తక్కువ ధరకు బంగారు ఇస్తామని నమ్మించి మోసం చేసిన నిందితులు అరెస్ట్...పలు వస్తువులు స్వాదీనం,రెండు ఇళ్ళు సీజ్... బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ...
తక్కువ ధరకు బంగారు ఇస్తామని నమ్మించిమోసం చేసిన నిందితులు అరెస్ట్పలు వస్తువులు స్వాదీనం,రెండు ఇళ్ళు సీజ్బాబు ప్రసాద్,కర్నూలు డిఎస్పీ
విజయవాడ,భద్రి హైట్స్,సూర్యరావు పేటకు డా.రాజేంద్ర ప్రసాద్ (55) అనే వ్యక్తిని తక్కు వ దరకు బంగారము ఇస్తామని చెప్పి నమ్మించి వద్ద నుండి సుమారు రూ.7.32కోట్లు నగదు రూపం,అలాగే బ్యాంక్ ద్వారా తీసుకున్నారని, నిలదీసి అదిగినందుకు ముద్దాయి లు తనని బెదిరించి 2025 సంవత్సరంలో మార్చి నెల,మొదటి వారంలో కర్నూలు పావని లాడ్జ్ లో ఉండగా నిందితులు పోతురాజు రతన్ కుమార్,జస్వంత్, వసంత్,విశ్వనాధ్,దే వరకొండ సుధీర్, పీటర్ పాల్,శివకుమార్ రెడ్డిలు చంపుతామని బెదిరించి తన వద్ద నుం డి బలవంతంగా మరో రూ.50 వేలు తీసుకున్నారని కర్నూలు నగరం మూడవ పట్టణ పో లీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ బాబుప్రసాద్ సహకారంతో ఈ నెల 18వ తేదీన కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా నిందితులు నెల్లూరు జిల్లా,కావలి,వెంగళరావు నగర్ కు చెందిన పోతురాజు రతన్ కుమార్,కట్ట శ్రీకాంత్ @ విశ్వనాథ్ పోతూరాజు శాంతి పవన్ కు మా ర్ @ వసంత్, పోతూరాజు శాంతి పవన్ కుమార్ @ వసంత్,కొవ్వూరు,బుచ్చిరెడ్డి పా లెం మండలం,రామకృష్ణ నగర్ కు చెందిన పాలకీర్తి జస్వంత్ లను అరెస్ట్ చేసినట్లు మూ డవ పట్టణ సిఐ శేషయ్య పేర్కొన్నారు.సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో డిఎస్పీ బాబు ప్రసాద్ వివరాలు వెల్లడించారు.రాబడిన సమాచారం మేరకు నిందితు లు నెల్లూరు జిల్లా,కావలిలో వున్నట్లు తెలిసిందన్నారు.
దీంతో సిఐ శేషయ్య,సిబ్బందితో కలిసి ఎ5 ముద్దాయి దేవరకొండ సుధీర్ ఇంటికి వెళ్లిన ట్లు చెప్పారు.తాము వస్తున్న సమాచారం తెలుసుకుని దేవరకొండ సుధీర్,పీటర్ పాల్,శి వకుమార్ రెడ్డిలు అక్కడి నుండి పరారైనట్లు పేర్కొన్నారు.ఆ ఇంటి పరిసరాలు పరిశీలిం చగా ఇంటి నుండి తప్పించుకుపో వటానికి నాలుగు దారులు ఉన్నట్లు తెలిసిందన్నారు. పూర్తి స్థాయి విచారణ కోసం స్థానిక తహసీల్దార్ ను సహకారం కోరగా ఇద్దరు విఆర్ ఓల ను తమకు కేటాయించడం జరిగింది. వారి ద్వారా ఇంటిని సోదా చేయగా ఇంటిలో క్యాష్ కౌంటింగ్ మిషన్-2,పోలీస్ లారీలు-2,హ్యాండ్ కప్స్ విత్ కీ-1,పెద్ద కత్తి-1,నకుల్ డస్టర్స్-2,సెల్ ఫోన్స్-5,హెచ్ పి ల్యాప్ టాప్,వాకి టాకీలు-2,పోలీస్ యూనిఫార్మ్స్-2, రూ.40వేలు నగదు,బొలెరో వాహనం స్వాదినం చేసుకున్నాం,అలాగే వారి స్వాదినంలో ఉన్న రెండు ఇళ్లు సీజ్ చేసినట్లు తెలిపారు.అదేవిధంగా నిందితులు సోమవారం కర్నూలు నగరం,దేవనగర్,ఎంఎస్ - 9 లాడ్జి,రూం నంబర్ - 201లో ఉన్నట్లు సమాచారం తెలి యడంతో సిబ్బంది సహాయంతో నిందితులను అరెస్ట్ చేసి,వారి నుండి నాలుగు చిన్న ఫో న్స్,మూడు స్మార్ట్ ఫోన్స్,బంగారము బిస్కెట్స్-31,రూ.6.00లక్షలు నగదు,మూడు కా ర్లు స్వాదినం చేసుకున్నట్లు పేర్కొన్నారు.తదుపరి విచారణ నిమిత్తం నిందితులను రిమాం డ్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో మూడవ పట్టణ ఎస్సైలు,కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
Comments
Post a Comment