కేరళ పేరు...ఇక కేరళం...కేంద్ర క్యాబినెట్ ఆమోదం...
కేరళ పేరు...ఇక కేరళం...కేంద్ర క్యాబినెట్ ఆమోదం
దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరు మార నుంది.ఈ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చేదిశగా కీలక అడుగుపడింది.సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాద నకు మంగళవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థి స్తూ ఇప్పటికే కేరళ (Kerala) అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసిన సంగతి తెలిసిం దే.అధికారిక రికార్డుల్లో రాష్ట్రం పేరును సవరించాలంటూ తీసుకు వచ్చిన తీర్మానానికి ఇటీ వల కేరళ శాసనసభ ఆమోదం తెలపగా...తాజాగా కేంద్ర క్యాబినెట్ దానిని పరిగణనలో కి తీసుకుంది.ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ...ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది.తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో 'కేర ళం' అని పిలిచేవారని అప్పట్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. కానీ, ఇ తర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు.కాగా...ఈ విషయం లో విజయ్ ప్రభు త్వానికి భాజపా మద్దతు ఇచ్చింది.ఈ మేరకు ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అ ధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సీఎంకు లేఖ రాశారు.దానికి ముఖ్య మంత్రి బదులిస్తూ... “రాష్ట్రం అసలు పేరు కేరళం.కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వా రు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం” అని పేర్కొన్నా రు.
ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే..?
ఒక రాష్ట్రం పేరు మార్చాలంటే...మార్పునకు ప్రతిపాదన చేస్తూ చేసిన తీర్మానానికి ఆ శా సన సభలో ఆమోదం లభించాలి.ఈ బిల్లును పార్లమెంట్ (Parliament)లో ప్రవేశ పె ట్టే ముందు రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర శాసనసభ అభిప్రాయం తీసుకుంటారు.అయితే ఆ అభిప్రాయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు.తర్వాత రాష్ట్రపతి సిఫార్సు మేరకు పేరు మార్పు బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు.ఆ బిల్లు ఆమోదానికి సా ధారణ మెజార్టీ సరిపోతుంది.తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో పేరు అధికారికంగా మా రుతుంది.ఈ ప్రక్రియకు రాజ్యాంగ సవరణ అవసరం లేదు.ఆర్టికల్ - 3 ప్రకారం సాధార ణ చట్టం ద్వారానే చేయవచ్చు.అనంతరం రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భాషల్లో మార్పులు చేస్తారు.
Comments
Post a Comment