Posts

Showing posts from June, 2025

భర్త కళ్లలో కారం కొట్టి...గొంతుపై కాలితో తొక్కి హత్య చేసిన భార్య...

Image
భర్త కళ్లలో కారం కొట్టి...గొంతుపైన కాలు వేసి తొక్కి హత్య చేసిన భార్య VS9TV న్యూస్,కర్ణాటక : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య హతమార్చింది. వివరాలు ఇలా ఉన్నాయి...కర్ణాటక రాష్ట్రం,తమకూరు జిల్లా,తిపటూరు మండలం,కడశెట్టిహళ్లి గ్రామ శి వారులోని ఒక ఫామ్ హౌస్ లో శంకరమూర్తి,సుమంగళి దంపతులు నివసిస్తున్నారు.అ దే గ్రామంలోని బాలికల హాస్టల్ లో సుమంగళి వంటమనిషిగా పనిచేస్తూ నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఇంట్లో ఉన్న భర్త కళ్లలో కారం కొట్టి,కర్రతో దాడి చేసి,గొంతుపై కాలు వేసి తొక్కి హత్య చేసిన అనంతరం సుమంగళి ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని సంచిలో కుట్టి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసి,భర్త కనిపించడంలేదని సుమంగళి పోలీసు లకు ఫిర్యాదు చేసింది.పోలీసుల విచారణలో వారి గుట్టు బహిర్గతం అయింది.

45 ఏళ్లకు పెళ్లి...కట్టుకున్నదే కడతేర్చింది...

Image
45 ఏళ్లకు పెళ్లి...కట్టుకున్నదే కడతేర్చింది VS9TV న్యూస్,హైదరాబాద్ : మధ్యప్రదేశ్ కు చెందిన ఇంద్రకుమార్(45) పెళ్లిపై ఆశతో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లవ్వ ట్లేదని ఓ బాబాని కలిసి..తనకు 18 ఎకరాల పొలం ఉన్నా పెళ్లి కావట్లేదని ఆవేదన వ్య క్తం చేశాడు.ఆ వీడియో వైరలవ్వడంతో ఇంద్రకుమార్ ను సాహిబా అనే యువతి ట్రాప్ చే సింది.అతడిని గోరఖూర్కు రప్పించి తన సహచరుల సాయంతో పెళ్లి చేసుకుంది.కట్ చే స్తే అతడి శవం పొదల్లో దొరికింది.పోలీసులు దర్యాప్తు చేసి హత్యారోపణలతో ఆమెను అరెస్టు చేశారు.

ప్రేమ,పెళ్లి పేరుతో రూ.35లక్షల మోసం...

Image
ప్రేమ,పెళ్లి పేరుతో రూ.35లక్షల మోసం VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఇన్ స్టాగ్రామ్లో పరిచయం ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి చెన్నైకి చెందిన ఓ మహిళ రూ.35 లక్షలు మోసం చేసిందని కర్నూలు కొత్తపేటకు చెందిన మునీర్ అహ మ్మద్ ఖురేషి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.మునీర్ లండన్లో హోటల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.తన నుంచి బంగారం,గోల్డ్ కాయిన్స్ పేరిట డబ్బులు తీసుకుని జూన్,5న ఫోన్ నంబర్ బ్లాక్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ప్రియురాలిని చంపి చెత్త లారీలో వేశాడు...

Image
ప్రియురాలిని చంపి చెత్త లారీలో వేశాడు VS9TV న్యూస్,బెంగళూరు : బెంగళూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.సహజీవనం చేస్తున్న ప్రియురాలిని ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు.ఆపై గోనె సంచిలో కుక్కి చెత్త లారీలో పడేశాడు.సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.ఒక వ్యక్తి బైక్ పై ఒక సం చిని తీసుకువచ్చి చెత్త లారీలో పడేస్తున్న దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో పోలీసులు నింది తుడిని పట్టుకున్నారు.నిందితుడిని అస్సాంకు చెందిన 33 ఏళ్ల మహమ్మద్ షంషుద్దీన్, మృతురాలిని ఆశాగా పోలీసులు గుర్తించారు.

వివాహేతర సంబంధం...మహిళను చంపిన ఆర్ఎంపీ...

Image
వివాహేతర సంబంధం...మహిళను చంపిన ఆర్ఎంపీ VS9TV న్యూస్,నల్గొండ క్రైం : తెలంగాణ,నల్లగొండ జిల్లా,గుర్రంపోడ్ లో మహేష్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు.స్థానికం గా జ్యోతి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ క్రమంలో కొద్ది రోజు లుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.దీంతో జ్యోతిని చంపాలని భావించి...ఆ మెను కారులో బయటకు తీసుకెళ్లి బలవంతంగా గడ్డి మందు తాగించి విషపు ఇంజక్షన్ ఇచ్చాడు.తర్వాత మట్టిలో పూడ్చాలని భావించాడు.ఈ లోగా పోలీసులు వచ్చి మహిళను ఆ స్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.కేసు నమోదు చేసిన పోలీసులు మ హేష్ ను విచారణ చేస్తున్నారు.

పీ4 కార్యక్రమం కింద నిర్మల ఉన్నత చదువుకు సహకారం...

