ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి... రా జకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవ గాహన...కర్నూలు నియోజకవర్గ ఆర్వో,కమిషనర్ పి.విశ్వనాథ్...

ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతానికి సహకరించాలి
రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన
కర్నూలు నియోజకవర్గ ఆర్వో,కమిషనర్ పి.విశ్వనాథ్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేయడానికి రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి,నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు.మంగళవారం వెంకటరమణ కాలనీలోని న గరపాలక కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను సమగ్రంగా పరిశీలించి సవరించే ప్రత్యేక ప్రక్రియగా ఆర్వో వివరించారు.అర్హులైన ప్రతి ఓ టరు పేరు జాబితాలో ఉండేలా చేయడం,మరణించిన వారు,డూప్లికేట్ పేర్లు తొలగిం చ డం,చిరునామా మారిన ఓటర్ల వివరాలు సరిచేయడం,కొత్తగా అర్హత పొందిన యువ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ విధంగా రూపొందే ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా ఉండడం ద్వారా ప్రజాస్వామ్య వ్య వస్థ మరింత బలోపేతం అవుతుందని ఆర్వో పేర్కొన్నారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధిం చి ప్రజల్లో ఏర్పడే సందేహాలు,అపోహలను రాజకీయ పార్టీల ప్రతినిధుల సలహా సూచన లతో నివృత్తి చేసి,ఎన్నికల సంఘం అందించిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజ ల్లోకి తీసుకెళ్లేలా సమన్వయంతో ప్రచారం చేయాలని సూచించారు.ప్రతి అర్హుడైన పౌరు డు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించడం అందరి బాధ్యత గా పేర్కొన్నారు.బూత్ స్థాయి అధికారులు ఓటిపిలు అడగరని,గుర్తింపు కార్డుతోనే ఇంటిం టికీ వచ్చి ధృవీకరణ చేపడతారని స్పష్టం చేశారు.ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తామని,బీఎల్‌వోలు ప్రజల వద్దకు వచ్చినప్పుడు సహకరించేలా రాజ కీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని ఆర్వో కోరారు.ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ,ఎస్‌ఈ రమణమూర్తి,తహశీల్దార్ రవికుమార్,డిప్యూటీ సిటి ప్లాన ర్ వై.వెంకటరమణ,డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ,ఎలక్షన్స్ సూపరింటెండెంట్ సుబ్బ న్న తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...