటుంబాల ఘర్షణ V S9TV న్యూస్,డోన్ :  డోన్ అర్బన్ పోలీసు స్టేషన్ కు వంద అడుగుల దూరంలో సోమవారం భార్యాభర్తల భర ణం పంచాయితీ విషయంలో ఘర్షణకు దిగిన ఇరుకుటుంబాల వారు రణరంగాన్ని సృ ష్టించారు.పరస్పరం దాడులు చేసుకొని కాసేపు ఈ ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు.నిత్యం రద్దీగా ఉండే పోలీసుస్టేషన్ రోడ్డులో గొడవకు దిగిన ఇరువర్గాల వా రు గంటసేపు ట్రాఫిక్ ను స్తంభింపజేశారు.ఈ ఘర్షణలో కొంతమంది మహిళలను విచక్ష ణారహితంగా ఒక వర్గం వారు చితకబాదడం జరిగింది.దీంత మహిళలు కూడా తీవ్రస్థా యిలో ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు.ఒక దశలో ఎవరికీ ప్రాణహాని జరుగుతుందో నని ఆందోళన స్థానికుల్లో కనిపించింది.చివరకు ఇరుకు టుంబాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తగాదా సద్దుమణిగింది.వివిధ సివిల్ పంచాయితీల్లో పోలీ సులు రాజీ కుదిర్చేందుకు సమయం ఇచ్చి ఇరువర్గాలను స్టేషన్ బయట పంపినప్పుడు ఇ లాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.

కాలం చెల్లిన మందులు అమ్ముతున్న RMPలపై దాడులు...డ్రగ్ కంట్రోల్ అధికారులు...

Image
కాలం చెల్లిన మందులు అమ్ముతున్న RMPలపై దాడులు డ్రగ్ కంట్రోల్ అధికారులు VS9TV న్యూస్,కృష్ణ : బాధితుల సమాచారం మేరకు కృష్ణ జిల్లా,గుంటూరు,పల్నాడు జిల్లాలో కూడా ఇలా లైసె న్స్ లే కుండా విచ్చల విడిగా పెయిన్ కిల్లర్,యాంటీ బయోటిక్స్,స్థిరయిడ్ ఇంజక్షన్ లను విచ్చల విడిగా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న RMP లపై డ్రగ్ కంట్రోల్ అధి కారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో జగ్గయ్యపేట మండలం,బలుపు పాడులో ఆ ర్ఎంపీ వల్లంకొండ గోపి వద్ద లక్ష రూపాయలు విలువైన మందులను పట్టుకుని సీజ్ చేశా రు.జగ్గయ్యపేటలో తజ్ క్లినిక్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ షేక్ తాజుద్దీన్ నుంచి రూ.2 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు పెనుగంచి ప్రోలు మండ లం,తోటచర్లలో ఆర్ఎంపీ బిత్రా బాలకృష్ణ వద్ద లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహాయ సంచాలకులు పి.శ్రీరామ మూర్తి,డ్రగ్ ఇన్ స్పెక్టర్లు డి.సునీత,ఎ.కృష్ణ,కె.వి.భూపేష్, బి.గోపాలకృష్ణ తదితరులు పా ల్గొ న్నారు.