“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో కూటమి మోసాలను ఎండగడదాం...వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం...

“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో 
కూటమి మోసాలను ఎండగడదాం
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృతస్థాయి సమావేశం

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం కర్నూలు నగరంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పా ర్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అధి కారంలోకి వచ్చాక మోసపూరిత పాలన సాగించడాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా రూపొందించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో”ను క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ప్రజ లకు అందించడానికి ప్రారంభించారు. “బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” అనే నినా దంతో ప్రజలలో చైతన్యం రేకెత్తించాలని పిలుపునిచ్చారు.
అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవి కాని హామీలతో ప్రజలను నమ్మించార ని,ఇంటింటికీ హామీల బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చారని,కానీ ఒక్క హామీకి కూ డా న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, హామీలు నెరవేర్చమంటే మక్కలు విరగ్గొడతామంటున్న పవన్ కళ్యాణ్‌కు ప్రజలే గట్టి సమా ధానం చెబుతారన్నారు.జిల్లా అధ్యక్షులు ఎస్.వి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక్కో ఇంటి కీ రూ.2.40లక్షలు జమ అవుతాయంటూ బాండ్లు ఇచ్చిన చంద్రబాబు,పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.కొత్త పరిశ్రమలు వచ్చాయంటూ పచ్చ పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ వేయించుకున్నారని,వాస్తవా నికి ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని నిలదీశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...