Image
పీ4 కార్యక్రమం కింద నిర్మల చదువుకు సహకారం సివిల్ సర్వీసెస్ లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తా...నిర్మల VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పీ4 కార్యక్రమం కింద నిర్మల విద్యార్థినికి 21 సెంచరీ ఐ.ఏ.యస్ అకాడ మీ హైదరాబాద్ వారు ఉచిత చదువు, వసతి,భోజన సదుపాయాలతో మూడు సంవత్స రాల డిగ్రీ,ఐ.ఏ.యస్ కోచింగ్ తో పాటు ఒక సంవత్సరం ప్రత్యేక అడ్వాన్స్ శిక్షణ ఇచ్చుట కు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.వివరాలు...ఆదోని మండలం,పెద్ద హ రివనం గ్రామానికి చెందిన విద్యార్థిని నిర్మలది నిరుపేద కుటుంబం...ఆమె తల్లితండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.నిర్మల 2023లో పదవ తరగతి పరీక్షల్లో 600కు గాను 537 మార్కులు సాధించింది.అయితే పై చదువులు చదివించడానికి ఆర్ధిక స్థోమత లేక తల్లితండ్రులు బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నంచారు.విషయం తెలు సుకున్న అప్పటి కలెక్టర్ సృజన నిర్మలను చదివించేందుకు కృషి చేసి ఆస్పరిలోని కస్తూరి బా గాంధీ కళాశాలలో ఇంటర్మిడియట్ లో చేర్పించారు.ఇంటర్ లో 1000 మార్కులకు గాను 966తెచ్చుకొని ఔరా అనిపించింది.అదేవిదంగ...

నిన్ను కొట్టనురా...దయచేసి వచ్చి కలువురా...ఆర్టిస్ట్ రవిరాజ్ రాథోడ్ పై లారెన్స్ ఎమోషనల్...

Image
నిన్ను కొట్టనురా...దయచేసి వచ్చి కలువురా ఆర్టిస్ట్ రవిరాజ్ రాథోడ్ పై లారెన్స్ ఎమోషనల్ VS9TV న్యూస్,హైదరాబాద్ : రాఘవ లారెన్స్ నటుడు,కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా ! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు.సోషల్ మీడియా వేదిక గా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు.విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్ ను చదివించాలనుకున్న లారెన్స్  తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూ ల్లో చేర్పించాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు.కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవిరాజ్ రాథోడ్ చెప్పాపెట్టకుండా స్కూ ల్ మానేసి వెళ్లిపోయాడు.తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు.పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే త ప్ప ఎవరూ దారి చూపలేదని రవి రాజ్ రాథోడ్ ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు. గుండె తరుక్కుపోతోంది :  లారెన్స్ ను కలు...

సిగాచీ కెమికల్ పరిశ్రమలో దారుణ ఘటన...రియాక్టర్ బ్లాస్ట్ లో 12కి చేరిన మృతులు,26మందికి గాయాలు...

Image
సిగాచీ కెమికల్ పరిశ్రమలో దారుణ ఘటన రియాక్టర్ బ్లాస్ట్ లో 12కి చేరిన మృతులు,26మందికి గాయాలు వంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ కార్మికులు కుప్పకూలిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సీఎం రేవంత్,కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి VS9TV న్యూస్,హైదరాబాద్ : పాశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8మంది దుర్మరణం పాల య్యారు.26మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.స్పాట్ లో ఆరుగురు మృతి చెందారు.ఇద్దరు చికిత్స పొందు తూ కన్ను మూశారు.పేలుళ్ల ధాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్ప కూలింది.ప్రమాదంలో చి క్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఎనిమిది ఫైర్ ఇం జిన్లు వచ్చి మంటలు ఆర్పేస్తున్నాయి.రసాయనాలు కాలిపోతుండటంతో ఆ ప్రాంతంలో ద ట్టమైన పొగలు అలుముకున్నాయి.ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్,మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో గాయ పడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి అధికారులను ఆదేశించారు.ఐజీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్...

మీకో దండం...మీ బీజేపీ పార్టీకో దండం...బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా....

Image
మీకో దండం...మీ బీజేపీ పార్టీకో దండం బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా VS9TV న్యూస్,హైదరాబాద్ : తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది.గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రక టించారు.చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన...కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అ సంతృప్తితో ఉన్నా,బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నా.కానీ,నా మద్దతు దారుల్ని బెదిరించారు.నామినేషన్‌ వేయడానికి వస్తే...వేయనివ్వలేదు.వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు.అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా.రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనా మా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్‌ సభ్యులు కూడా రాజీనా మా చేశారు.రాజాసింగ్‌ మా పార్టీ సింబల్‌ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాద ని,సస్పెండ్‌ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రా వాలని ఎంతో పోరాడాం.కానీ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరు కుంటున్నారు.బీజేపీ కోసం సర్వం ధారపోశాన...

పదవి విరమణ పొందిన 9మంది పోలీసులకు ఘన సన్మాణం...కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్...

