ట్రంప్ మరో సంచలన నిర్ణయం...ఇన్‌కం టాక్స్ రద్దు,విదేశీ వస్తువులపై పన్నులతోనే పాలన...

ట్రంప్ మరో సంచలన నిర్ణయం
ఇన్‌కం టాక్స్ రద్దు,విదేశీ వస్తువులపై పన్నులతోనే పాలన
రెండోసారి అధ్యక్షుడిగా తొలి స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం
విదేశీ దిగుమతులపై 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధింపు

VS9TV న్యూస్,హైదరాబాద్ :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పదవీకాలంలో తొలిసారిగా కాం గ్రె స్‌ను ఉద్దేశించి ప్రసంగించారు (స్టేట్ ఆఫ్ ది యూనియన్).ఈ సందర్భంగా తన ప్రభుత్వ విధానాలను స్పష్టం చేస్తూ అంతర్జాతీయంగా కీలక పరిణామాలపై ఘాటు వ్యాఖ్యలు చే శారు.నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రసం గం సాగింది.కొన్ని రోజుల క్రితం ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే.ఈ తీర్పును అధిగమించేందుకు ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 19 74లోని మరో సెక్షన్‌ను ఉపయోగించి అన్ని దేశాల దిగుమతులపై తాత్కాలికంగా 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించింది.తన ప్రసంగంలో ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్న ట్రం ప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. మరోవైపు,ఇరాన్‌తో పెరుగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన తీవ్రస్వరంతో మాట్లా డారు.అవసరమైతే ఇరాన్‌పై సైనిక చర్యకు వెనుకాడబోమని హెచ్చరించారు.ఈ వ్యాఖ్యల తో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ట్రంప్ విధించిన ఈ 15 శాతం టారిఫ్ 150 రోజుల పాటు తాత్కాలికంగా అమల్లో ఉంటుంది.ఆ తర్వాత దీనిని పొడిగిం చాలంటే కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.ఈ కొత్త టారిఫ్‌ల వల్ల భారత్ సహా అనేక దేశాల ఎగుమతులపై ప్రభావం పడనుండటంతో వాణిజ్య వర్గాల్లో చర్చ మొదలైంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...