భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి...గౌస్ దేశాయ్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు...
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
గౌస్ దేశాయ్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు
ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు ) ఓల్డ్ సిటీ కమిటీ మూడవ నగర మహాస భ సుర్జీత్ భవన్ నందు భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ అధ్యక్షతన సోమవారం జరిగింది.కార్యక్రమానికి కార్మికశాఖ నుండి ఏఎల్ఓలు హేమద్రి, షామీర్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి కార్మికుడు శ్రామిక కార్డు కలిగి ఉండాలని భవన నిర్మా ణ సంక్షేమ బోర్డును సంక్షేమ పథకాలను ప్రభుత్వం త్వరలో అమలు చేసే ప్రయత్నం జరు గుతుందని,పెండింగ్ క్లైమ్ లన్ని త్వరగా పూర్తిచేస్తామని చెప్పారు.ఆతరువాత సిఐటియు జెండాను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్,నగర ఉపాధ్యక్షు లు రాజశేఖర్,సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాంజనేయులు,బిల్డింగ్ వ ర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి కాజా పాషా మాట్లాడుతూ భవన నిర్మాణ కా ర్మికుల సంక్షేమబోర్డు కోసం కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.భవన ని ర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కోసం చాలా కాలం నుండి పోరాటం చేస్తే 1960లో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తే మనకు కేంద్రం రాష్ట్రంలో వామపక్ష పార్టీ ల సహకారంతో ఏర్పడిన యూపీఏ వన్ గవర్నమెంట్ ఉన్నందున మన రాష్ట్రంలో 2005 వ సంవత్సరంలో అమలు చేయడం జరిగింది.ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వా లు వారి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సంక్షేమ బోర్డును ఖాళీ చేశారని కార్మికులను మోసం చేశారని విమర్శించారు.అధికారం కోసం ప్రజా సంకల్పయాత్ర పేరు మీద పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి కార్మికులకు న్యాయం చేస్తానని,వారి హక్కులు కాపాడతానని నమ్మబలికి అధికారం చేపట్టిన తర్వాత ఇసుక బ్యాన్ చేసి కార్మికుల కడు పు కొట్టారని అన్నారు.ఉపాధి కోల్పోయిన కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక ఆ త్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.అవినీతి చేసిన వారు ఎవరు జైలుకి వెళ్ళలేదుగా ని,నమ్మి ఓట్లు వేసిన భవన నిర్మాణ కార్మికులు మాత్రం కుటుంబాలతో రోడ్డున పడ్డారని తె లిపారు.జీఓ నెంబర్ 17తెచ్చి కార్మికులను మోసం చేయడమే కాకుండా 1214సర్కులర్ ని తెచ్చి సంక్షేమ బోర్డులో ని ఉన్న కార్మికుల కష్టార్జితాన్ని దోచుకున్నారని,కార్మిక హక్కు లను కాలరాస్తూ కరోనా టైంలో కూడా కార్మికులపై కరుణ చూపకుండా మోసం చేశారని అగ్రహం వ్యక్తం చేశారు,జగన్ గవర్నమెంట్ మోసం చేసినందని,సంక్షేమ బోర్డును పున రుద్ధరిస్తానని నమ్మించి ఓట్లు వేయించుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సంవత్స రం పూర్తి చేసుకుని సంబరాలు జరుపుకున్నారు.కానీ సంక్షేమ బోర్డును పునరు ద్ధరించ లేదని తెలిపారు.చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పటి నుండి కార్మికుల పక్షాన కాకుండా పెట్టుబడిదారులే నిజమైన ఉత్పత్తి దారులని కార్పొరేట్ ల పెట్టుబడిదారుల జీత గాడిలాగా వారి కోసం ఉద్యోగంలో ఉన్నారని,అందుకనే గతంలో కూడా యూజ్ఆఫ్ డూ యింగ్ బిజినెస్ అని, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే చిలక పలుకులు పలు కుతున్నారని విమర్శించారు.మహిళా కార్మికులను కోటీశ్వరులను చేస్తానని పి4 పద్ధతిని అందుకే అమలు చేస్తానని,కార్పొరేట్ లకు పారిశ్రామికవేత్తలకు లాభాలు వచ్చే రకంగా వి ధానాలను అమలు చేస్తూ, కార్మిక చట్టాలను రద్దుచేసి,కార్మిక కోడ్లను అమలు చేయాలని చూస్తున్న మతోన్మాద కార్పొరేట్ బిజెపి ప్రభుత్వం కనుసన్నల్లో పరిపాలన చేయడం బా ధాకరమన్నారు.అందుకే భవన నిర్మాణ కార్మికులు ఇట్లాంటి మోసపూరితమైన ప్రభుత్వాల అబద్ధపు మాటలు నమ్మకుండా ఐక్యమత్యంతో చైతన్య పూర్వకంగా సంక్షేమ బోర్డు పున రుద్ధరణ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.అందుకనే కూటమి ప్రభుత్వం గతం నుండి వాడుకున్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను జమ చేసి,భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదవశాత్తు జరిగిన మరణానికి రూ.10లక్షలు,సహజ మరణానికి ఐదు లక్షలు,పెళ్లికి రెండు లక్షలు,కాన్పులకు లక్ష,ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా వైద్యాన్ని అం దిస్తూ,60సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి భవన నిర్మాణ కార్మికునికి రూ.10వేలు పె న్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయాలని వారికి పిలుపునిచ్చారు.
ఆ తర్వాత నూతన కమిటీ భవన నిర్మాణ కార్మిక సంఘం నగర అధ్యక్షులుగా సి.నాగరా జు,నగర ప్రధాన కార్యదర్శిగా కాజా పాషా,నగర ఆఫీస్ బెరర్స్ గా అబ్దుల్ దేశాయ్,మా బుసా,షేక్షావలి,ఇమాం,మూస,లక్ష్మన్న,ఇర్ఫాన్,సామేలు,షేకమాద్,ఖలీల్,గౌస్,ముత్తు,కాలే,కమిటీల అధ్యక్ష కార్యదర్శులు నగర కమిటీ సభ్యులుగా ఎన్నికకావడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటి నగర్ ఆఫీస్ బేరర్స్ మైమూద్, రామకృష్ణ,220మంది భవన నిర్మా ణ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Post a Comment