నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి... లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి... ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి... నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

నీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వర్తించాలి
లీకేజీలు గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలి
ప్రతిరోజు తాగునీటి నాణ్యతలను తనిఖీ చేయాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
తాగునీటి వ్యవస్థను సమర్థవంతంగా నిర్వ హించడానికి ఇంజినీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ,తాగునీటి సరఫరా విభాగ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని నగరపా లక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు.గురువారం ఆయన క్యాంపు కార్యాల యంలో ఇంజినీరింగ్ విభాగ అధికారులతో పాటు జూమ్ ద్వారా అమినిటీస్ కార్యదర్శుల తో తాగునీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు.నగర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అం దించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వ కూడదని స్పష్టం చేశారు.అతిసారం ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ప్రతి రోజు ఉదయం అన్ని సచివాలయాల పరిధి లో అమినిటీస్ కార్యదర్శులు,తాగునీటి సరఫరా సిబ్బంది సంయుక్తంగా క్లోరిన్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి ట్యాంకులను శుభ్రప ర చాలని,ఆర్‌సి రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహిం చాలని ఆదేశించారు.పైప్‌లైన్ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలన్నారు.డ్రైనేజీ కాలువల్లో ఉన్న పైప్‌లైన్ల తొలగిం పులో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు.గృహాల వద్ద సైతం డ్రైనేజీ కాలువల్లో పైప్‌లైన్ లేకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రజల నుండి ఫిర్యాదులు,పత్రిక ల్లో వార్తలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా సమస్యలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.ప్రతి రోజు ప్రజల్లో తిరిగితేనే సమస్యలు స్పష్టంగా తెలుసుకుంటామని,ఏ ఈ లు,డిఈలు అమినిటీస్ కార్యదర్శులతో కలిసి ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూ చించారు.తాగునీటి కొళాయి చార్జీల వసూళ్లను వేగవంతం చేయాలని,నిధుల లభ్యతను బట్టి గుత్తేదారులకు బిల్లులు మంజూరు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్ఈ రమణ మూర్తి,ఎంఈలు మనోహర్ రెడ్డి,గిరిరాజ్,డిఈఈలు ప వన్ కుమార్ రెడ్డి,నరేష్,క్రిష్ణలత,శ్రీనివాసన్,సూపరింటెండెంట్ మంజూర్ బాష,ఏఈలు జ నార్ధన్,ప్రవీణ్ కుమార్ రెడ్డి,వైష్ణవి,ఖాసీం,మహేష్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...