దేవాలయాల భూములు గోరంత కూడా అన్యాక్రాంతం కానివ్వను... అభిరుచి మధు, నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు...

దేవాలయాల భూములు గోరంత కూడా 
అన్యాక్రాంతం కానివ్వను
ప్రధమ నంది దేవాలయం భూములు అక్రమిస్తే ఖబర్దార్
కబ్జాదారుల వెనుక పెద్దవారు,రాజకీయ శక్తులు ఉన్నా భయపడేది లేదు
దేవాలయం రక్షణ గోడ నిర్మాణానికి 
నా వంతు ప్రయత్నం చేస్తాను
దేవాలయ సమస్యను ముఖ్యమంత్రి, 
దేవాదాయ శాఖ,బిజెపి పెద్దల దృష్టికి తీసుకెళతా
అభిరుచి మధు,నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు

VS9TV న్యూస్,నంద్యాల ప్రతినిధి :

నంద్యాల జిల్లాలో దేవాలయాల భూములు గోరంత కూడా అన్యాక్రాంతం కానివ్వనని నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు కబ్జా దారులకు ఘాటుగా హెచ్చరించా రు.ప్రథమ నంది దేవాలయం భూముల నుంచి అనుమతులు లేకుండా కొందరు స్వార్థ ప్ర యోజనం కోసం రస్తా నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచార సాధనాల్లో వచ్చిన వి షయం తెలిసిందే.ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు ఆది వారం ప్రథమ నంది దేవాలయం వద్దకు వెళ్లి ఈఓ రామానుజంతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.అంతకు ముందు దేవాలయంలో మహా పరమశివుడికి అభిషేకం చేసి స్వా మి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో దేవాలయాలకు సంబంధించిన భూములు కోట్లు విలువచేస్తాయని అన్నారు.నంద్యాల జిల్లా కావడంతో కబ్జా దారుల క న్ను దేవాలయాల భూములపై పడిందన్నారు. నంద్యాల జిల్లాలో దేవాలయాల భూములు గోరంత అన్యాక్రాంతం కానివ్వను అని కబ్జాదారుల తనదైన శైలిలో ఘాటుగా హెచ్చరిం చారు.ప్రచార మాధ్యమాల్లో శనివారం ప్రథమ నంది దేవస్థానంకు చెందిన భూమి నుంచి అనుమతి లేకుండా కొందరు స్వార్థపరులు రస్తా నిర్మాణం చేపడుతున్నారని సమాచారం వచ్చిందన్నారు.ఇందుకోసం ప్రథమ నంది దేవాలయంకు ఈఓ రామానుజంతో కలిసి పరి శీలించానని అని చెప్పారు.నవనందులలో ప్రదమానంది దేవాలయం ఎంతో చారిత్రాత్మ కమైన దేవాలయం అన్నారు.నవ నందులు కొలువైన ప్రాంతం కావడంతో నంద్యాలకు ఈ పేరు వచ్చిందని పేర్కొన్నారు.దేవాలయంకు భూమి ఎక్కువగా ఉండడంతో కొందరు స్వా ర్థపరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అర్ధరాత్రి జేసిబిలు తీసుకొచ్చి రాస్తా ఏర్పాటుచే సేందుకు ప్రయత్నం చేయడం ఈఓ పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు రంగప్రవే శం చేయడంతో కబ్జా దారులు వెళ్ళి పోయారన్నారు.దేవాలయం సంబంధించి భూమిని 1946లో శంకరమ్మ అనే మహిళా కొందరికి రాస్తా హక్కులు రాసిచ్చినట్టు కొందరు దొం గ పత్రాలు సృష్టించారని అన్నారు.ఇరువర్గాలు కోర్టుకు వెళ్లడంతో కోర్టులో 1990లో రా స్తా హక్కులు చెల్లవని తీర్పు ఇచ్చారని అన్నారు.న్యాయస్థానం తీర్పును గౌరవించకుండా కొందరు కబ్జాదారులు రాస్తా ఏర్పాటుకు ప్రయత్నం చేశారన్నారు.ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి,దేవాదాయ శాఖ,జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొని వెళతానన్నా రు.కుట్రదారుల వెనుక పెద్ద మనుషులు,రాజకీయ శక్తులు,ఎంతటి పెద్దవారు ఉన్నా బయ టపడే పరిస్తితి లేదని హిందూ దేవాలయాల భూములు కాపాడుకుంటామని పేర్కొన్నా రు.రాస్తా హక్కులు ఎవరికైనా ఉంటే మున్సిపల్, రెవెన్యూ,దేవాదయ శాఖ అధికారుల నుంచి అనుమతి ఉంటే చూపించాలన్నారు.గతంలో దేవాలయం చుట్టూ రక్షణ గోడ ని ర్మాణానికి నిధులు మంజూరైన,ప్రస్తుతం ఆగిపోవడం విశేషం అన్నారు.దేవాలయం చు ట్టూ రక్షణ గోడ నిర్మాణ పనులు జరిగే విధంగా ముఖ్యమంత్రి,దేవాదాయ శాఖ,బిజెపి పె ద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి రక్షణ గోడ నిర్మించేందుకు నా వంతు ప్రయత్నం చేస్తానన్నా రు.నంద్యాల జిల్లాలో ఎక్కడైనా దేవాలయాల భూములు ఆక్రమించాలని చూస్తే బిజెపి శ్రే ణులు,హిందూ సంఘాలు సంయుక్తంగా పోరాటాలు చేయడానికి సిద్ధమన్నారు.జిల్లాలో దేవాలయాల భూముల జోలికి వస్తె ఎంత పెద్దవారైనా,రాజకీయ శక్తులకైనా న్యాయప రంగా పోరాడి హిందూ దేవాలయాల భూములు కాపాడుకుంటామని పేర్కొన్నారు.జిల్లా లో దేవాలయాల భూములు ఆక్రమణలకు గురైతే మా దృష్టికి తీసుకొని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్నేహా వృద్ధాశ్రమం నిర్వాహకులు స్వామిరెడ్డి,బాలన్న తదితరులు పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...

శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ హను మాన్ జయంతి వేడుకలు...టి.వాసంతి,ట్రస్ట్ చైర్మన్...

బహుజన్ సమాజ్ పార్టీ నూతన కర్నూలు సిటీ కన్వీనర్ నియామకం...