విద్యారంగానికి పరమేశ్వర్ రెడ్డిచేసిన సేవలు మరువలేనివి...ఎస్.శామ్యూల్ పాల్,జిల్లా విద్యా శాఖధికారి...

విద్యారంగానికి పరమేశ్వర్ రెడ్డి
చేసిన సేవలు మరువలేనివి
ఎస్.శామ్యూల్ పాల్,జిల్లా విద్యా శాఖధికారి

VS9TV న్యూస్, కర్నూలు ఎడ్యుకేషన్ :

వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పర మేశ్వర రెడ్డి 35 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చెందడం గర్వకారణమని జిల్లా వి ద్యాశాఖ అధికారి ఎస్.శామ్యూల్ పాల్ అన్నారు.ఆదివారం కర్నూలులోని కేశవ గ్రాండ్స్ నందు ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన గోనె గండ్ల మండలం,కున్నూరు గ్రామం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానో పాధ్యాయు లుగా పనిచేస్తన కె.పరమేశ్వర్ రెడ్డి పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది.కార్యక్ర మానికి జిల్లా విద్యాశాఖ అధికారి హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ పరమేశ్వర్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘకాలం పాటు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యా యులుగా,గణిత ఉపాధ్యాయులుగా, గ్రేటు 2 ప్రధానోపాధ్యాయులు పనిచేసి, ఎంతోమం ది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారని అన్నారు. అంతేకాకుండా తాను పనిచేసి న ప్రతిచోట విద్యార్థుల మనసులను చూరగొని,ప్రజలతో నిరంతరం సత్సంబంధాల ను కలిగి విద్యార్థులకు కావలసిన ప్రాథమిక అవసరాలను తీర్చుతూ విద్యాభివృద్ధికి ఆయన చే సిన సేవలు మరువలేనివని చెప్పారు.ఎస్ టియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎస్.గోకారి,టి.కె.జనార్దన్లు మాట్లాడుతూ నీతి,నిజాయితీ,నిబద్ధత,సమయ పాలన,వృతి పట్ల అంకితభావంతో ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉన్న తంగా తీర్చిదిద్దారన్నారు. తదనంతరం దంపతులిద్దరిని ఘనంగా సన్మానించారు.సన్మాన గ్రహీత కె.పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వృత్తిపట్ల అంకితభావంతో పనిచేసినప్పుడే సమా జంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు.
విద్యార్థులు వారి తల్లి,దండ్రులతో నిరంతరం సత్సంబంధాలను కలిగి ఉండాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నారాయణ,రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మాజీ పూర్వ ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న,ప్ర ధానోపాధ్యాయుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఓంకార్, ప్రధానోపాధ్యాయులు శివ రామకృష్ణ,మధుసూదన్ శర్మ,రామచంద్రారెడ్డి,ఉపాధ్యాయులు బంధుమిత్రులు తదితరు లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...