రూ.22 లక్షలు విలువజేసే 730కేజీల గంజాయి పట్టివేత...బి.నాగేశ్వర నాయక్,దేవరపల్లి సీఐ...

రూ.22 లక్షలు విలువజేసే 730కేజీల గంజాయి పట్టివేత
బి.నాగేశ్వర నాయక్,దేవరపల్లి సీఐ 

VS9TV న్యూస్,తూర్పు గోదావరి :

లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 730కేజీల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా,దే వరపల్లి మండలం, యర్నగూడెంలో పోలీసులు పట్టుకున్నారు.స్వాధీనం చేసుకున్న గం జాయి విలువ సుమారు రూ 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.ఇందుకు సం బంధించి దేవరపల్లి సీఐ బీ నాగేశ్వర నాయక్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ కు చెందిన కర్రే శ్రీశైలం‌ (ఏపీ 16 టీఎక్స్ 5319) లారీలో ఒడిస్సా మల్కా న్ గిరి ప్రాంతానికి వెళ్ళి గంజాయి తీసుకుని హైదరాబాదులో నర్సిరెడ్డి,యాదయ్యలకు రవాణా చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపారు.దీంతో శ్రీశైలం మల్కా న్ గిరి వెళ్ళి గంజాయిని‌ తన లారీ సీక్రెట్ కాబిన్ లో నింపుకున్నాడు. తెలంగాణాకు రవా ణా చేయటానికి హైవే మార్గంలో దేవరపల్లి మీదుగా వెళుతుండగా డైమండ్ జంక్షన్ దాటి న తరువాత గోల్డెన్ ఫిష్ ధాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అక్రమ గంజాయి ర వాణా గుట్టు బయటపడింది.గోల్డెన్ ఫిష్ ధాబా దగ్గర హైవే రోడ్డులో బైక్ ను లారీ ఢీకొ ట్టింది.ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న జంట అక్కడికక్కడే మృతిచెందారు.దీంతో లారీ డ్రైవర్ శ్రీశైలం (ముద్దాయి) లారీతో సహా కొవ్వూరు నుంచి నల్లజర్ల పోవు ఎన్హెచ్ 16 స ర్వీసు రోడ్డు పక్కన యర్నగూడెం గ్రామ శివార్లలో ఇటుకల బట్టి వద్ద ఎవరికీ కనబడ కుండా లారీని పార్క్ చేశాడు. తమకు అందిన సమాచారం మేరకు గంజాయితో ఉన్న లారీని స్వాధీనం చేసుకుని,ముద్దాయిని అరెస్టు చేసినట్టు సీఐ నాగేశ్వర నాయక్ తెలిపా రు.ఈ కేసులో హైదరాబాదుకు చెందిన నర్సిరెడ్డి,యాదయ్యలను అరెస్టు చేయాల్సి ఉం దన్నారు.లారీలో ఉన్న 18 గంజాయి మూటలు (730 కేజీలు),లారీ,ఒక సెల్ ఫోన్,వె య్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.ముద్దాయిని జ్యుడీషియ ల్ రిమాండ్ నిమిత్తం కొవ్వూరు కోర్డుకు తరలించామన్నారు.ఈ కేసులో ప్రతిభ కనపర చిన దేవరపల్లి ఎస్సై హెచ్.సి.వీ చక్రవర్తి,వి.చంద్రశేఖర్,ఆరగవీ రమణ,షేక్ సలీం,పి.రా మారావులను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...