మహిళా లా స్టూడెంట్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన లా స్టూడెంట్స్ ను కఠినంగా శిక్షించాలి...భారత న్యాయవాదుల సంఘం...
మహిళా లా స్టూడెంట్ పై అత్యాచారం చేసి,హత్య చేసినలా స్టూడెంట్స్ ను కఠినంగా శిక్షించాలిభారత న్యాయవాదుల సంఘం
కలకత్తాలో మహిళా లా స్టూడెంట్ పై అత్యాచారం చేసి,హత్య చేసిన లా స్టూడెంట్స్ ను కఠినంగా శిక్షించాలని భారత న్యాయవాదుల సంఘం ఐఏఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రంగనాథ్,జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య,జిల్లా కోశాధికారి దస్తగిరి,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాముడు తదితరులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడు తూ లా విద్యార్థులపై భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక మైన చర్యలు చేపట్టాలని వారు హెచ్చరించారు.అనంతరం ప్రసూన్న లా కళాశాలలో జెసి జె ఐఏఎల్ ద్వారా పరీక్ష నిర్వహించడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ శివాజీ రావు,ఐఏ ఎల్ అధ్యక్షులు కృష్ణయ్య,ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రవికాంత్ ప్రసాద్,రాష్ట్ర కార్యవర్గ స భ్యులు రాముడు,షఫీ తదితరులు పరీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ ఇలాంటి పరీక్షలు నిర్వహించడం వల్ల భయం పొయ్యి పరీక్షలు ప్రశాంతంగా రాశా రన్నారు.ఈ కార్యక్రమంలో లా విద్యార్థిని,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment