400 మంది పోలీసులతో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు పటిష్ట భద్రత...బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు దిశా,నిర్దేశం...విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ...

400 మంది పోలీసులతో కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షకు పటిష్ట భద్రత
బందోబస్తు విధులకు విచ్చేసిన పోలీసులకు దిశా,నిర్దేశం
విక్రాంత్ పాటిల్,జిల్లా ఎస్పీ

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :

కేటాయించిన విధులలో పోలీసులు  అప్రమ త్తంగా ఉండాలని,అలసత్వం ప్రదర్శించరా దని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.శనివారం కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష సంధర్భంగా బందోబస్తు విధులకు వి చ్చేసిన పోలీసు లకు జిల్లా పోలీసు కార్యాల యంలోని పరేడ్ మైదానంలో శనివారం  జి ల్లా ఎస్పీ దిశా,నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడానికి పటిష్ట చర్యలు తీసుకో వాలన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలులో  ఉందని,పరీక్షలు ముగిశాక ఆ పత్రాలను పటిష్ట భద్రతా నడుమ స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలన్నారు.అభ్యర్దులకు పరీ క్షల సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎలాంటి  మాల్ ప్రాక్టిస్ వంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.పరీక్ష కేంద్రాల చుట్టూ జిరాక్స్,కంప్యూటర్ కేంద్రాలను మూసివేసేవిధంగా చూడాలన్నారు.పరీక్ష జరిగే సమయంలో అభ్యర్థులు కాకుండా ఇతరులు ఎవ్వరైనా పరీక్ష కేంద్రంలో కానీ,పరీక్ష కేం ద్రాల వద్ద ఉంటే వారిపై కూడా చట్టపరమయిన చర్యలు తీసుకోవాలన్నారు.పరీక్ష వ్రా సేందుకు వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థిని పూర్తిగా తనిఖీ (ఫ్రిస్కింగ్) చేసిన తర్వాతే పరీక్ష హా ల్లోకి అనుమతించాలన్నారు.ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం వస్తుందని,ఎటువంటి మోసా లకు తావులేదని,కావున ఎవరైనా మీకు డబ్బులు కడితే  ఉద్యోగం ఇప్పిస్తామని కానీ, పరీ క్షలలో సహాయం చేస్తామని చెప్పే మాయమాటలు నమ్మవద్దని అభ్యర్దులకు ఎస్పీ సూచిం చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా,ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డిఎస్పీలు శ్రీనివాసాచారి,హేమలత, భాస్కర్ రావు,ప్రసాద్,సిఐలు,ఆర్ ఐ లు,ఎస్సైలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...