అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలి...అంగన్వాడీ రిలే నిరాహార దీక్షల్లో వక్తలు...

అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించాలి
అంగన్వాడీ రిలే నిరాహార దీక్షల్లో వక్తలు

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లాలో గత నాలుగు రోజులుగా అంగ న్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినా ప్రభుత్వంలో కదిలిక రావడం లేదని.విధి లేని పరిస్థితుల్లో అంగన్వాడీ టీ చర్లు ఆయాలు,వేలాదిమంది మార్చి రెండవ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడు తున్నామని సిఐటి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.అంజిబాబు పేర్కొన్నారు.గురువా రం దీక్ష శిబిరానికి సిఐటి యు నగర ఉపాధ్యక్షులు మహ్మద్ రఫీ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అంగన్వాడీ యూనియన్ ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.లలిత మ్మ ప్రసంగించారు.రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులందరూ అంగన్వాడీలపై పనిభారం విపరీ తంగా పెరిగిందని,తక్కువ వేతనాలతో పని చేస్తున్న విషయాన్ని అందరూ అంగీకరిస్తు న్నారని ఆమె తెలిపారు.కూటమి,ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల దీక్షల పట్ల చాలా ఉదా సీనంగా ఉందని,ఇది కూటమి ప్రభుత్వానికి తగదని అన్నారు.రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు,టిడిపి నాయకులు, ఎ మ్మెల్యేలు,మంత్రులుగా ఉన్నవారు రాష్ట్రంలో అంగన్వాడీల దీక్షలను సందర్శించి మా ప్రభు త్వం అధికారంలోకి వస్తే వెంటనే అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చార ని చెప్పారు.
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను పట్టించుకోకపోవడం దురదృష్టకర మని అన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యంగా కొనసాగితే గతంలో జగన్ ప్రభుత్వంలో నిర్వహించి న సమ్మెకంటే మరింత,మిలిటెంట్గా సమ్మెను కొనసాగిస్తామని ఆమె తెలిపారు.ఈ దీక్షా శి బిరానికి ప్రజా సంఘాలు,ఐద్వా,సిపిఎం,సిపిఐ నగర కార్యదర్శులు టి.రాముడు,రామకృ ష్ణారెడ్డిలు సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు.ప్రభుత్వం వెంటనే దిగిరాకపోతే అంగన్ వాడిల ఉద్యమానికి సంపూర్ణంగా సహకరిస్తామని వారు తెలిపారు.ఐద్వా నగర అధ్యక్షురాలు కుమారి,పర్వీన్ లు ప్రసంగిస్తూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించని,ప్ర భుత్వాలు కుప్పకూలిపోయాయని హెచ్చరించారు.అంగన్వాడి ఎమ్మిగనూరు ప్రాజెక్టు కార్య దర్శి గోవర్ధనమ్మ,అంగన్వాడి యూనియన్ (సిఐటియు)జిల్లా కార్యదర్శి బాలదుర్గమ్మ,రా ష్ట్ర నాయకురాలు,టీ.రేణుక మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000, సంక్షేమ పథకాలు,గ్గ్రాట్యుటీ చట్టం,యాప్ ల భారం తగ్గించాలని,నెలరోజుల పాటు వేత నంతో కూడిన వేసవి సెలవులు అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వా డి జిల్లా గౌరవాధ్యక్షులు పి.నిర్మల.జిల్లా నాయకులు ఏం.గోపాల్,సిఐటియు న్యూసిటీ కా ర్యదర్శి నర్సింలు సి.హెచ్.సాయిబాబా,ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు మనోహర్ మాణి క్యం,నగర నాయకులు రామాంజనేయులు,ఏఐటీయుసీ నగర నాయకులు వెంకటేష్,పెం చలయ్య,తదితరులు పాల్గొ న్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...