ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేసిన అమెరికా కోర్టు...చెల్లించిన సుంకాలను వడ్డీతో తిరిగి ఇస్తారా? ఇప్పుడేం జరగనుంది?...
ట్రంప్ టారిఫ్‌లను నిలిపివేసిన అమెరికా కోర్టుచెల్లించిన సుంకాలను వడ్డీతో తిరిగి ఇస్తారా? ఇప్పుడేం జరగనుంది?
VS9TV న్యూస్,న్యూ ఢిల్లీ :
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాలను అమెరికాలోని ఓ ఫెడరల్ కోర్టు అడ్డుకుంది.ఇది ట్రంప్ ఆర్థిక విధానాలలో కీలకాంశానికి ఎదురుదెబ్బ.వైట్‌హౌస్ అ త్యవసరంగా అమలుచేసిన చట్టం దాదాపు ప్రతి దేశంపై సుంకాలు విధించడానికి అధ్య క్షుడికి ఏకపక్ష అధికారాన్ని ఇవ్వలేదని ‘ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ట్రేడ్’ పేర్కొంది.ఇతర దే శాలతో వాణిజ్య నియంత్రణకు అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు ప్రత్యేక అధికారాలు దా ఖలు పరిచిందని,అయితే ఆర్థిక వ్యవస్థ రక్షణకు అధ్యక్షుడికి ఉన్న అధికారం దీనిని అధిగ మించలేదని ఈ కోర్టు పేర్కొంది.ఈ తీర్పు వెలువడిన కొన్ని నిమిషాలలో ట్రంప్ ప్రభు త్వం అప్పీల్ దాఖలు చేసింది.సుంకాలను నిలిపివేసేందుకు అధికార ప్రక్రియను పూర్తి చే యడానికి ఈ తీర్పు వైట్‌హౌస్‌కు పది రోజుల సమయం ఇచ్చింది.అయితే వీటిలో చాలా సుంకాలు ఇప్పటికే తాత్కాలికంగా నిలిపివేశారు.మరోవైపు అక్రమ వలసదారులు,మాద కద్రవ్యాల ప్రవాహం ఆమోదయోగ్యం కాదంటూ ట్రంప్ ప్రభుత్వం చైనా,మెక్సికో, కెనడా లపై విధించిన ప్రత్యేక సుంకాలనూ కోర్టు నిలిపివేసింది.జాతీయ అత్యయిక పరిస్థితిని ఎ లా ఎదుర్కోవాలో న్యాయమూర్తులు నిర్ణయించలేరని వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.అమెరికాను అన్నింటా ప్రథమస్థానంలో నిలబెడ తామని అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని,ఇందుకోసం కార్యనిర్వాహక అధికారాలన్నిం టినీ ఉపయోగించి ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించి,అమెరికాను తిరిగి గొప్ప శక్తిగా ని లబెడతామని చెప్పారు.
లిబరేషన్ డే’కు తొలి సవాల్ :
ఇతర దేశాల నుంచి సరకును దిగుమతి చేసుకునే ఐదు చిన్నవ్యాపార సంస్థల తరఫున లిబర్టీ జస్టిస్ సెంటర్ ఈ కేసు దాఖలు చేసింది.ట్రంప్ సుంకాల కారణంగా దిగుమతులు ఖరీదైనవిగా మారాయి.ట్రంప్ 'లిబరేషన్ డే'గా పిలుచుకునే సుంకాల విధింపునకు ఈ కే సు తొలి సవాల్ విసిరింది.ఈ దావాలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఒకటైన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు."చట్టం స్పష్టంగా ఉంది.ఏ అ ధ్యక్షుడికి తనకు నచ్చినప్పుడల్లా తనంతట తానుగా పన్నులు పెంచే అధికారం లేదు" అని లెటిటియా జేమ్స్ అన్నారు.శ్రామిక కుటుంబాలు,అమెరికా వ్యాపారాలపై ఈ సుంకాలు అ తిపెద్ద పన్నులని,ఈ పన్నులను కొనసాగడానికి అనుమతిస్తే ఇది మరింత ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని,అన్నిరకాల వ్యాపారాలకు నష్టం కలిగిస్తుందని,దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను పెంచుతుందని ఆమె చెప్పారు.తలకిందులైన ప్రపంచ మార్కెట్లు కార్లు,స్టీల్,అ ల్యూమినియం వంటి కొన్ని నిర్దిష్ట వస్తువులపై విధించిన సుంకాల గురించి కోర్టును పిటి షనర్లు ప్రత్యేకంగా కోరలేదు.