కల్తీ పాలతో నలుగురు మృతి...వెలుగులోకి సంచలన విషయాలు...

కల్తీ పాలతో నలుగురు మృతి
వెలుగులోకి సంచలన విషయాలు

VS9TV న్యూస్,రాజమండ్రి :
రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయా లు వెలుగులోకి వస్తున్నాయి.నలుగురు మృతి చెందగా,మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిం దని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.నేడు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.తూర్పు గోదావరి జిల్లా,కోరుకొండ మండలం,నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీ లో,పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్‌ గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై,ఒక పాల క్యాన్‌లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుం బాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగ ర్,స్వ రూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12మంది,అనూరియా సమస్య తో ఆసుపత్రుల్లో చేరారు.కాగా,ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా,8 మందికి చికి త్స అందిస్తున్నారు.వీరిలో ముగ్గురు చిన్నారులు ఉండగా,ఒక చిన్నారి మరో ఇద్దరు వృద్ధు ల పరిస్థితి విషమంగా ఉంది.కాగా పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా రిఫ్రిజిరే టర్ లలో కూలెంట్‌గా ఉపయోగిస్తారు.ఇది శరీరంలోకి వెళ్లినప్పుడు తీవ్రమైన విష ప్రభా వం చూపి కిడ్నీలను దెబ్బతీస్తుంది.అధిక మోతాదులో తీసుకుంటే మూత్రపిండాల కరాబ్ అ యి,మెదడు దెబ్బతినడం,ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంటుంది.బాధితుల్లో కనిపిం చిన లక్షణాలు ఈ రసాయన ప్రభావంతో సరిపోయినట్లు వైద్యులు పేర్కొంటున్నారు.ఇ క,పాలు,పెరుగు నమూనాలను సేకరించి సెంట్రల్ ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబ్ కు,స్టేట్ ఫోరె న్సిక్ సైన్స్ ల్యాబ్ లకు ఇప్పటికే అధికారులు పంపించారు.కాగా,వందలాది మంది రక్త న మూనాలు సేకరించగా,ఫోరెన్సిక్ రిపోర్ట్స్ నేడు రానున్నాయి.అధికారిక నివేదికలతో కల్తీ పాల వ్యవహారంపై పూర్తి స్థాయిలో నిర్ధారణ కానుంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....