ప్రమాదకరంగా ఉన్న 11KB సర్వీస్ వైర్లను మార్పుచేయాలి...డివైఎఫ్ ఐ...

ప్రమాదకరంగా ఉన్న 11KB సర్వీస్ వైర్లను మార్పుచేయాలి
డివైఎఫ్ ఐ

 VS9TV న్యూస్,కర్నూలు కలెక్టరేట్ :

ప్రమాదకరంగా ఉన్న లెవెన్ కెబీ సర్వీస్ వైర్లను మార్పు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు.సోమవారం కర్నూల్ కలెక్టర్ కార్యా లయం ముందు డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేప ట్టారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర,నగేష్ మాట్లాడు తూ కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో ప్రమాదకరంగా లెవెన్ కెబి సర్వీసు వైర్లు ఉన్నా యని అన్నారు.మిద్దెల పైన మనిషి నిలబడితే తగిలెంత కింద వైర్లు ఉన్నాయని ఎప్పుడైనా ప్రజలకు హాని కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అనేక సంవత్సరాల క్రి తం ప్రజల వ్యతిరేకతతో సర్వీస్ వైర్లు ఏర్పాటు చేశారని తెలియజేశారు.ఆరోజు మొత్తం మట్టి మిద్దెలు ఉన్న కారణంగా సమస్య కనిపించలేదని,మట్టి మిద్దెలు ఆర్చి మిద్దెలుగా మారి నప్పటి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు.బాధిత ప్రజలందరూ పేద మ ధ్యతరగతి వారిని ఉండడానికి కాసింత స్థలం తప్ప ఎలాంటి ఆధారంలేని ప్రజలని తెలి యచేశారు.కుటుంబాలు పెరిగాయని కొడుకులకు కూతుర్లకు పెళ్లిళ్లు చేశాము. ఉండే ఇ ల్లు సరిపోవటం లేదు.పైన ఒక రూమ్ కడదామంటే కూడా అవకాశం లేదని గ్రామ ప్రజలు బాధపడుతున్నారని తెలియజేశారు.శుభకార్యాలు జరిగినప్పుడు ఇంటి ముందు స్థలం లే క పైన ఏర్పాట్లు చేసుకోవడానికి ఎలాంటి అవకాశం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతు న్నామని తెలియజేశారు.వర్షాకాలం ప్రారంభమైతే ఇళ్లకు ఆనుకుని ఉన్న తీగలు ఇల్లంతా షాకు వస్తుందని తెలియజేశారు.ఇంటి నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు.ఈ సమస్యపై అనేకసార్లు అధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోలేద ని అన్నారు.అందుకోసమే నేడు గ్రామప్రజలతో కలిసి ఆందోళన చేశామని ప్రభుత్వం స్పం దించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.అనంతరం ప్రజా పరి ష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ నవ్యకి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సి ఐటియు నాయకులు హుస్సేనయ్య,డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ బాషా, నాయకులు హరి,కిషన్ రెడ్డి,విశ్వనాథ్,రఘువరన్, గోవర్ధన్,గ్రామ ప్రజలు ఇబ్రహీం వెంక టేశ్వర్లు,షాలుబాషా,శ్రీరాములు,దామోదర్,మద్దిలేటి,పెద్దనాగన్న,వలి,భాష,తదితరులుపాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...