సిగాచీ కెమికల్ పరిశ్రమలో దారుణ ఘటన...రియాక్టర్ బ్లాస్ట్ లో 12కి చేరిన మృతులు,26మందికి గాయాలు...
సిగాచీ కెమికల్ పరిశ్రమలో దారుణ ఘటనరియాక్టర్ బ్లాస్ట్ లో 12కి చేరినమృతులు,26మందికి గాయాలువంద మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ కార్మికులుకుప్పకూలిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్సీఎం రేవంత్,కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతి
పాశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి 8మంది దుర్మరణం పాల య్యారు.26మంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.స్పాట్ లో ఆరుగురు మృతి చెందారు.ఇద్దరు చికిత్స పొందు తూ కన్ను మూశారు.పేలుళ్ల ధాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్ప కూలింది.ప్రమాదంలో చి క్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.ఎనిమిది ఫైర్ ఇం జిన్లు వచ్చి మంటలు ఆర్పేస్తున్నాయి.రసాయనాలు కాలిపోతుండటంతో ఆ ప్రాంతంలో ద ట్టమైన పొగలు అలుముకున్నాయి.ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్,మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో గాయ పడ్డ వారికి మెరుగైన చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి అధికారులను ఆదేశించారు.ఐజీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ను పర్యవేక్షిస్తున్నారు.గాయపడ్డ 26 మందిలో కొందరు సీరియస్ గా ఉన్నారని చెప్పా రు.మొత్తం షిప్ట్ లో 150మంది కార్మికులు ఉన్నట్టు చెబుతున్నారని వివరించారు.రెండ వబ్లాక్ ను ఓపెన్ చేస్తున్నామని,అందులో ఎవరైనా ఉన్నారా...? అనేది చూడాలని ఐజీ తెలిపారు.సంఘటన స్థలానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేరుకున్నా రు.పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉం ది.ఐజీ సత్యనారాయణ కథనం ప్రకారం ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు.మరో 26మంది గాయపడ్డారు.వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలు స్తోంది.మొత్తం షిప్ట్ లో 150మంది కార్మికులు పనిచేస్తున్నారని చెబుతున్నారు.వారిలో 32మందికి సంబంధించిన వివరాలు మాత్రమే బయటికి వచ్చాయి.మిగతా 118మంది త ప్పించుకున్నారా...? లేక రెండో బ్లాక్ లో ఉన్నారా.? అనేది తెలియాల్సి ఉంది.అడ్మిన్ బ్లాక్ పూర్తిగా కుప్పకూలడం,రసాయన పదార్థాలు దగ్ధమవుతుండటంతో ఘాటైన వాసన లు,దట్టమైన పొగలతో ఆ ప్రాంతంలో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.స్థానికులు కూడా ఇ బ్బంది పడుతున్నారు.
Comments
Post a Comment