మీకో దండం...మీ బీజేపీ పార్టీకో దండం...బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా....

మీకో దండం...మీ బీజేపీ పార్టీకో దండం
బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా

VS9TV న్యూస్,హైదరాబాద్ :

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది.గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రక టించారు.చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన...కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అ సంతృప్తితో ఉన్నా,బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నా.కానీ,నా మద్దతు దారుల్ని బెదిరించారు.నామినేషన్‌ వేయడానికి వస్తే...వేయనివ్వలేదు.వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు.అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా.రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనా మా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్‌ సభ్యులు కూడా రాజీనా మా చేశారు.రాజాసింగ్‌ మా పార్టీ సింబల్‌ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాద ని,సస్పెండ్‌ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రా వాలని ఎంతో పోరాడాం.కానీ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరు కుంటున్నారు.బీజేపీ కోసం సర్వం ధారపోశాను.నేను,నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌ లో ఉన్నాం.పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?.అందుకే పార్టీకి లవ్‌ లెటర్‌ ఇచ్చి వెళ్తున్నా.మీకో దండం...మీ పార్టీకో దండం...లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబిం బించే రాజీనామా ఇది (అంటూ లేఖను చూపించారాయన).బీజేపీకి రాజీనామా చేసి నా...హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్‌ ప్రకటించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...