కేటీఆర్ కు వరుస షాకులిస్తున్న కవిత...నిరసనలకు పిలుపు...

కేటీఆర్ కు వరుస షాకులిస్తున్న కవిత
నిరసనలకు పిలుపు

VS9TV న్యూస్,తెలంగాణ ప్రతినిధి :

కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై కవిత ఫైర్ అయ్యారు.ఐదో తేదీన కే సీఆర్ కమిషన్ ముందు హాజరవనున్నారు.నాలుగోతేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు.అయితే ఈ నిరసనలు ఏవీ బీఆర్ఎస్ తరపున ఆమె పిలుపునివ్వ లేదు.తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు. ఆమె ఎక్కడికి వెళ్లినా బీఆ ర్ఎస్ నేతలు స్వాగతించడం లేదు...కనీసం సమావేశం అయ్యేందుకు రావడం లేదు. పూర్తిగా సొంత క్యాడర్,అనుచరులతోనే ప్రస్తుతానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.కే సీఆర్ కు నోటీసులు ఇస్తే.. కేటీఆర్ ఓ ట్వీట్ వేసి సర్దుకున్నారని అదే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వస్తే మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చారని కవిత రెండు రోజుల కిందట వ్యాఖ్యా నించారు.ఇప్పుడు కేసీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగారు. కేసీఆర్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు.కవిత నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.ఎందుకంటే కేసీఆర్ కు వచ్చిన కాళేశ్వరం కమిషన్ నోటీసుల గు రించి ఎవరూ పెద్దగా స్పందించలేదు.నిరసనల దాకా ఆలోచించలేదు.కేసీఆర్ కు నోటీ సులు ఇస్తే స్పందించే విధానం ఇదేనా అన్న నిష్ఠూరాలు ఇందుకే వినిపించాయి.తండ్రి కే సీఆర్‌పై తనకు లెక్క లేనంత అభిమానం ఉందని,కేటీఆర్ కే లేదని కవిత నిరూపించా లని అనుకుంటున్నారు.ఈ క్రమంలో ఈ నోటీసుల వ్యవహారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకు న్నారని అనుకోవచ్చు. నాలుగో తేదీన ఆమె పిలుపు మేరకు ఎంత మంది నిరసనలు చేస్తా రన్నదాన్ని బట్టి క్షేత్ర స్థాయిలో ఆమె బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.కేసీఆర్ కో సం చేస్తున్నప్పటికీ ఈ నిరసనల్లో బీఆర్ఎస్ క్యాడర్ పాల్గొనే అవకాశం లేదు.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...