ముగ్గురు వ్యక్తులపై కత్తులు,కర్రలతో దాడి... ఆపేందుకు వెళ్లిన వ్యక్తి మృతి...
ముగ్గురు వ్యక్తులపై కత్తులు,కర్రలతో దాడిఆపేందుకు వెళ్లిన వ్యక్తి మృతి
కర్నూలు నగరం,పాతబస్తీ ఖండేరి వీధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుం ది.అన్నదమ్ములు ముగ్గురిపై దుండగులు కత్తులు,కర్రలతో దాడి చేయగా వారిలో మనోహ ర్ (35) తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన జరిగిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...గత ఎన్నికల సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్థలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పాతబస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న అనిల్ బార్ వద్ద విజయ్,మారుతి కలసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో తెలుగు రాజు,తెలుగు నగేష్,ఎరుకలి రాముడు కల సి మారుతిని దూషించడంతో ఘర్షణ తలెత్తింది.అక్కడున్న వారు సర్దిచెప్పడంతో ఎవరికి వారు ఇంటికి వెళ్లి అర్ధరాత్రి మళ్లీ ఫోన్ చేసుకుని దూషించుకున్నారు.పాతబస్తీలోని ఖం డేరి వీధి ఐటీఐ సెంటర్ వద్దకు ఆటోలో చేరుకుని విజయ్,మారుతిపై ప్రత్యర్థులు దాడి చే స్తుండగా అక్కడే నివాసముంటున్న మనోహర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారించే ప్ర యత్నం చేశాడు.తెలుగు రాజు,తెలుగు నగేష్,ఎరుకలి రాముడు అతనిపై కూడా దాడి చే శారు.ఈ దాడిలో ముగ్గురు తీవ్ర గాయాలకు గురికాగా మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా,విజయ్,మారుతి స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్నారు.మృతుడు బ్యాంకు లోన్ రికవరీ గ్రూప్లో సభ్యుడిగా పనిచేస్తున్నాడు.విష యం తెలిసిన వెంటనే ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దు మణిగేలా చేసి మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రా సిటీ,30 2,324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Post a Comment