నిన్ను కొట్టనురా...దయచేసి వచ్చి కలువురా...ఆర్టిస్ట్ రవిరాజ్ రాథోడ్ పై లారెన్స్ ఎమోషనల్...

నిన్ను కొట్టనురా...దయచేసి వచ్చి కలువురా
ఆర్టిస్ట్ రవిరాజ్ రాథోడ్ పై లారెన్స్ ఎమోషనల్


VS9TV న్యూస్,హైదరాబాద్ :

రాఘవ లారెన్స్ నటుడు,కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా ! లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు.సోషల్ మీడియా వేదిక గా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు.విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రవిరాజ్ రాథోడ్ను కొన్నేళ్ల కిందట లారెన్స్ దత్తత తీసుకున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్ ను చదివించాలనుకున్న లారెన్స్ తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూ ల్లో చేర్పించాడు.ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు.కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవిరాజ్ రాథోడ్ చెప్పాపెట్టకుండా స్కూ ల్ మానేసి వెళ్లిపోయాడు.తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు.పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే త ప్ప ఎవరూ దారి చూపలేదని రవి రాజ్ రాథోడ్ ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.

గుండె తరుక్కుపోతోంది : 

లారెన్స్ ను కలుద్దామంటే తిడతాడో,కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు.పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు.ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కం టపడింది.ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు.నా గుండె తరుక్కుపోతోంది.మాస్ సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను.తనను స్కూల్లో చేర్పించాను.ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది.అప్పటినుంచి కనిపించకుండా పోయాడు.తనను వెతికి పట్టుకునేందుకు ప్రయ త్నించాను,కానీ ఫలితం లేకుండా పోయింది.

ఒక్కసారి చూడాలనుంది :

ఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతు న్నాడు.నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా...నేను నిన్ను తిట్టను,కొట్టనురా...నిన్ను చూ డాలనుంది.ఒక్కసారి వచ్చి నన్ను కలువురా.నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అం టూ ఎక్స్ (ట్విటర్ ) లో చెన్నైలోని లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ ను పొందుపరిచా డు.ఇది చూసిన అభిమానులు...ఇంత మంచోడివి ఏంటన్నా...అని కామెంట్లు చేస్తున్నా రు.రాఘవ లారెన్స్...ప్రస్తుతం కాంచన - 4, బెంజ్,అధిగరం,కాల భైరవ,బుల్లెట్, హంట ర్ చిత్రాలు చేస్తున్నాడు.వీటిలో కాంచన - 4 చిత్రాన్ని ఆయనే దర్శకత్వం చేస్తున్నాడు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...