Image
పదవి విరమణ పొందిన 9మంది  పోలీసులకు ఘన సన్మాణం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పోలీసు సిబ్బంది పదవి వీరమణ పొందడం అభి నందనీయమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.ఈ సంధర్బంగా సోమ వారం పదవి వీరమణ పొందిన అధికారులను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆ డిటోరియంలో జిల్లా ఎస్పీ శాలువ,పూలమాలతో సత్కరించి,జ్ఞాపికను అందజేశారు.కు టుంబాలతో సంతోషంగా గడపాలని,పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్య లుంటే నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిష నల్ ఎస్పీ కృష్ణమోహన్,ఏ ఆర్ డిఎస్పీ భాస్కర్ రావు,స్పెషల్ బ్రాంచ్ సిఐలు కేశవ రెడ్డి, తేజమూర్తి,ఆర్ ఐలు జావేద్,నారాయణ,సోమశేఖర్ నాయక్,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు. పదవి వీరమణ పొందిన వారు : 1) డిపిఓ సూపరింటెండ్ - ఎస్.బాగ్య లక్ష్మీ  2) పత్తి కొండ ఎస్సై - ఎస్.టి.జమీర్ 3) ఆదోని పిసిఆర్ ఎస్సై - బి.శ్రీరాములు 4) డిటిసి కర్నూలు ఎస్సై - సి.వెంకట రమణ 5) ఎఆర్ ఎస్సై - బి.శ్రీనివాసులు  6) ఎఆర్ ఎస్సై - ఎమ్.బంద...

సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు...ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 17అర్జీలు...ఎస్.రవీం ద్ర బాబు,నగరపాలక కమిషనర్...

Image
సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 17అర్జీలు  ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక కమిషనర్ VS9TV న్యూస్,నగరపాలక సంస్థ : ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం చేయొద్దని,ఒకవేళ జాప్యం జరుగుతుంటే దానికి కారణాలేంటో సంబంధిత అర్జీదారుడికి స్పష్టంగా వివరించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం నగరపాలక కా ర్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 17అర్జీలు వచ్చాయి.వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపా రు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి,మే నేజర్ చిన్నరాముడు,ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి,సిటి ప్లానర్ ప్రదీప్ కుమా ర్,ఆర్ఓ జునైద్,ఎంఈ లీల ప్రసాద్,పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు,టిడ్కో అధి కారి పెంచలయ్య,తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదకరంగా ఉన్న 11KB సర్వీస్ వైర్లను మార్పుచేయాలి...డివైఎఫ్ ఐ...

Image
ప్రమాదకరంగా ఉన్న 11KB సర్వీస్ వైర్లను మార్పుచేయాలి డివైఎఫ్ ఐ   VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : ప్రమాదకరంగా ఉన్న లెవెన్ కెబీ సర్వీస్ వైర్లను మార్పు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు.సోమవారం కర్నూల్ కలెక్టర్ కార్యా లయం ముందు డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేప ట్టారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర,నగేష్ మాట్లాడు తూ కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ప్రమాదకరంగా లెవెన్ కెబి సర్వీసు వైర్లు ఉన్నా యని అన్నారు. మిద్దెల పైన మనిషి నిలబడితే తగిలెంత కింద వైర్లు ఉన్నాయని ఎప్పుడైనా ప్రజలకు హాని కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అనేక సంవత్సరాల క్రి తం ప్రజల వ్యతిరేకతతో సర్వీస్ వైర్లు ఏర్పాటు చేశారని తెలియజేశారు.ఆరోజు మొత్తం మట్టి మిద్దెలు ఉన్న కారణంగా సమస్య కనిపించలేదని,మట్టి మిద్దెలు ఆర్చి మిద్దెలుగా మారి నప్పటి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. బాధిత ప్రజలందరూ పేద మ ధ్యతరగతి వారిని ఉండడానికి కాసింత స్థలం తప్ప ఎలాంటి ఆధారంలేని ప్రజలని తెలి యచేశారు.కుటుంబాలు పెరిగాయని...

భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి...గౌస్ దేశాయ్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు...

Image
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి గౌస్ దేశాయ్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు క్రైం : ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు ) ఓల్డ్ సిటీ కమిటీ మూడవ నగర మహాస భ సుర్జీత్ భవన్ నందు భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.కార్యక్రమానికి కార్మికశాఖ నుండి ఏఎల్ఓలు హేమద్రి, షామీర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి కార్మికుడు శ్రామిక కార్డు కలిగి ఉండాలని భవన నిర్మా ణ సంక్షేమ బోర్డును సంక్షేమ పథకాలను ప్రభుత్వం త్వరలో అమలు చేసే ప్రయత్నం జరు గుతుందని,పెండింగ్ క్లైమ్ లన్ని త్వరగా పూర్తిచేస్తామని చెప్పారు.ఆతరువాత సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్,నగర ఉపాధ్యక్షు లు రాజశేఖర్,సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు,బిల్డింగ్ వ ర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కాజా పాషా మాట్లాడుతూ భవన నిర్మాణ కా ర్మికుల సంక్షేమబోర్డు కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.భవన ని ర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కోసం చాలా కాలం నుండి పోరాటం చేస్తే 1960లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర...

పథాలజీ విభాగం పలిశీలన...డా.కె.చిట్టి నరసమ్మ,మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్...

Image
పథాలజీ విభాగం పలిశీలన డా.కె.చిట్టి నరసమ్మ,మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథాలజీ అండ్ మైక్రో బయాలజీ ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కాలేజి యందు త్వరలో ఏడవ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న సందర్భంగా అ డిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చి ట్టి నర్సమ్మ సోమవారం కళాశాల పథాలజీ విభాగాన్ని పరిశీలించడం జరిగింది.ఈ సం దర్బంగా వారు మాట్లాడుతూ సదస్సుకు వివిధ ప్రాంతాలలో నుండి ప్రముఖ వైద్యులు హాజ రవుతారని చెప్పారు.కావున పథాలజి విభాగం యందు వాల్ పెయింటింగ్,అదేవిధంగా కావలసిన ఏర్పాట్ల గురించి పథాలజీ విభాగాధిపతి డా. బాలేశ్వరి ప్రిన్సిపాల్ కు వివరిం చారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హేమలత,అసోసియేట్ ప్రొఫెసర్ డా.రేవతి,డా.సునీ త అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.షహనాజ్,డాక్టర్ విష్ణు,తదితరులు పాల్గొన్నారు.

