చూస్తే ఎంతో అమాయకుడు...ఎటిఎంల వద్ద జనాలను దోపిడీ చేస్తాడు...

చూస్తే ఎంతో అమాయకుడు
ఎటిఎంల వద్ద జనాలను దోపిడీ చేస్తాడు

VS9TV న్యూస్,శ్రీకాకుళం :
చూడటానికి ఎంతో అమాయకుడుగా కనిపిస్తాడు.బ్యాంకు ఏటీఎం సెంటర్ల వద్ద వృద్ధు లు,నిరక్షరాస్యుల కోసం ఎదురు చూస్తాడు...అదను చూసి జనాలను మస్కా కొడతాడు. సాయం చేస్తున్నట్టు నటించి ఖాతాలు కొల్లగొట్టే స్తాడు.ఇలా ఒకటి కాదు రెండు కాదు.ఏ కంగా ఇరవై చోట్ల ఏటీఎం సెంటర్ల వద్ద మస్కా కొట్టి మాయ చేసి డబ్బులు లాగేసాడు ఈ కేటుగాడు.అలాంటి మాయలోడు ఎట్టకేలకు అనకాపల్లి జిల్లా పోలీసుల చేతికి చిక్కి కట కటాల పాలయ్యాడు.ఇతను ఇంటర్ స్టేట్ క్రిమినల్ అంటూ అనకాపల్లి పోలీసులు ప్రకటిం చారు.వివరాల్లోకి వెళితే...నర్సీపట్నం మండలం,ధర్మసాగరం గ్రామానికి చెందిన నూకరా జు ఈ నెల 17న నగదు డ్రా చేయానికి యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతనికి ఏటీఎంతో డబ్బులు డ్రా చేయడం తెలియక ఇబ్బందిపడ్డాడు.దీంతో అక్కడున్న గు ర్తు తెలియని వ్యక్తిని సహాయం అడిగాడు.అయితే అప్పటికే అవకాశం కోసం ఎదురుచూ స్తున్న...ఆ వ్యక్తి నూకరాజు నుంచి ఏటీఎం కార్డు తీసుకొని పిన్‌ నంబరు అడిగాడు.మూ డుసార్లు ఏటీఎం మెషీన్‌లో కార్డు పెట్టి డబ్బులు రావడం లేదని చెప్పి...ఏటీఎం కార్డు తిరి గి ఇచ్చేసాడు.ఆ సమయంలో కార్డును తారుమారు చేసి వెళ్లిపోయాడు.ఆ తర్వాత నూక రాజు ఏటీఎం కార్డుతో రూ.15వేలు నగదు తీసినట్టు సెల్‌ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది.ఆందో ళన చెందిన నూకరాజు బ్యాంక్‌కి వెళ్లి అడిగాడు.అతని ఖాతా నుంచి రూ.15 వేలు విత్‌ డ్రా చేసి నట్టు బ్యాంక్‌ అధికారులు చెప్పారు.దీంతో మోస పోయానని తెలుసుకుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నూకరాజు.ఈ నేపథ్యంలో నర్సీపట్నం టౌన్ సీఐ గఫూర్‌ ప్రత్యే బృందాన్ని ఏర్పాటు చేసి సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ ప్రారంభించారు.పోలీ సుల విచారణలో ఇదే తరహా ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరిగినట్లు గుర్తించారు. నిందితుడు ప్రకాశం జిల్లా,వీరన్న పాలెం గ్రామానికి చెందిన మువ్వ వీరయ్య చౌ దరిగా ని ర్ధారించుకున్నారు.విచారణ వేగవంతం చేసి వీరయ్య చౌదరిని ట్రాక్ చేయడం ప్రారంభిం చారు.అయితే...నిందితుడు ప్రస్తుతం విశాఖ జిల్లా,మర్రిపాలెంలో ఉంటున్నట్టు గుర్తించా రు.అనంతరం వీరయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు.వీరయ్య చౌదరి కేవలం నర్సీపట్నం మాత్రమే కాదు.రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరు వేరు చోట్ల ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడు.అతనిపై మిర్యాలగూడ టూ టౌన్‌లో 2,పాలకొండ,ఆముదాల వలస,లాలాపే ట,జనగాం, కాజీ పేటలో ఒక్కో కేసు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ సందర్బంగా డీ ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2017 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరువేరు చోట్ల 20 కేసులు నమోదయ్యాయని చెప్పారు.వీరయ్య చౌదరిని అరెస్టు చేసి రిమాండ్ కు త రలించినట్లు పేర్కొన్నారు.నిందితుడి నుంచి రూ.10వేల నగదు,9ఏటీఎం కార్డులు సెల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు.ఏటీఎం సెంటర్‌కు వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం కార్డు ఇచ్చి పిన్‌ నంబర్లు చెబితే అంతే సంగతులు అని పోలీసులు సూచిస్తున్నా రు.మూడో కంటికి తెలియకుండా పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఏటీఎం సెంటర్లో నుంచి నగ దు విత్ డ్రా చేయాలని సూచిస్తున్నారు.ఎటువంటి అనుమానం ఉన్న పోలీసులకు సమా చారం ఇవ్వాలని సూచనలు జారీ చేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....