డిఎస్ సీ స్పోర్ట్స్ కోటా స‌ర్టిఫికెట్ ల ప‌రిశీల‌న‌లో క్రీడా సంఘాల‌ను భాగ‌స్వామ్యం చేయాలి...ఏపీ ఒలింపిక్ సంఘం 10వ వార్షిక స‌మావేశం తీర్మానం...

డిఎస్ సీ స్పోర్ట్స్ కోటా స‌ర్టిఫికెట్ ల ప‌రిశీల‌న‌లో 
క్రీడా సంఘాల‌ను భాగ‌స్వామ్యం చేయాలి
ఏపీ ఒలింపిక్ సంఘం 10వ వార్షిక స‌మావేశం తీర్మానం

VS9TV న్యూస్,విజ‌య‌వాడ స్పోర్ట్స్ :

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల విడుద‌ల చేసిన డీఎస్ సీ స్పోర్ట్స్ కోటా టీచ‌ర్ పోస్ట‌ల భ‌ర్తీలో భాగంగా స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న‌లో రాష్ట్ర క్రీడాప్రాథికార‌సంస్థ (శాప్‌) అధికారుల‌తోపాటు క్రీడా సంఘాల‌ను కూడా భాగ‌స్వామ్యం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓ ఏ) 10వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం (ఏజీఎం) తీర్మానించింది.క్రీడా సంఘాల ప్ర‌తిని ధులు లేకుండా స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న నిర్వ‌హిస్తే,న‌కిలీ స‌ర్టిఫికెట్‌దారుల‌ను గుర్తించ‌డం క‌ష్ట‌ త‌ర‌మ‌వుతుంద‌ని స‌మావేశం పేర్కొంది.గ‌తంలో క్రీడా సంఘాల భాగ‌స్వామ్యం లేకుండా స్పోర్స్ట్ కోటా అభ్య‌ర్థుల స‌ర్టిఫికెట్‌ల ప‌రిశీల‌న జ‌రిగింద‌ని,ఫ‌లితంగా వంద‌లాది మంది న‌కిలీ స‌ర్టిఫికెట్‌ల‌తో స‌చివాల‌యం ఉద్యోగాలు పొందార‌ని స‌మావేశం తెలిపింది.ఏపీ ఓఏ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్‌కె పురుషోత్తం అధ్య‌క్ష‌త‌న విజ‌య‌వాడ‌లోని హోట‌ల్ ఐలాపురం లో ఏపీఓఏ 10వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది.ఈ స‌మావేశానికి సుమారు 38క్రీడా సంఘాల రాష్ట్ర ప్ర‌తినిధులు పాల్గొన్నారు.స‌మావేశంలో రాష్ట్ర క్రీడాప్రాథికార‌సంస్థ (శాప్‌) గుర్తింపుతోపాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.ప్ర‌ధానంగా జూన్,23న అంత‌ర్జా తీయ ఒలింపిక్ డేని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒలింపిక్ ర‌న్‌ల‌ను ఇం డియ‌న్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం నిర్వ‌హించాల‌ని స‌మావేశం తీర్మానించింది.అనంత‌రం ఏపీఓఏ కోశాధికారి ఆర్.శ్రీ‌నివాస్‌తో క‌ల‌సి పురుషోత్తం విలేక‌ రుల స‌మావేశం నిర్వ‌హించారు.క్రీడా స‌ర్టిఫికెట్‌ల ప‌రిశీల‌న‌లో గ‌తంలో క్రీడా సంఘాల భాగ‌స్వామ్యం ఉండేద‌ని,అయితే, ఇటీవ‌ల ఉపాధ్యాయ నియామ‌కంలో స్పోర్ట్స్ కోటా పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన జీఓలో ఈ అంశాన్ని తొల‌గించార‌న్నారు.ముఖ్య‌మంత్రి ఎన్.చంద్ర‌బాబునాయుడు జోక్యం చేసుకుని త‌క్ష‌ణ‌మే క్రీడా సంఘాల భాగ‌స్వామ్యంలో డీఎస్‌సీ స్పోర్ట్స్ కోటా పోస్టుల భ‌ర్తీలో స‌ర్టిఫికెట్‌ల భ‌ర్తీలో క్రీడా సంఘాల‌ను భాగ‌స్వా మ్యం చేయాల‌న్నారు.టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీలో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల‌లో ప్రా ధాన్యం ఉన్న టాప్ 9 ఒలింపిక్ క్రీడ‌లు అథ్లెటిక్స్‌,ఆర్చ‌రీ,హాకీ,బ్యాడ్మింట‌న్‌,వెయిట్ లిప్టిం గ్‌,రెజ్లింగ్‌, టెన్నిస్‌,బాక్సింగ్‌,స్విమ్మింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న్నారు.అన్ని రాష్ట్రాలు కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటిస్తున్నాయ‌ని,వాటినే రాష్ట్రంలో కొన‌సాగించాల‌ని కోరారు. అలాగే న‌కిలీ క్రీడా స‌ర్టిఫికెట్‌ల‌తో వంద‌లాది మంది స‌చివాల‌యం ఉద్యోగాలు పొందార‌ ని,దానిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని కోరారు.దీనిపై త‌మ సంఘం సీఎంకు ఫిర్యా దు చేసిన‌ట్లు తెలిపారు.క్రీడా సంఘాల ప్ర‌మేయం లేకుండా స‌ర్టిఫికెట్‌ల ప‌రిశీల‌న చేయ‌ డంతో ఇటీవ‌ల ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌లో 18 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌గా,ఎనిమిది మంది ఫేక్ స‌ర్టిఫికెట్ల‌తో ఉద్యోగాలు పొందార‌ని తెలిపారు.దీనిపై విచార‌ణ జ‌రిపి,న‌కిలీల‌ను తొల‌ గించి,నిజ‌మైన క్రీడాకారుల‌ను ఉద్యోగాలు వ‌చ్చేలా చూడాల‌న్నారు.ఇదిలావుండ‌గా,క్రీడా సంఘాల‌లో రాజ‌కీయ జోక్యం మితిమీర‌కుండా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చ‌ ర్య‌లు తీసుకోవాల‌ని పురుషోత్తం కోరారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...