కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి...మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు...

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి జిల్లా ఎస్పీ 
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి
మాజీ ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేసి కర్నూలు జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ ఎమ్మెల్సీ,ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి సుధాకర్ బాబు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కర్నూలు జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లా చరిత్రలో ఏరోజు ఒక పార్టీ ఆఫీస్ పై మరో పార్టీ దాడికి వెళ్లినట్టు కర్నూలు చరిత్రలో లేదని,కానీ బిజెపి పార్టీ గుండాలు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి విధ్వం సం సృష్టించి గేట్లు విరగొట్టి,ఫ్లెక్సీలు చింపివేసి విధ్వంశం చేస్తే వారిని ఎందుకు అరెస్టు చేయలే దని జిల్లా ఎస్పీని ప్రశ్నించారు.మీరు మీడియా, పేపర్లలలో చూసివుంటారని,పేపర్లలో వచ్చిన దానికి ప్రతిష్పందన ఉండాలి కదా.ఎవరు ఏమి చేశారు అన్నది.ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ వారిని అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచారు.వారిలో ఒకరు దొర కలేదని పోలీసులు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి అరె స్టు చేసి తీసుకొచ్చారు.పోలీస్ వారు అంత నిబ ద్ధత చూపించినప్పుడు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృచిం చిన వారిపైన ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నా రు.మీరు వారిని అరెస్టు చేయాలి కదా అదే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తే కేసులు పెట్టి అరె స్టులు చేయకుండా ఉంటారా అని సుధాకర్ బా బు ప్రశ్నించారు.కచ్చితంగా ఇలాంటి దాడులకు విధ్వంసం సృటించిన బిజెపి గుండాలను వెంటనే అరెస్టు చేయాలి.ఈ మతతత్వ ఉన్మాదులను వదిలేస్తే దేశ ఉనికికే ప్రమాదం అని వారు విమర్శించారు.అలాంటి వారిని వెంటనే అరెస్టు చేయాలని,లేనిపక్షంలో కలెక్టరేట్ ఎదుటగాని, రెండవ పట్టణ పోలిస్టేషన్ ఎదుటగాని ప్రత్యక్ష ధర్నా నిర్వహించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి బాషా, ఐఎన్టీ యసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సీ బజారన్న,మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్,ఐ ఎన్ టి యు సి సిటీ అధ్యక్షులు రేపల్లె ప్రతాప్, తదితరులు పా ల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...