10వ తరగతి వరకు ఆనంద నిలయం హాస్టల్ లో వసతి కల్పించాలి...జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి అందచేత...

Image
10వ తరగతి వరకు ఆనంద నిలయం హాస్టల్ లో వసతి కల్పించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి అందచేత VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ : కర్నూలు నగరంలోని జిల్లా కలెక్టర్ ప్రాంతంలో ఉన్న ఆనంద నిలయం హాస్టల్ లో 10వ తరగతి వరకు వసతి కల్పించాలని ఇందిరాగాందీ. మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు,తల్లితండ్రులు సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్యను కలిసి వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆనంద నిలయ హాస్టల్ లో 8వ తరగ తి వరకు చదువుకున్నాం.అలాగే 10వ తరగతి వరకు ఆనంద నిలయ హాస్టల్ లో వసతి కల్పించాలని కోరారు.ప్రస్తుతం హాస్టల్ వార్డెన్ హాస్టల్ లో తమకు అవకాశం లేదని చెప్ప డంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నారు.జిల్లాలోని ఆయా ప్రాంతాల నుండి క ర్నూలు నగరంకు వచ్చి చదువుకోవాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు.జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హాస్టల్ ఉండడంతో తమ పిల్లలు ఎలాంటి భయం లేకుండా చదువుకుంటున్నారని చెప్పారు.ఈ హాస్టల్ నుండి పిల్లలను దూరంగా ఉన్న హాస్టల్ కు వెళ్లి చదువుకోవాలంటే పిల్లలు భయాందోళనకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.అదేవిదం గా తల్లి తండ్రులు వారి చదువును మధ్యలోనే నిలిపి...

తక్కువ ధరకు బంగారు ఇస్తామని నమ్మించి మోసం చేసిన నిందితులు అరెస్ట్...పలు వస్తువులు స్వాదీనం,రెండు ఇళ్ళు సీజ్... బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ...

Image
తక్కువ ధరకు బంగారు ఇస్తామని నమ్మించి మోసం చేసిన నిందితులు అరెస్ట్ పలు వస్తువులు స్వాదీనం,రెండు ఇళ్ళు సీజ్ బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : విజయవాడ,భద్రి హైట్స్,సూర్యరావు పేటకు డా.రాజేంద్ర ప్రసాద్ (55) అనే వ్యక్తిని తక్కు వ దరకు బంగారము ఇస్తామని చెప్పి నమ్మించి వద్ద నుండి సుమారు రూ.7.32కోట్లు నగదు రూపం,అలాగే బ్యాంక్ ద్వారా తీసుకున్నారని, నిలదీసి అదిగినందుకు ముద్దాయి లు తనని బెదిరించి 2025 సంవత్సరంలో మార్చి నెల,మొదటి వారంలో కర్నూలు పావని లాడ్జ్ లో ఉండగా నిందితులు పోతురాజు రతన్ కుమార్,జస్వంత్, వసంత్,విశ్వనాధ్,దే వరకొండ సుధీర్, పీటర్ పాల్,శివకుమార్ రెడ్డిలు చంపుతామని బెదిరించి తన వద్ద నుం డి బలవంతంగా మరో రూ.50 వేలు తీసుకున్నారని కర్నూలు నగరం మూడవ పట్టణ పో లీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ బాబుప్రసాద్ సహకారంతో ఈ నెల 18వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితులు నెల్లూరు జిల్లా,కావలి,వెంగళరావు నగర్ కు చెందిన పోతురాజు రతన్ కుమార్,కట్ట ...

గుంటూరులో విషాద ఘటన...తల్లి ఆవేదన ను కలెక్టర్ కు పిర్యాదు...నాల్గవ తరగతి బాలుడు...

Image
గుంటూరులో విషాద ఘటన తల్లి ఆవేదనను కలెక్టర్ కు పిర్యాదు నాల్గవ తరగతి బాలుడు VS9TV న్యూస్,గుంటూరు కలెక్టరేట్ : తల్లి ఆవేదనను చూసి తట్టుకోలేక నాల్గవ తరగతి చదువుతున్న బాలుడు యశ్వంత్ గుం టూరు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన విషాద ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉన్నా యి...తన తల్లి జీవనోపాధి కోసం జీజీహెచ్ వద్ద పెట్టిన టిఫిన్ బండిని అధికారులు తొల గించారు.దీంతో తన కుటుంబానికి జీవనదారమైన ఉపాధి కోల్పోవడంతో తన తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది.ఈ నేపథ్యంలో తన తల్లి తనతో మనం ఇద్దరం చనిపోదాం అని చెప్పిందని,తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటుచేసిన పీజీఆర్ ఎస్ లో బాలుడు యశ్వంత్ వినతిపత్రం అందచేశాడు.

స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉండాలి... ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్...