సుంకాలను సమర్థించుకోవడానికి ట్రంప్ ఉదహరించిన 19 77 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టం (ఐఈఈపీఏ) భారీ సుంకాలను వి ధించే అధికారం ఇవ్వలేదని ముగ్గురు జడ్జిల ప్యానల్ తన తీర్పులో పేర్కొంది. ''ఐఈఈపీ ఏ ఇచ్చిన అధికారాలను అధ్యక్షుడి టారిఫ్ ఆర్డర్లు మించిపోయాయి.దిగుమతులను ని యంత్రించడానికి ఐఈఈపీఏ కింద అధ్యక్షుడికి ఉన్న అధికారాలు పరిమితం.అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలు ట్రాఫికింగ్ టారిఫ్‌లకు వర్తించని కారణంగా అవి చెల్లవు’’ అని కోర్టు తెలి పింది.ఏప్రిల్,2న ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించినప్పటి నుంచి శ్వేతసౌధం కొన్ని దే శాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి సుంకాలను తగ్గించడం,లేదా మార్చడం వల్ల ప్ర పంచ ఆర్థిక మార్కెట్ల పరిస్థితి రోలర్‌కోస్టర్ రైడ్‌లా మారింది.జపాన్ కు చెందిన నిక్కీ 22 5 సూచీ 1.5శాతం, షాంఘై కాంపోజిట్ 0.7శాతం లాభపడటంతో ఆసియాలోని ప్ర ధాన స్టాక్ మార్కెట్లు గత గురువారం ఉదయం కోలుకున్నాయి.కోర్టు తీర్పు తర్వాత యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ కూడా పెరిగాయి.ఫ్యూచర్స్ అనేది భవిష్యత్తు తేదీలో ఆస్తిని కొ నడానికి లేదా విక్రయించడానికి ఒప్పందాలు చేసుకోవడం.అలాగే అవి మార్కెట్లు తెరిచి నప్పుడు ఎలా ట్రేడ్ అవుతాయో కూడా సూచిస్తాయి.జపాన్ యెన్,స్విస్ ఫ్రాంక్ వంటివా టితోనూ అమెరికా డాలర్ లాభపడింది.
ఇప్పుడేం జరగనుంది ?
కోర్టు తీర్పు తక్షణ పరిణామాలు ఎలా ఉండనున్నాయనేది ఇంకా అస్పష్టంగానే ఉంది.వై ట్ హౌస్ తన అప్పీల్‌లో విఫలమైతే,యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (సీ బీపీ) తన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుందని సీబీపీ మాజీ ఉన్నతాధికారి జాన్ లి యోనార్డ్ చెప్పారు.ఉన్నత న్యాయస్థానం ట్రంప్‌కు మరింత అనుకూలంగా ఉండొచ్చని అంటున్నారు.అయితే అన్ని కోర్టులు ఈ తీర్పును సమర్థిస్తే టారిఫ్‌ల పరిధిలోని వ్యాపారు లు తాము ఇప్పటి వరకు చెల్లించిన మొత్తాలపై వడ్డీతో సహా రీఫండ్స్ పొందుతారు.వీటి లో పరస్పర సుంకాలు అనేవి కూడా ఉన్నాయి,ఇవి చాలా దేశాలకు 10శాతం మేర త గ్గించారు.చైనా ఉత్పత్తులపై 145శాతానికి పెంచినా ప్రస్తుతానికి 30శాతం వద్ద ఉన్నా యి.ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు ఉండవని,సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని లియో నార్డ్ తెలిపారు.స్టీల్,అల్యూమినియం సుంకాలు గత బుధవారం తీర్పుతో ప్రభావితం కా వని,ఎందుకంటే అవి ట్రంప్ తన గ్లోబల్ టారిఫ్ పాలనను సమర్థించడానికి ఉపయోగిం చిన అత్యవసర చర్యలకు భిన్నమైన చట్టం కిందకు వస్తాయని ఆయన అన్నారు. మార్కె ట్ ప్రతిస్పందనలు పాక్షికంగా, "వాణిజ్య యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్విగ్న పరిస్థితుల తరువాత పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు" అని ఎస్‌పీఐ అసెట్ మేనేజ్‌మెంట్‌కు చెందిన స్టీఫెన్ ఇన్నెస్ ఒక కామెంట్రీలో రాశారు.''ఓవల్ కార్యాలయం ట్రేడింగ్ డెస్క్ కా దని,రాజ్యాంగం ఖాళీ చెక్కు కాదని'' అమెరికా న్యాయమూర్తులు స్పష్టమైన సందేశం ఇ చ్చారు.ఈ తీర్పు "కథలో నిర్మాణాత్మక ముందడుగు స్ట్రాంగ్ మ్యాన్ టారిఫ్ ల నుండి సం స్థాగత రక్షణ వరకు" అని ఆయన అన్నారు.

Comments
Post a Comment