చౌరస్తా బైపాస్ విస్తరణ వేగవంతం...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్...

చౌరస్తా బైపాస్ విస్తరణ వేగవంతం
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్ :
కర్నూలు నగరంలోని చౌరస్తా బైపాస్ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేసి ఆర్టీసీ బస్సుల రాకపోకలకు సౌలభ్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సం స్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు.నగరంలోని బళ్ళారి చౌరస్తా బైపాస్ వద్ద మలుపు ప్రాంతంలో ఉన్న మరో రెండు షాపులను తొలగించి రహదారి విస్తరణ పనులు చేపట్టను న్నట్లు వెల్లడించారు.మంగళవారం ఆయన సంబంధిత ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలిం చి అధికారులకు దిశానిర్దేశం చేశారు.పోలీస్ శాఖ అనుమతులు పొందిన అనంతరం తొ లగింపు చర్యలు చేపట్టి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు స్పష్టం చే శారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ...నూతనంగా నిర్మించిన బైపాస్ వద్ద ఆర్టీసీ బస్సులు సులభంగా తిరుగుటకు మలుపు ప్రాంతంలో అడ్డంకులుగా ఉన్న నిర్మాణాలను తొలగించ డం అవసరమని తెలిపారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.అదేవిధంగా మద్దూర్ నగర్ కారికతీయ పాఠశాల వెనుకనున్న మున్సిపల్ విద్యానవనం (పింగళి సూరన తెలుగు తోట)ను పరిశీ లించారు.పార్కు అభివృద్ధి భాగంగా నడకబాట ఏర్పాటు,జిమ్ పరికరాల స్థాపన వంటి చ ర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.రమణమూర్తి,ఇంచార్జీ సిటి ప్లానర్ వై.వెంకటరమణ,ఎం.ఈ.మనోహర్ రెడ్డి,డిఈఈ పవన్ కుమార్ రెడ్డి,బిల్డింగ్ ఇన్‌ స్పెక్టర్ ది వాకర్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...