పీ4 కార్యక్రమం కింద నిర్మల ఉన్నత చదువుకు సహకారం...

పీ4 కార్యక్రమం కింద నిర్మల చదువుకు సహకారం

సివిల్ సర్వీసెస్ లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తా...నిర్మల

VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :

రాష్ట్రంలోని పేద కుటుంబాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పీ4 కార్యక్రమం కింద నిర్మల విద్యార్థినికి 21 సెంచరీ ఐ.ఏ.యస్ అకాడ మీ హైదరాబాద్ వారు ఉచిత చదువు, వసతి,భోజన సదుపాయాలతో మూడు సంవత్స రాల డిగ్రీ,ఐ.ఏ.యస్ కోచింగ్ తో పాటు ఒక సంవత్సరం ప్రత్యేక అడ్వాన్స్ శిక్షణ ఇచ్చుట కు సహకారం అందించడానికి ముందుకు వచ్చింది.వివరాలు...ఆదోని మండలం,పెద్ద హ రివనం గ్రామానికి చెందిన విద్యార్థిని నిర్మలది నిరుపేద కుటుంబం...ఆమె తల్లితండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు.నిర్మల 2023లో పదవ తరగతి పరీక్షల్లో 600కు గాను 537 మార్కులు సాధించింది.అయితే పై చదువులు చదివించడానికి ఆర్ధిక స్థోమత లేక తల్లితండ్రులు బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నంచారు.విషయం తెలు సుకున్న అప్పటి కలెక్టర్ సృజన నిర్మలను చదివించేందుకు కృషి చేసి ఆస్పరిలోని కస్తూరి బా గాంధీ కళాశాలలో ఇంటర్మిడియట్ లో చేర్పించారు.ఇంటర్ లో 1000 మార్కులకు గాను 966తెచ్చుకొని ఔరా అనిపించింది.అదేవిదంగా నిర్మల ఐపిఎస్ లక్ష్య సాధనే తన జీ వితాశాయమని,అందుకు తగిన చదువుకు సహకారం అందించాలని సెట్కూరు సీఈఓ వేణుగోపాల్ ని కలిసి అభ్యర్థించింది.దీంతో ఆయన ఈ విషయాన్ని హైదరాబాద్ లోని 21వ సెంచరీ ఐ.ఏ.ఎస్ అకాడమీ వారితో మాట్లాడి నిర్మలకు పీ4 కింద ఉచిత విద్యను అందించాలని కోరారు.ఈ నేపథ్యంలో అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ నిర్మలకు డిగ్రీ ఉచి త చదువుతో పాటు,సివిల్స్ కోచింగ్, వసతి,భోజన సదుపాయం ఉచితంగా అందించేం దుకు ముందుకు వచ్చారు.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ బి.నవ్య నిర్మలను అభినంది స్తూ మంచిగా చదువుకుని ఐపిఎస్ కావాలని ప్రోత్సహించారు.ఇదేవిధంగా పీ4 కార్య క్ర మం క్రింద దాతలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా నిరుపేదలకు సహాయ సహ కారాలు అందించాలని తెలిపారు.తదుపరి ముఖ్య ప్రణాళిక అధికారిని సెట్కూర్ సీఈఓ ని వెంటనే ఈ వివరాలు మొత్తం ఆన్లైన్ లో పి4 కార్యక్రమం క్రింద నమోదు చేయించాల ని కోరారు.అనంతరం విద్యార్థిని నిర్మల మాట్లాడుతూ తన ఉన్నత చదువులకు,సహకరి స్తున్న ఎంపీ నాగరాజు,జాయింట్ కలెక్టర్,21 సెంచరీ ఐ.ఏ.యస్ అకాడమీ,సెట్కూరు సీ ఈఓ వేణుగోపాల్ లకు కృతజ్ఞతలు తెలియచేశారు.సివిల్ సర్వీసెస్ లో తప్పక ఉత్తీర్ణత సాధిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్ర దీప్ అకాడమీ డైరెక్టర్లు వరుణ్,వేణు, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్,నిర్మల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...