గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం...రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు...

గ్రామీణ అభివృద్ధిని మరిచిన కూటమి ప్రభుత్వం
రాఘవేంద్ర,డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు

VS9TV న్యూస్,కర్నూలు మండలం : 

కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని మరిచిపోయిందని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రా ఘవేంద్ర విమర్శించారు.ఆదివారం కర్నూలు మండలం డివైఎఫ్ఐ జనరల్ బాడీ సమావే శం డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులు సురేష్ అధ్యక్షతన జరిగింది. స మావేశానికి హాజరైన రాఘవేంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకొని సంబ రాలు చేసుకుంది తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదని అన్నారు.కర్నూలు మండలం లో అనేక గ్రామాలు ఇబ్బందులతో సతమతమవుతున్నాయని అన్నారు.కర్నూలు జిల్లా కేం ద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఉల్చాల గ్రామంలో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని చెప్పారు.ఆర్.కె.దుద్యాల గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం లేదన్నారు.అనేక గ్రామాలలో డ్రైనేజీ సౌకర్యం లేక లక్షల రూపాయలు పెట్టి వేసిన సీసీ రోడ్లపై మురుగునీరు పారుతుందని ఆవేదన చెందారు.అనేక గ్రామాలలో రోడ్ల నిర్మాణం లేక మురికి కుంట ల్లాగా రోడ్ల పరిస్థితి ఉందన్నారు.నేటికీ నందనపల్లె,భూపాల్ నగర్,నూతన పల్లె ప్రజలు చెరువు గట్టున మనిషి చస్తే పూడ్చుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.కనీసం వీధి లైట్లు కాలి పోతే వేసే పరిస్థితి కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే యువతకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని తెలియజేశారు. ఇలా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సంవత్సర కాలం సందర్భంగా అనేక సమస్యలు పరిష్కారం చేశాం. ఇచ్చిన హామీలు అమలు చేశామని సంబరాలు ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు.వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయా లని,చేయకపోతే పెద్దఎత్తున డివైఎఫ్ఐ యువజన సంఘం ఆందోళనకు దిగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి ప్రకాష్,మండల నాయ కులు హరి,కిషన్ రెడ్డి,రాజు,దివాకర్,గోవర్ధన్,ప్రశాంత్,రోహిత్,రఘువరన్,వివిధ గ్రామా ల యువకులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...