జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బీజేవైఎం కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయా లి...జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు క్రాంతి నాయుడు బోయ...

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బీజేవైఎం 
కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలి
క్రాంతి నాయుడు బోయ,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు 

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయపై ఈనెల 21వ తేదీన దాడి చేసిన బీజేవైఎం కార్యకర్తల పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షు లు క్రాంతి నాయుడు డిమాండ్ చేశారు.మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలంగాణలో జరుగుతున్న సంఘటన్ శ్రీజన్ అభియా న్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ జిల్లాల నూతన అధ్య క్షుల శిక్షణా తరగతుల కార్యక్రమంలో ఉన్న క్రాంతి నాయుడు బోయ మాట్లాడుతూ ఢిల్లీ లో జరిగిన ఏఐ సమ్మిట్ లో చైనా డ్రోన్లను ఉపయోగించారని మా యువజన కాంగ్రెస్ నా యకులు తప్పును చూపించడం జరిగిందని,వాటిని జీర్ణించుకోలేని బిజెపి పార్టీ జిల్లాల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు జరపాలని పిలుపునివ్వడం జరిగిందని,కానీ ఒక రోజు ముందే జిల్లా ఎస్పీకి మరియు సంబంధిత కర్నూలు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కి సమాచారం అందించామని పార్టీ కార్యాలయం ముందు పోలీసు భద్రత ఏర్పాటు చేసినా బీజేవైఎం కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గేటును,జిల్లా నా యకుల ఫ్లెక్సీలను,పోస్టర్లను ధ్వంసం చేయడం,పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని తీవ్ర పదజాలంతో దూషించడం,ఆయన దిష్టిబొమ్మను ద హదహనం చేయడం,పార్టీ కార్యాలయంలోనికి కోడిగుడ్లను,టమోటాలను విసరడం మం చి పద్ధతి కాదని తప్పును తప్పుగా చూపిస్తే ఇలా దాడులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నిం చారు.ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంటుందని కానీ దాడులకు పాల్పడ డం నీతిమాలిన చర్య అని,ఇలాంటి దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండి స్తుందని, పార్టీ కార్యాలయాలపై కర్నూలు చరిత్రలో ఎప్పుడు దాడులు జరిగిన సందర్భాలు లేవని, మీరు నిరసన తెలియజేయాలనుకుంటే ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన తెలుపు కో వాలని హితవు పలికారు.అనంతరం క్రాంతి నాయుడు బోయ ఆదేశాల మేరకు ఐఎన్టి యుసి జిల్లా అధ్యక్షులు బి.బతుకన్న,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్.సి.బజారన్న,ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డివి సాంబశివుడు,రాష్ట్ర ఓబీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున యా దవ్,ఐఎన్ టియుసి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్,విశ్రాంత పోలీసు అధికారి జాన్ సదా నందం,వార్డు ఇన్చార్జీలు షేక్ షబ్బీర్,మహమ్మద్ జావిద్,రైతు సంఘం నాయకులు బస్తిపా డు దస్తగిరి మొదలగువారు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీని కలిసి దాడి చేసిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయా లని,భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పార్టీ కార్యాలయం వద్ధ భద్రత ఏ ర్పాటు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగిందని క్రాంతి నాయుడు తెలియజేశారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...