మావోయిస్టు విప్లవ పోరాటం ముగుస్తోంది...డీజీపీ శివధర్ రెడ్డి...
మావోయిస్టు విప్లవ పోరాటం ముగుస్తోందిడీజీపీ శివధర్‌రెడ్డి
తెలంగాణలో రూపుదిద్దుకున్న మావోయిస్టు విప్లవ పోరాటం ఇక్కడే ముగుస్తోందని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పునరావాస చర్యలను గమ నించి మావోయిస్టులు లొంగిపోతున్నారని తెలిపారు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అ ప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సహా నలుగురు అగ్రనేతలు పోలీ సుల ఎదుట లొంగిపోయారు.హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ సమక్షం లో దేవ్‌జీతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్,తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు.ఈ సందర్భం గా శివధర్‌రెడ్డి మాట్లాడుతూ..నలుగురు అగ్రనేతలు లొంగిపోవడం ద్వారా మావోయిస్టు పార్టీ అత్యున్నత సంస్థాగత నిర్మాణం పతన మైందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభ్య ర్థన మేరకు లొంగిపోతున్న మావోయిస్టుల పున రావాసానికి కట్టుబడి ఉంటామని,వారి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి కాపాడుతామని ప్రకటించారు.గతేడాది నుంచి నేటి వ రకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు,16మంది రాష్ట్ర కమిటీ సభ్యులు,26మంది జిల్లా క మిటీల సభ్యులు,85 మంది ఏరియా కమిటీ సభ్యుల తోపాటు 460మంది మావోయిస్టు పార్టీ కార్యకర్తలు కలిపి మొత్తం 591మంది లొంగిపోయారని వెల్లడించారు.లొంగుబా టే కాకుండా తెలంగాణ ఎస్‌ఐబీ తీసుకున్న చర్యల వల్ల వీరు ఆయుధాలు కూడా అప్పగిం చారని,మొత్తం 142ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.మావోయిస్టు పా ర్టీ సంస్థాగత నిర్మాణం కుప్పకూలే దిశగా సాగుతుందన్న విషయాన్ని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర కమిటీలో మరో ముగ్గురే :
మావోయిస్టులకు మద్దతిచ్చే వర్గాలు క్షీణించడం,క్యాడర్ల కదలికలపై పరిమితులు పెరగడం, నిరంతర కూంబింగ్ చర్యలు,సిద్ధాంతపరమైన అసం తృప్తి నేపథ్యంలో.. మిగిలిన వారిలో నూ తీవ్రమైన అంతర్మథనం జరుగుతోందని డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు.ఇంకా కేంద్ర కమి టీలో ముగ్గురు సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణరావు,మిసిర్ బెహ్రా,నరహరి ఉన్నారని,వీరిలో ల క్ష్మణరావు అడవుల్లో లేరని,ఆయన వృద్ధాప్య సమస్యలతో ఎక్కడో చికిత్స పొందుతున్న ట్లుగా సమాచారం ఉందని తెలిపారు.లక్ష్మణరావు,ఆయన భార్య జోడేబాయి కూడా ముం దుకొచ్చి లొంగిపోతే వారికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు. మావో యిస్టు పార్టీలో తెలంగాణకు చెందినవారు ఇంకా 11మంది వివిధ క్యాడర్లలో పలు రాష్ట్రా ల్లో పనిచేస్తున్నారని,వారంతా కూడా త్వరగా వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలని పిలు పునిచ్చారు.అగ్రనేతల లొంగుబాటు విషయంలో చొరవ చూపి మానవతా దృక్పథంతో చ ర్యలు తీసుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) ఐజీ సుమతి,ఆమె సిబ్బందిని డీ జీపీ అభినందించారు.ఇదిలా ఉండగా...త్వరలో మావోయిస్టు పార్టీలోని వివిధ క్యాడర్లకు చెందిన 50మందికి పైగా ఆయుధాలతో లొంగిపోనున్నట్లు సమాచారం.
44 ఏళ్లు అడవిలోనే...చంద్రబాబుపై దాడి కేసులో కీలకం :
మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎన్‌కౌంటర్ త ర్వాత పార్టీ అప్రకటిత కార్యదర్శిగా కొనసాగుతూ...సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్ గా,పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద షాక్‌గా ప్రజా సంఘాలు పేర్కొంటున్నాయి. 44 ఏళ్లు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగిన తిరుపతి...మిలిటరీ వ్యూహ కర్త మాత్రమే కాకుండా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పనిచేశారు.అలిపిరిలో నాటి ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో దేవ్‌జీ కీలకపాత్ర పోషిం చారు.దంతేవాడలో 2010లో జరిగిన 74మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల హత్యలోనూ దేవ్‌జీ పాత్ర ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి.ఇక మావోయిస్టు పార్టీలో 46 ఏళ్ల నుంచి వి విధ స్థాయిల్లో పనిచేసిన కరీంనగర్ జిల్లా వాసి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడే కాకుండా...పార్టీ తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ వార్ ద్వారా పార్టీలోకి వచ్చిన తర్వాత చర్చల సమయంలోనూ రాజి రెడ్డి కీలక పాత్ర వహించారు.ఒకటి రెండుసార్లు అరెస్టయినప్పటికీ బెయిల్‌పై బయటకు వ చ్చిన తర్వాత మళ్లీ అడవుల్లోకి వెళ్లి ఉద్యమంలో కొనసాగారు.పీపుల్స్ వార్‌లో 2001లో ఏర్పాటు చేసిన సౌత్ వెస్ట్ రీజినల్ బ్యూరో ఇన్‌చార్జ్ గా ఆయన పని చేశారు.2004లో పీపుల్స్‌వార్,ఎంసీసీఐ విలీన మై సీపీఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాక పొలిట్ బ్యూరో స భ్యుడయ్యారు.
రూ.90 లక్షల రివార్డు :
లొంగిపోయిన నలుగురు మావోయిస్టు నేతలపై ఉన్న రివార్డు మొత్తాన్ని డీజీపీ శివధర్ రె డ్డి వారికి అందజేశారు.తిరుపతి,రాజిరెడ్డికి ఒక్కొక్కరిపై రూ.25లక్షల చొప్పున ఉన్న రి వార్డును,చొక్కా రావు,నర్సింహారెడ్డిలపై రూ.20లక్షల చొప్పున ఉన్న రివార్డును కలిపి మొత్తం రూ.90లక్షలను వారికి అందజేశారు.వీరికి పునరావాస పథకం ద్వారా అందే ఇ తరత్రా అన్ని ప్రయోజనాలనూ త్వరలో అందిస్తామని తెలిపారు.
Comments
Post a Comment