నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి...కఠినంగా వ ్యవహరించాలి...డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ చేయిం చాలి...అసాంఘిక కార్యకలపాలపై నిఘా ఉంచాలి... విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎస్పీ...

నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి
కఠినంగా వ్యవహరించాలి
డ్రోన్ కెమెరాలతో పెట్రోలింగ్ చేయించాలి
అసాంఘిక కార్యకలపాలపై నిఘా ఉంచాలి
విక్రాంత్ పాటిల్,కర్నూలు ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు జిల్లా పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ,నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయా లని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులకు ఆదేశించారు.ఈ సంధర్బంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో జిల్లాలోని డిఎస్పీ లు,సిఐలు,ఎస్సైలతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.అనంతరం కర్నూ లు ఎస్పీ పోలీసు అధికారులతో మాట్లాడుతూ...విజిబుల్ పోలీసింగ్ ఎక్కువగా చేయా లన్నారు.పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితుల ఫిర్యాదుల సమస్యలపై సత్వరమే స్పం దించి న్యాయం చేయాలన్నారు.నేర నివారణే ప్రథమ లక్ష్యంగా పని చేస్తనే పోలీసు శాఖ కు మంచి పేరు వస్తుందన్నారు.కార్డన్ సెర్చ్ లు,రాత్రి గస్తీలు,రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్,పల్లె నిద్ర కార్యక్రమాలు,గ్రామాల సందర్శనలు,ఆ కస్మిక తనిఖీలు,బైండోవర్ లు,పిడి యాక్టులు నమోదు చేయాలన్నారు.ప్రజా శాంతికి భంగం కలిగించే వారిపై జిల్లా బహిష్కరణలు,పి డి యాక్టులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.గ్రేవ్‌,నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌,రోడ్డు ప్రమాదాలు,మిస్సింగ్ కేసులు,చీటింగ్ కేసులు,దొంగతనాల కేసులు,ప్రాపర్టీ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పెట్రోలింగ్ వా హనాలతో సైరన్స్,లౌడ్ స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేయాలన్నారు.
దొంగతనాలు,ప్రాపర్టీ కేసులు చేధించి,రికవరీలు పెంచాలన్నారు.పోక్సో కేసులలో ఖచ్చి తంగా నిర్దేశించిన సమయంలోపే ఛార్జ్ షీట్ వేయాలన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రిం కింగ్ లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.ప్రత్యే కంగా ప్రతి ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీలు చేయాలన్నారు.డీజీపీ ఆదేశాలు “ వజ్ర ప్రహర్ ” మేర కు ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు.రౌడీ షీటర్లు,హిస్టరీ షీటర్లపై నిఘా ఉంచాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు,వాహనాల తనిఖీలు చేయాలన్నారు.గంజాయి అక్రమ రవాణపై నిఘా ఉంచాలన్నారు.ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు.ప్రతి సబ్ డివిజన్ లలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేయాలన్నారు.డ్రోన్ కెమె రాలతో పెట్రోలింగ్ చేయించాలన్నారు.సైబర్ నేరాల బారిన పడి బాధితులు లక్షలలో డ బ్బులు పొగోట్టుకున్నట్లు ఫిర్యాదులు వస్తే సైబర్ క్రైమ్ క్రింద వెం టనే కేసులు నమోదు చే యాలన్నారు.ప్రాపర్టీ కేసులలో సిసియస్ పోలీసులు బాగా పని చేయాలన్నారు.నేర చరి త్ర,చెడు ప్రవర్తన ఉన్న వారిపై ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులను నమోదు చేయాలన్నా రు.పెండింగ్ కేసుల దర్యాప్తులను పకడ్బందీగా చేయించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలోని జాతీయ రహదారులపై టోల్ గేట్స్ వద్ద,ముఖ్య మైన ప్రాంతాలలో అర్ధరాత్రి దాటాక హెవీ వెహికిల్స్ డ్రైవర్లు నిద్రమత్తులోకి వెళ్లకుండా వా రి ముఖాలు నీళ్లతో కడిగిస్తూ స్టాప్ వాష్ అండ్ గో కార్యక్రమాలను బాగా చేయాలన్నా రు.అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ...గస్తీ తిరిగే పోలీసులు రాత్రివేళల్లో రేడి యం జాకెట్స్,ఎల్ ఈడి బ్యాటన్స్ ధరించాలన్నారు.గత నెలలో వివిధ కేసులలో ప్రతిభ క నబరచిన పోలీసు అధికారులు,సిబ్బందికి,డిపిఓ మినిస్టిరియల్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా ప త్రాలను అందజేసి అభినందించారు.ఈ నేర సమీక్ష సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హు స్సేన్ పీరా,లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు,డిఎస్పీలు బాబుప్రసాద్,వెంకట్రామయ్య,ఉ పేంద్రబాబు,హేమలత,భార్గవి,డిపిఓ ఎఓ విజయలక్ష్మీ,సిఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....