Image
స్కూల్‌ బస్సులు కండీషన్‌లో ఉండాలి ట్రాఫిక్ సిఐ మన్సరుద్దీన్ VS9TV న్యూస్,కర్నూలు క్రైం : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పి బాబు ప్రసాద్ ఆ ధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల బస్సులు కండీషన్‌లో ఉండాలని,ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తప్పని సరిగా ఉండాలని మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఎం.వి.రాజేందర్,ట్రాఫిక్ సిఐ మన్స రుద్దీన్ తెలిపారు.సోమవారం కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బస్సుల కండిషన్ ను ప రిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు సిపిఆర్ గురించి,ప్రథమచికి త్స గురించి తెలియజేశారు.పాఠశాల యాజమాన్యా నికి సంబంధించిన బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ కలిగిన సీనియర్‌ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.బస్సుల కండిషన్‌,టైర్లు,హెడ్‌లైట్‌లు బాగుండాల ని,అత్యవసర సమయంలో పిల్లలు దిగడానికి వీలుగా బస్సు ఫుట్‌బోర్డు ఏర్పాటు చేసుకో వాలని చెప్పారు.ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్సు,అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్‌నెస్‌ స ర్టిఫికెట్‌ ఇవ్వబోమని చెప్పారు.వాహన దారులు లైసెన్స్‌లు తప్పనిసరిగా పొందాలన్నా రు.కర్నూలు నగరంకు చ...

15మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం...

Image
15మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15మంది ఎమ్మెల్యేలు విదేశా ల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.తరచూ విదేశీ పర్యటన లు పెట్టుకునేవారు ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని సీఎం హితవు పలికారు.ఆహ్వాని తుల్లో 56మంది గైర్హాజరయ్యారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.ఉదయం ఎం త మంది వచ్చారు,సంతకాలు పెట్టి ఎంత మంది వెళ్లిపోయారో...అందరి లెక్కలు తన వ ద్ద ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య...

Image
అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య VS9TV న్యూస్,తమిళనాడు : అత్తింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య ఘటన జరిగింది.వివరాలు ఇలా ఉ న్నాయి...తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో పెళ్ళైన 78 రోజులకే 'రితన్య' అనే వివా హిత కారులో ఆత్మహత్య చేసుకుంది.ఆమె తన భర్త కవిన్‌కుమార్, మామ ఈశ్వరమూర్తి, అత్త చిత్రాదేవి తనను శారీరకంగా,మానసికంగా హింసిస్తున్నారని,తాను ఈ జీవితాన్ని ఇక గడపలేనని,వేరే జీవితాన్ని ఎంచుకోవడానికి అంగీకరించడం లేదని ఆత్మహత్యకు ముందు తన తండ్రికి వాట్సాప్ ద్వారా ఆడియో సందేశం పంపింది.ఈ ఘటనపై పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రాహుల్‌గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు...

Image
రాహుల్‌గాంధీపై అమిత్ షా తీవ్ర విమర్శలు VS9TV న్యూస్,నిజామాబాద్‌ : రక్షణ వ్యవహారాల్లో రాజకీయం చేయడం హానికరం అని పేర్కొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ఆపరేషన్‌ సిం ధూర్’ విషయంలో రాహుల్‌ అడుగుతున్న ఆధారాలపై ఆయన స్పందిస్తూ,"పాకిస్తాన్ గ డ్డపైకి వెళ్లి బుద్ధి చెప్పాం...ఇంకా ఏ ఆధారాలు కావాలి?" అని ప్రశ్నించారు.అమిత్‌షా మాట్లాడుతూ "ఆపరేషన్‌ సింధూర్‌ దేశ భద్రతను పరిరక్షించడానికి చేపట్టిన సాహసో పేతమైన చర్య.కానీ రాహుల్‌గాంధీ మాత్రం పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఆయన నోట పాకిస్తాన్‌ మాట వినిపిస్తోంది.దేశ భద్రతపై రాజకీయం చేయడం సరికా దు," అన్నారు. ప్రధాన వ్యాఖ్యలు : ఆపరేషన్‌ సింధూర్‌ అనేది భారత సైన్యం, భద్రతా దళాల కర్తవ్యనిరతిని చాటిచెప్పే మిష న్ అని పేర్కొన్నారు."రాహుల్‌ గాంధీ ఆధారాలు అడగడం అంటే...భారత సైన్యంపై అను మానం వ్యక్తం చేయడమే" అని వ్యాఖ్యానించారు."దేశ భద్రత కోసం పాక్ గడ్డపైకి వెళ్లి బుద్ధి చెప్పాం.ఈ ధైర్యాన్ని కాంగ్రెస్‌ చూపలేకపోయింది" అని బీజేపీ నాయకుడు వ్యా ఖ్యానించారు....

ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్...ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్...

Image
ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ఎస్.రవీంద్ర బాబు,నగరపాలక సంస్థ కమిషనర్ VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ : ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.ర వీంద్ర బాబు అధ్వర్యంలో రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు.తొలి రోజు అ డ్మినిస్ట్రేటివ్,వెల్ఫేర్,ఎడ్యుకేషన్,శానిటేషన్ కార్యదర్శులకు,రెండో రోజు ప్లానింగ్,అమిని టీస్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ చేపట్టారు.జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 308 సచి వాలయాలు ఉండగా,శనివారం 864మందికి,ఆదివారం ప్లానింగ్ 155,అమినిటీస్ 170మందికి కౌన్సిల్ పూర్తి చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టామని,ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు,సొంత వార్డు మినహా ఇతర వార్డులను ఎంపిక చేసుకు నేందుకు అవకాశం కల్పించామన్నారు.అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుం దని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ,డిప్యూటీ క మిషనర్ సతీష...

విద్యారంగానికి పరమేశ్వర్ రెడ్డిచేసిన సేవలు మరువలేనివి...ఎస్.శామ్యూల్ పాల్,జిల్లా విద్యా శాఖధికారి...

Image
విద్యారంగానికి పరమేశ్వర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి ఎస్.శామ్యూల్ పాల్,జిల్లా విద్యా శాఖధికారి VS9TV న్యూస్, కర్నూలు ఎడ్యుకేషన్ : వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పర మేశ్వర రెడ్డి 35 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చెందడం గర్వకారణమని జిల్లా వి ద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ అన్నారు.ఆదివారం కర్నూలులోని కేశవ గ్రాండ్స్ నందు ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన గోనె గండ్ల మండలం,కున్నూరు గ్రామం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయు లుగా పనిచేస్తన కె.పరమేశ్వర్ రెడ్డి పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది.కార్యక్ర మానికి జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ పరమేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పాటు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యా యులుగా,గణిత ఉపాధ్యాయులుగా, గ్రేటు 2 ప్రధానోపాధ్యాయులు పనిచేసి, ఎంతోమం ది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని అన్నారు. అంతేకాకుండా తాను పనిచేసి న ప్రతిచోట విద్యార్థుల మనసులను చూరగొని,ప్రజలతో నిరంతరం సత్సంబంధాల ను కలిగి విద్యార్థులకు కావలస...

వైద్యులకు బ్యాట్మెంటన్ పోటీలు...

Image
వైద్యులకు బ్యాట్మెంటన్ పోటీలు VS9TV న్యూస్,కర్నూలు హాస్పిటల్ : రాయలసీమ పరిధిలోని వైద్యులకు డాక్టర్స్ డే సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బ్యాట్మెంటన్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా నిర్వహించారు. పోటీలకు కర్నూలు కిమ్స్ హాస్పిటల్ సేపూరి సునీల్,ఐఎంఏ సెక్రటరీ డాక్టర్ ఎస్.వి.రామ్మోహన్ రెడ్డి,ప్రెసిడెంట్ రా మచంద్రనాయుడు హాజరయ్యారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రాయలసీమ పరిధిలోని మెన్స్ వైద్యులందరూ నేటి ఓపెన్ డబుల్స్ బ్యాట్మెం టన్ టోర్నమెంట్ లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను చాటారు.వైద్యులకు క్రీడలను ఏర్పా టు చేయడానికి కిమ్స్ హాస్పిటల్ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఈ క్రీడల వలన మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదపడుతుంది.వారి ఆరోగ్యం కొరకు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యానికి ఆనందం గా ఉందన్నారు.ప్రజల ఆరోగ్యమే కాకుండా వైద్యులు తమ తమ ఆరోగ్యాలను కాపాడు కుంటూ ప్రజలకు సేవ చేయాలని సూచించారు.ఈ షటిల్ టోర్నమెంట్ లో మొదటి స్థాన విజేతలుగా డాక్టర్ వాసురెడ్డి అమర్నాథ్ రెడ్డి నిలిచి రోలింగ్ ట్రోఫీని గెలుచుకున్నారు. ద్వి తీయ స్థాన...

స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది...మా మధ్య జరిగింది ఇదే...పూర్ణచందర్ లేఖ వైరల్...‌

Image
స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది మా మధ్య జరిగింది ఇదే పూర్ణచందర్ లేఖ వైరల్‌ VS9TV న్యూస్,హైదరాబాద్ : ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి పూర్ణచందర్ అనే వ్యక్తి ప్రధాన కారణం అని ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఆయన ప్రతిస్పందనగా ఓ ఐదు పేజీల లేఖను విడుదల చేశారు.అందులో స్వేచ్ఛ నన్ను భర్తగా ఊహించుకుంది.తమ మధ్య జరి గింది ఇదే అంటూ పూర్తి వివరాలు పొందుపరిచారు.అంతేకానీ తాను ఆత్మహత్యకు ఎలా కారణం అవుతానని ఆ రాసుకువచ్చారు. లేఖలో వివరాలు : పూర్ణచందర్ విడుదల చేసిన ఆ లేఖలో 2009 నుంచి తనకు స్వేచ్ఛతో స్నేహం ఉందని ఆయన చెప్పారు.ఈ నేపథ్యంలో స్నేహం కారణంగా ఆమె కొన్ని వ్యక్తిగత విషయాలు కూ డా తనతో పంచుకునేదన్నారు.అయితే స్వేచ్ఛకు మొదటి వివాహం అప్పటికే అయ్యిందని, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలవల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని,2017లో రెం డో వివాహం కూడా చేసుకుందని దురదృష్టవశాత్తు అతని నుంచి కూడా ఆమె విడాకులు తీసుకున్నారన్నారు.ఈ రెండు పెళ్లిళ్లతో తను ఎలాంటి సంతోషం పొందలేదని పూర్ణ చందర్ రాసుకొచ్చారు.స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పని చేస్తూ ఉండేవా రు.అన్నా వదినల సంరక్షణలోనే వాళ...

గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం...రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు...

Image
గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు VS9TV న్యూస్,కర్నూలు మండలం :  కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని మరిచిపోయిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రా ఘవేంద్ర విమర్శించారు.ఆదివారం కర్నూలు మండలం డివైఎఫ్ఐ జనరల్ బాడీ సమావే శం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగింది. స మావేశానికి హాజరైన రాఘవేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకొని సంబ రాలు చేసుకుంది తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు.కర్నూలు మండలం లో అనేక గ్రామాలు ఇబ్బందులతో సతమతమవుతున్నాయని అన్నారు.కర్నూలు జిల్లా కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉల్చాల గ్రామంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు.ఆర్.కె.దుద్యాల గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేదన్నారు.అనేక గ్రామాలలో డ్రైనేజీ సౌకర్యం లేక లక్షల రూపాయలు పెట్టి వేసిన సీసీ రోడ్లపై మురుగునీరు పారుతుందని ఆవేదన చెందారు.అనేక గ్రామాలలో రోడ్ల నిర్మాణం లేక మురికి కుంట ల్లాగా రోడ్ల పరిస్థితి ఉందన్నారు.నేట...

దేవాలయాల భూములు గోరంత కూడా అన్యాక్రాంతం కానివ్వను... అభిరుచి మధు, నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు...

Image
దేవాలయాల భూములు గోరంత కూడా  అన్యాక్రాంతం కానివ్వను ప్రధమ నంది దేవాలయం భూములు అక్రమిస్తే ఖబర్దార్ కబ్జాదారుల వెనుక పెద్దవారు,రాజకీయ శక్తులు ఉన్నా భయపడేది లేదు దేవాలయం రక్షణ గోడ నిర్మాణానికి  నా వంతు ప్రయత్నం చేస్తాను దేవాలయ సమస్యను ముఖ్యమంత్రి,  దేవాదాయ శాఖ,బిజెపి పెద్దల దృష్టికి తీసుకెళతా అభిరుచి మధు,నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు VS9TV న్యూస్,నంద్యాల ప్రతినిధి : నంద్యాల జిల్లాలో దేవాలయాల భూములు గోరంత కూడా అన్యాక్రాంతం కానివ్వనని నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు కబ్జా దారులకు ఘాటుగా హెచ్చరించా రు.ప్రథమ నంది దేవాలయం భూముల నుంచి అనుమతులు లేకుండా కొందరు స్వార్థ ప్ర యోజనం కోసం రస్తా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచార సాధనాల్లో వచ్చిన వి షయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు ఆది వారం ప్రథమ నంది దేవాలయం వద్దకు వెళ్లి ఈఓ రామానుజంతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.అంతకు ముందు దేవాలయంలో మహా పరమశివుడికి అభిషేకం చేసి స్వా మి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో దేవాల...

“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో కూటమి మోసాలను ఎండగడదాం...వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం...

Image
“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో  కూటమి మోసాలను ఎండగడదాం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం కర్నూలు నగరంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పా ర్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అధి కారంలోకి వచ్చాక మోసపూరిత పాలన సాగించడాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా రూపొందించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో”ను క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ప్రజ లకు అందించడానికి ప్రారంభించారు. “బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” అనే నినా దంతో ప్రజలలో చైతన్యం రేకెత్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవి ...

మహాన్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య...నిందితులను కఠినంగా శిక్షించాలి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)...

Image
మహాన్యూస్ పై దాడి హేయమైన చర్య నిందితులను కఠినంగా శిక్షించాలి జర్నలిజం పెరుగుతున్న దాడులు ఖండిచండి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : వాస్తవాలను ప్రసారం/ప్రచురణ చేస్తున్న జర్నలిజంపై ప్రస్తుతం దాడులు,హత్యలు,అక్రమ కేసులు వంటి వాటితో భయబ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని,ఈ నేపథ్యంలోనే హైదరాబాద్,మహాన్యూస్ కార్యాలయంపై బిఆర్ ఎస్ పార్టీ గుండాలు చేసిన దాడిని యు నైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్రంగా ఖండిస్తున్నట్లు,దాడికి పాల్పడిన గుండాలను తక్షణమే అ రెస్ట్ చేసి,కఠినంగా శిక్షించాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక సభ్యులు వి.విజ య్ కుమార్ పేర్కొన్నారు.ఈ మేరకు ఆదివారం మహాన్యూస్ పై దాడికి వ్యతిరేకంగా క ర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష,కార్యద ర్శులు విజయ్ కుమార్,మెట్రో మధు,చంద్రమోహన్,విద్యాసాగర్ ల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లతో కలిసి నిరసన కార్యక్రమం ఏర్పాటుచేశారు.కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీ లం సత్యనారాయణ,వ్యవస్థాపక నాయకులు వి.విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలకు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా ప్రజా సమ...

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకీ యత్నం...గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు...

Image
విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీకీ యత్నం గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు VS9TV న్యూస్,విశాఖ క్రైం : విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలులో కొందరు దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు.ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.దొంగతనాలకు పా ల్పడిన వారు బీహార్‌,మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్‌లుగా గుర్తించారు.వివరాల ప్రకారం ...పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం,తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆ దివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది.ఈ క్రమంలో రైల్వే పోలీసులు గా ల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.దీంతో దొంగల ముఠా పారిపోయింది.అయి తే,పిడుగురాళ్ల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్‌లు దొంగతనానికి పాల్పడుతున్నాయి.ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమాని స్తున్నారు.ఇక, వారం రోజుల వ్యవధిల ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరి గింది.తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాలిలోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు చెప్పుకొచ్చారు.

ఆన్ లైన్ మోసాలు పెరిగాయి...ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...హోంమంత్రి అనిత...

Image
ఆన్ లైన్ మోసాలు పెరిగాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి హోంమంత్రి అనిత VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : "గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌,వాట్సాప్‌ సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి.క్షణికావేశంలో వాటిని క్లిక్‌ చేస్తే మీ కష్టార్జితం మొత్తం సైబర్‌ నేరగాళ్ల పాలవుతుంది" అంటూ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అని త ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు.ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని,సాంకేతికతను మంచి కోసం ఎంతగా వాడుతున్నామో,చెడుకు కూ డా అంతేస్థాయిలో వినియోగిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో శనివారం జరిగిన 'సురక్షా 360' కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ కీ లక వ్యాఖ్యలు చేశారు.

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు...ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు...

Image
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు VS9TV న్యూస్,పెద్దపల్లి : పెద్దపల్లి,జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయంలో గురువారం జరిగిన ఏసీబీ దాడులు మర వకముందే...మరోసారి పెద్దపల్లి జిల్లా,సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి.వినోద్ విజయ్ బాధితుడి వద్దనుండి రూ.5000 లం చం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.వివరాలు ఇలా ఉన్నాయి...సుల్తానాబాద్ పట్టణానికి చెందిన ఆర్నకొండ ప్రసాద్ తన ఇంటి నంబర్ కోసం గత సంవత్సర కాలం నుండి మున్సి పల్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ... అధికారులు పట్టించుకోకపోగా,గత 15 రోజుల నుండి మున్సిపల్ ఉద్యోగులైన వినోద్,విజయ్ లను కలవగా రూ.10వేలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ.5000 లంచం ఇస్తుండగా అవినీతి నిరోధక శాఖ అధి కారులు వలపన్ని పట్టుకున్నారు.

జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసంకలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు...

Image
జిజిహెచ్ ఫార్మసిస్ట్ టోకరా...లక్షల్లో మోసం కలెక్టర్ కు పిర్యాదు చేసిన బాధితుడు VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ : కర్నూలు జిల్లా,ఎమ్మిగనూరు జిజిహెచ్‌ (ప్రభుత్వాసుపత్రి)లో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న బీ. శారద...ఎన్జీఓ పేరుతో లక్షల్లో మోసాలకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎ దుట వెలుగుచూసింది.ఈ మేరకు శనివారం బాధితుడు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశా డు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్పందన పేరుతో ఎన్జీఓని ప్రారంభిం చిన శారద...మహేంద్ర అనే వ్యక్తి ద్వారా 'సహజా శానిటరీ ప్యాడ్స్' తయారీ కేంద్రాన్ని ఎమ్మిగనూరులో స్థాపించారు.ప్రభుత్వ 'స్వేచ్ఛ' కార్యక్రమంలో భాగంగా సర్వశిక్షా అభి యాన్ ద్వారా కర్నూలు,అనంతపురం జిల్లాల్లోని పాఠశాలల బాలికలకు శానిటరీ నాప్ కిన్లు సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్నారు. ఈ వ్యాపారంలో భాగస్వామ్యం పే రుతో... కర్నూలుకు చెందిన చంద్రశేఖర్ దగ్గర రెండు లక్షలు బ్యాంకు నుండి మూడు లక్షలు నగదు రూపంలో తీసుకున్నారన్నారు."బిల్లులు వచ్చిన తర్వాత వాటా ఇస్తాను, అ సలు మొత్తం తిరిగి చెల్లిస్తాను"అని చెప్పి...ఇప్పటి వరకు ఆ మొత్తం ఇవ్వకుండా కా...

మహిళా లా స్టూడెంట్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన లా స్టూడెంట్స్ ను కఠినంగా శిక్షించాలి...భారత న్యాయవాదుల సంఘం...

Image
మహిళా లా స్టూడెంట్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన లా స్టూడెంట్స్ ను కఠినంగా శిక్షించాలి భారత న్యాయవాదుల సంఘం VS9TV న్యూస్,కర్నూలు లీగల్ : కలకత్తాలో మహిళా లా స్టూడెంట్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన లా స్టూడెంట్స్ ను కఠినంగా శిక్షించాలని భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రంగనాథ్,జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య,జిల్లా కోశాధికారి దస్తగిరి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాముడు తదితరులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడు తూ లా విద్యార్థులపై భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక మైన చర్యలు చేపట్టాలని వారు హెచ్చరించారు.అనంతరం ప్రసూన్న లా కళాశాలలో జెసి జె ఐఏఎల్ ద్వారా పరీక్ష నిర్వహించడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ శివాజీ రావు,ఐఏ ఎల్ అధ్యక్షులు కృష్ణయ్య,ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రవికాంత్ ప్రసాద్,రాష్ట్ర కార్యవర్గ స భ్యులు రాముడు,షఫీ తదితరులు పరీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఇలాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల భయం పొయ్యి పరీక్షలు ప్రశాంతంగా రాశా రన్నారు.ఈ కార్యక్రమంలో లా విద్యార్థిని,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.